Hit Refresh
-
‘నేనేం సచిన్ అభిమానిని కాదు’
సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను అభిమానించనవారు ఎవరుండరూ.. కానీ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల మాత్రం తనకు ఇష్టమైన క్రికెటర్ సచిన్ కాదంటున్నాడు. భారత్ పర్యటనలో ఉన్న సత్యనాదేళ్ల ఓ జాతీయ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో అడిగిన ర్యాఫిడ్ ఫైర్ ప్రశ్నకు ఇలా సమాదానం ఇచ్చాడు. మీరు అభిమానించే క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. లేక 1960 దిగ్గజం హైదరాబాది క్రికెటర్ ఎంఎల్ జయసింహానా అని ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు సత్యనాదేళ్ల ఇది చాల కఠినమైన ప్రశ్న అని, నేను మాత్రం ఓ హైదరాబాదిగా జయసింహానే అభిమానిస్తానని తెలిపాడు. ఇక తన ‘హిట్ రిఫ్రేష్’ బుక్‌లో జయసింహా గురించిన ప్రస్తావించిన సత్యనాదేళ్ల ఓ సందర్భాన్ని వివరించారు. ఓ రోజు తన గదిలో తన తండ్రి కారల్ మార్క్స్ ఫొటోను తగిలించాడని, వెంటనే తన తల్లి లక్ష్మీదేవి ఫోటోను పెట్టిందని తాను మాత్రం తన హీరో జయసింహా ఫోటోనే కావలనుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక జయసింహా మైదానం బయట గుడ్ స్టైల్ లుకింగ్‌తో రాక్‌స్టార్‌లా ఉండేవాడని తెలిపాడు. 1959-1971 మధ్య కాలంలో 39 టెస్టులాడిన జయసింహా 2056 పరుగులు చేశాడు. మైదానంలో స్టైలీష్ బ్యాటింగ్‌తో రాణించేవాడు. ఆయన బ్యాటింగ్ శైలిని వీవీఎస్ లక్ష్మణ్, అజారుద్దీన్ వంటి క్రెటర్లు అనుకరించారు. -
ప్రపంచాన్ని మార్చేవి ఆ మూడే!
న్యూఢిల్లీ: మిక్స్డ్ రియాలిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ రానున్న సంవత్సరాల్లో ప్రపంచ రూపు రేఖలను మార్చే టెక్నాలజీలుగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అభివర్ణించారు. మిక్స్డ్ రియాలిటీని హైబ్రిడ్ రియాలిటీగా కూడా చెబుతారు. రియల్, వర్చువల్ టెక్నాలజీల కలబోత ఇది. కంప్యూటింగ్ ఇప్పటి వరకు మనిషి ఆధారితంగానే మెరుగుపడగా, అంతిమంగా కంప్యూటింగ్ అనుభవం మిక్స్డ్ రియాలిటీగానే ఉండబోతుందన్నారు సత్య నాదెళ్ల. తన పుస్తకం ‘హిట్ రిఫ్రెష్’ ప్రచారం కోసం భారత్‌కు వచ్చిన సత్య.. మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. మాజీ క్రికెటర్ అనిల్‌కుంబ్లేతో సమావేశమైన సందర్భంగా ఎన్నో విషయాలపై మాట్లాడారు. మైక్రోసాఫ్ట్ హోలోలెన్స్ గురించి కూడా ప్రస్తావించారు. విద్యతో పాటు చాలా రంగాల్లో హోలోలెన్స్‌ను వినియోగిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హోలోలెన్స్ సాయంతో యూజర్లు వర్చువల్ రియాలిటీ భావన పొందుతారు. తాను సైతం హోలోలెన్స్ వాడి చూశానని, అంగారకుడిపై నడిచిన భావన గొప్పగా ఉందని కుంబ్లే తన అనుభవాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘43 ఏళ్ల ప్రయాణంలో మైక్రోసాఫ్ట్ ప్రతి ఐదేళ్లకోసారి అస్తిత్వ ముప్పును ఎదుర్కోవడం నేను చూశా. ఏదో ఒక కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు ముగింపు పలుకుతుందని కొంత మంది అన్నారు. కానీ అది జరగలేదు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ తన స్థానాన్ని కాపాడుకునేందుకు ఏదో ఒకటి తప్పకుండా చేస్తుంది’’ అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. కాగా, మైక్రోసాఫ్ట్ మంగళవారం రుహ్ అనే చాట్‌బోట్‌ను ప్రదర్శించింది. -
నా చివరి టెస్టు మ్యాచ్ నీ చివరి మ్యాచే..
