satya nadendla
-
‘ఫార్చూన్’ బిజినెస్ పర్సన్.. నాదెళ్ల
శాన్ ఫ్రాన్సిస్కో: తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. ఈ ఏడాది ‘ఫార్చూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్–2019’ జాబితాలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ధైర్యంగా లక్ష్యాలను చేరుకోవడం, అసాధ్యాలను సుసాధ్యం చేయడం, సృజనాత్మక పరిష్కార మార్గాలను కనుగొనడం వంటి కీలక అంశాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో మొత్తం 20 మంది పేర్లు ఉండగా.. వీరిలో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన వారే ఉండడం విశేషం. ఇక తెలుగు వాడైన సత్య నాదెళ్ల తొలి స్థానంలో ఉండడం మరో విశేషం. వ్యూహాత్మక నాయకుడి పాత్రలో ఒదిగిపోయిన ఆయన.. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా దూసుకుపోతూ కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడం ద్వారా ఈ స్థానానికి చేరుకోగలిగారని ఫార్చూన్ మ్యాగజైన్ ఈ సందర్భంగా కొనియాడింది. తాజాగా 10 బిలియన్ డాలర్ల పెంటగాన్ క్లౌడ్ కాంట్రాక్టును అందుకోవడంలో నాదెళ్ల చూపిన చొరవ కంపెనీని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చిందని స్వయంగా ఆ సంస్థ స్వతంత్ర డైరెక్టర్లు చెప్పినట్లు వివరించింది. బిల్ గేట్స్ వలే వ్యవస్థాపకుడు, స్టీవ్ బాల్మెర్ వంటి సేల్స్ లీడర్ కాకపోయినప్పటికీ.. 2014లో ఆశ్చర్యకరంగా ఆయన ఎన్నిక జరిగింది. ఇటీవలే ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్బీఆర్) రూపొందించిన 10 అగ్రశేణి కంపెనీల సీఈఓల జాబితాలో నాదెళ్ల కూడా ఉన్నారు. బంగాకు 8వ స్థానం: ఫార్చూన్ జాబితాలో మరో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు స్థానం సంపాదించారు. మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా 8వ స్థానంలో ఉండగా.. కాలిఫోర్నియా కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ అరిస్టా హెడ్ జయశ్రీ ఉల్లాల్ 18వ స్థానంలో నిలి చారు. 2వ స్థానంలో ఫోర్టెస్క్యూ మెటల్స్ గ్రూప్ సీఈఓ ఎలిజబెత్ గెయినెస్, చిపోటిల్ మెక్సికన్ గ్రిల్ సీఈఓ బ్రియాన్ నికోల్ 3వ స్థానంలో ఉన్నారు. సింక్రొనీ ఫైనాన్షియల్ సీఈఓ మార్గరెట్ కీనే (4), ప్యూమా సీఈఓ జోర్న్ గుల్డెన్ 5వ స్థానంలో నిలిచారు. -
తర్వాతి రోజుల్లోనే హెడ్మాస్టర్ అయ్యాను!
న్యూఢిల్లీ: భారత క్రికెట్లో క్రమశిక్షణకు మారుపేరైన ఆటగాడిగా అనిల్ కుంబ్లే పేరు వినిపిస్తుంది. కెరీర్లోనూ, ఆ తర్వాత కోచ్‌గా పని చేసినప్పుడు కూడా ఇదే లక్షణం కుంబ్లేను ప్రత్యేకంగా నిలబెట్టింది. చివరకు అదే కారణం చేత ‘హెడ్మాస్టర్’ తరహా శిక్షణ ఇస్తున్నాడనిపించుకొని జట్టు కోచ్ పదవి కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయితే ‘హెడ్మాస్టర్’ ముద్ర తనకు మొదటి నుంచీ లేదని, ఆటగాడిగా తర్వాతి రోజుల్లో తనను అలా పిలవడం మొదలు పెట్టారని అతను అన్నాడు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పుస్తకం ‘హిట్ రిఫ్రెష్’కు సంబంధించి మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడుతూ కుంబ్లే ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఆత్మవిశ్వాసం