కొత్త టెక్నాలజీలు మానవత్వాన్ని ‘మంటగలిపేలా’ ఉండొద్దు: సత్య నాదెళ్ల | New technologies should not degrade humanity: Satya Nadella | Sakshi
Sakshi News home page

కొత్త టెక్నాలజీలు మానవత్వాన్ని ‘మంటగలిపేలా’ ఉండొద్దు: సత్య నాదెళ్ల

Published Tue, Sep 26 2017 1:05 AM | Last Updated on Tue, Sep 26 2017 1:05 AM

New technologies should not degrade humanity: Satya Nadella

ఓర్లాండో: కొంగొత్త టెక్నాలజీలనేవి మనుషులందరినీ ఒకే తాటిపైకి తెచ్చేలా ఉండాలే తప్ప మానవత్వాన్ని మంటగలిపేవిగా ఉండకూడదని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఉత్పాదకత, సమర్ధతను మెరుగుపర్చుకోవాలనుకోవడంలో తప్పు లేదు కానీ, ఈ క్రమంలో మానవతా విలువలు పతనం కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.

మైక్రోసాఫ్ట్‌ ఇగ్నైట్‌ సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా సత్య ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉత్పాదకత పెంచుకునే పేరిట గతంలో ఎన్నడూ లేనంతగా డిజిటల్‌ జపం చేస్తున్నాయని, ప్రతి ఒక్కరి జీవితం.. ప్రతి ఒక్క పరిశ్రమపై దీని ప్రభావం పడుతోందని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement