న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈవో, భారతీయడు సత్య నాదెళ్ల వచ్చేవారం మరోసారి ఇండియాను సందర్శించనున్నారు. తన పుస్తకం హిట్ రిఫ్రెష్ ప్రమోషన్‌లో భాగంగా ఆయన రెండు రోజులపాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. నవంబర్ 6-7 తేదీల్లో న్యూఢిల్లీ, హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల సందర్శిస్తారు. ఈ సందర‍్భంగా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు, విద్యార్ధులు, ఇతర షేర్ హోల్డర్స్ సహా ప్రముఖ విద్యావేత్తలతో ఆయన భేటీ కానున్నారని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన తన పుస్తకంపై నిర్వహించే ఒక కార్యక్రమంలో వివిధ రంగాలవారితో ముచ్చటిస్తారు. ముఖ‍్యంగా ఇండస్ట్రీ ప్రముఖులు, కేంద్రప్రభుత్వ అధికారులతో పాటు విద్యార్థులు స్టార్ట్ అప్ కంపెనీలు, ఇతర ప్రముఖులను కలుస్తారు.
కాగా భారత సంతతికి చెందిన టెక్ టైకూన్ సత్యనాదెళ్ల ఫిబ్రవరి 2014 లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించగా, ‘హిట్ రిఫ్రెష్’ పుస్తకంతో రచయితగా అవతరించారు. తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన పరివర్తన, మైక్రోసాఫ్ట్ కంపెనీలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత మార్పులు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే మూడింటి ప్రస్తావన ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 26న ఆవిష్కరించిన ఈ పుస్తకం త్వరలో ఇది హిందీ, తెలుగు , తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. హిట్ రిఫ్రెష్
Comments
Please login to add a commentAdd a comment