అనేది నాకు వారసత్వంగానే వచ్చింది. మనల్ని పెంచే క్రమంలో తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మలాంటి వారు మనకు నేర్పే విలువల నుంచి ఇది వస్తుంది. మా తాత స్కూల్లో హెడ్మాస్టర్గా పని చేసేవారు. హెడ్మాస్టర్ అనే పదం నా కెరీర్ తర్వాతి రోజుల్లో నాతో జత చేరుతుందని నాకు బాగా తెలుసు. అది నిజంగానే జరిగింది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకందరికీ బాగా తెలుసు’ అని కుంబ్లే వ్యాఖ్యానించాడు. 2003 – 04 సమయంలో తన కెరీర్ డోలాయమాన స్థితిలో ఉందని, జట్టులో చోటు కోసం హర్భజన్‌తో పోటీ పడుతున్న ఆ సమయంలో తాను రిటైర్ కావాలని కూడా వార్తలు వచ్చాయని కుంబ్లే గుర్తు చేసుకున్నా డు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన అడిలైడ్ టెస్టులో తాను బాగా ఆడటంతో పాటు భారత్ గెలవడంతో తన కెరీర్ మళ్లీ గాడిలో పడిందని కుంబ్లే చెప్పాడు. భారత క్రికెట్లో 1983 వన్డే వరల్డ్ కప్ విజయం, 2001లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లు అత్యుత్తమ ఘట్టాలని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. -
సత్య నాదెళ్ల త్వరలో హైదరాబాద్‌కి
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈవో, భారతీయడు సత్య నాదెళ్ల వచ్చేవారం మరోసారి ఇండియాను సందర్శించనున్నారు. తన పుస్తకం హిట్ రిఫ్రెష్ ప్రమోషన్లో భాగంగా ఆయన రెండు రోజులపాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. నవంబర్ 6-7 తేదీల్లో న్యూఢిల్లీ, హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు, విద్యార్ధులు, ఇతర షేర్ హోల్డర్స్ సహా ప్రముఖ విద్యావేత్తలతో ఆయన భేటీ కానున్నారని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన తన పుస్తకంపై నిర్వహించే ఒక కార్యక్రమంలో వివిధ రంగాలవారితో ముచ్చటిస్తారు. ముఖ్యంగా ఇండస్ట్రీ ప్రముఖులు, కేంద్రప్రభుత్వ అధికారులతో పాటు విద్యార్థులు స్టార్ట్ అప్ కంపెనీలు, ఇతర ప్రముఖులను కలుస్తారు. కాగా భారత సంతతికి చెందిన టెక్ టైకూన్ సత్యనాదెళ్ల ఫిబ్రవరి 2014 లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించగా, ‘హిట్ రిఫ్రెష్’ పుస్తకంతో రచయితగా అవతరించారు. తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన పరివర్తన, మైక్రోసాఫ్ట్ కంపెనీలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత మార్పులు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే మూడింటి ప్రస్తావన ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 26న ఆవిష్కరించిన ఈ పుస్తకం త్వరలో ఇది హిందీ, తెలుగు , తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. హిట్ రిఫ్రెష్ -
కొత్త టెక్నాలజీలు మానవత్వాన్ని ‘మంటగలిపేలా’ ఉండొద్దు: సత్య నాదెళ్ల
ఓర్లాండో: కొంగొత్త టెక్నాలజీలనేవి మనుషులందరినీ ఒకే తాటిపైకి తెచ్చేలా ఉండాలే తప్ప మానవత్వాన్ని మంటగలిపేవిగా ఉండకూడదని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఉత్పాదకత, సమర్ధతను మెరుగుపర్చుకోవాలనుకోవడంలో తప్పు లేదు కానీ, ఈ క్రమంలో మానవతా విలువలు పతనం కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా సత్య ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉత్పాదకత పెంచుకునే పేరిట గతంలో ఎన్నడూ లేనంతగా డిజిటల్ జపం చేస్తున్నాయని, ప్రతి ఒక్కరి జీవితం.. ప్రతి ఒక్క పరిశ్రమపై దీని ప్రభావం పడుతోందని ఆయన చెప్పారు. -
రాయని డైరీ -సత్య నాదెండ్ల
ఉక్కపోతగా ఉంది. విండోస్ తెరిచి కూర్చున్నాను. అయినా గాలి రావడం లేదు. పదో అంతస్తులోని విండో కాస్త పెద్దదిగా ఉంటుంది. ఈమధ్యే దాని తయారీ పూర్తయింది. అక్కడికి వెళ్లి కూర్చున్నాను. అందులోంచీ రావడం లేదు. లోకంలోని గాలంతా హ్యాంగ్ అయిపోయిందా ఏంటి?! స్టాఫ్ కూడా ఒక్కొక్కరూ టెన్త్ ఫ్లోర్‌లోని విండో దగ్గరికి చేరుకుంటున్నారు! వాళ్లకీ గాలి అందుతున్నట్టు లేదు. ‘‘చాలా సఫొకేటింగ్‌గా ఉంది సార్’’ అంటూ కొత్తగా చేరిన అమ్మాయిలు, అబ్బాయిలు ధడేల్మని కిటికీలోంచి బయటికి దూకేస్తున్నారు! ‘‘థామ్సన్... థామ్సన్... చూడండి వాళ్లెలా దూకేస్తున్నారో! చచ్చిపోతారు థామ్సన్. కిటికీ తలుపులు మూసేయండి ప్లీజ్’’ అని వేడుకుంటున్నాను. థామ్సన్ నవ్వుతున్నాడు. ‘‘మిస్టర్ సతియా నాదెన్‌డ్లా... ఆ కిటికీకి తలుపుల్లేవు. బయటి నుంచి ఎవరైనా లోనికి రావడానికి వీలుగా తయారు చేయించాం’’ అంటున్నాడు. కానీ ఆ విండో అలా లేదు. లోపల్నుంచి ఎవరైనా బయటికి పోవడానికి వీలుగా తయారైనట్లుంది! ‘‘అలా మధ్యలోనే దూకేయకూడదని మనం బాండు రాయించుకోవడం లేదా మిస్టర్ ఛైర్మన్’’ అని అడిగాను. థామ్సన్ మళ్లీ నవ్వాడు. ‘‘అది మన ఇమేజ్‌ని దెబ్బతీస్తుందని బోర్డు మీటింగులో అనుకున్నాం కదా సతియా నాదెన్‌డ్లా...’’ అన్నాడు. ‘‘ఇప్పుడు మాత్రం ఇమేజ్ దెబ్బ తినకుండా ఉంటుందా? వాళ్లు చచ్చిపోతే? ఏ కాలో చెయ్యో విరిగితే!’’ థామ్సన్ వినడం లేదు. కిటికీలోంచి బాగా వంగి కిందికి చూస్తున్నాడు. థామ్సన్ కూడా దూకేస్తాడా ఏంటి? ‘‘థామ్సన్ మీరేం చేయబోతున్నారో మీకు తెలుస్తోందా?’’ అని పెద్దగా అరిచాను. ‘‘ఈ అరవై ఆరేళ్ల వయసులో దూకి మాత్రం నేను చేయగలిగిందేముంది నాదెన్‌డ్లా’’ అన్నాడాయన కిటికీలోంచి పైకి లేస్తూ! నాకేం అర్థం కావడం లేదు. గాలి కూడా అందడం లేదు. అంతా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ‘‘వీళ్లంతా ఏదో అయిపోవాలని దూకడం లేదు నాదెన్‌డ్లా... ఏదైనా అయిపోదామని దూకుతున్నారు’’ అంటున్నాడు థామ్సన్! కిటికీ అంచుకు వెళ్లి కిందికి వంగి చూశాను. దూకినవాళ్లెవరూ కనిపించలేదు. దూరంగా మాత్రం ఆపిల్, గూగుల్... రెండూ రెండు కొండల్లా కనిపిస్తున్నాయి. ఆ కొండలేనా గాలిని ఇటువైపు రాకుండా బ్లాక్ చేస్తున్నది! కళ్లు మూసుకున్నాను. అలా చాలాసేపు ఉండిపోయాను. సడెన్‌గా నాలో ఏదో సిస్టమ్ స్టార్ట్ అయినట్లనిపించింది. చల్లటి గాలి ఒంటిని తాకుతోంది! కళ్లు తెరిచాను. ఎదురుగా థామ్సన్. ‘‘ఏసీ వేసుకోకుండా కూర్చున్నారేం నాదెన్‌డ్లా!’’ అంటున్నాడు. నిజమే! ‘‘విండోస్ టెన్‌లోకి మళ్లీ స్టార్ట్ బటన్ ఇవ్వడం బాగుందని అంతా అంటున్నారు నాదెన్‌డ్లా’’ అన్నాడు. నవ్వాను. ట్రెడిషనా? ఇన్నొవేషనా? దేనిని గౌరవించాలి మనం? స్టార్ట్ బటన్ వైపు చూశాను. ఇన్నొవేషన్ విత్ ట్రెడిషన్లా కనిపించింది. -మాధవ్ శింగరాజు -
మైక్రో షాక్