సాక్షి, న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్లతో టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే సరదాగా గడిపారు. మంగళవారం ఢిల్లీలోజరిగిన సత్య నాదేళ్ల ‘హిట్ రిఫ్రేష్’ బుక్ ప్రమోషన్ కార్యక్రమంలో ఈ ఇద్దరు లెజెండ్స్ సమావేశమయ్యారు. పాత విషయాలని నెమరు వేసుకుంటూ సరదాగా ముచ్చటించారు. తను చూసిన చివరి టెస్టు కుంబ్లే చివరిగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఆడిన మ్యాచ్‌నే చూశానని సత్యనాదేళ్ల తెలిపారు. క్రికెట్ మైదానం నుంచి సీఈవో ఆఫీస్ వరకు మూడు గుణపాఠాలు నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్‌లో విస్తరిస్తున్న టెక్నాలిజీ గురించి కూడా చర్చించుకున్నారు. ఇక ఈ భేటి విషయాన్ని కుంబ్లే‘ మైక్రోసాఫ్ట్ సత్యనాదేళ్లతో ఓ గొప్పసమావేశం జరిగింది అని ట్వీట్ చేశారు. . Had a great conversation with @satyanadella. A privilege & honour. @MicrosoftIndia #HitRefresh pic.twitter.com/BRgGiy29DW — Anil Kumble (@anilkumble1074) 7 November 2017 -
తెలుగులో సత్య నాదెళ్ల పుస్తకం ‘హిట్ రీఫ్రెష్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈఓ, హైదరాబాద్ వాస్తవ్యుడైన సత్య నాదెళ్ల రాసిన ‘హిట్ రీఫ్రెష్’ పుస్తకం ఈ నెలాఖరులోగా తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటూ హిందీ, తమిళం భాషల్లోనూ ఈ పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. హిందీ ఎడిషన్‌ను హార్పెర్ కొల్లిన్స్ ఇండియా, తెలుగు, తమిళం ఎడిషన్లను వెస్ట్‌ల్యాండ్ బుక్స్ పబ్లిష్ చేయనున్నాయి. గతేడాది సెప్టెంబర్ 26న ఇంగ్లిష్ విడుదలైన ఈ పుస్తకం ధర రూ.599. నాదెళ్ల ‘హిట్ రీఫ్రెష్’ పుస్తకంలో తన వ్యక్తిగత జీవితంతో పాటూ మైక్రోసాఫ్ట్‌లో తన ప్రయాణం, ఇతరత్రా అనుభవాలను రాశారు. పుస్తక ప్రచారం నిమిత్తం రెండు రోజుల పాటు దేశీయ పర్యటనకు వచ్చిన నాదెళ్ల సోమవారం హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు. స్థానిక ఉద్యోగులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారని కంపెనీ వర్గాలు తెలిపాయి. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాదెళ్ల.. ఉద్యోగ అనుభవాలతో పాటూ సీఈఓగా ఎదిగిన ప్రయాణం గురించి ఉద్యోగులతో పంచుకున్నారని తెలిసింది. మంగళవారం ఢిల్లీలో జరగనున్న ‘ఇండియా టుడే కాన్క్లేవ్ నెక్స్›్ట 2017’లో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
సత్య నాదెళ్ల త్వరలో హైదరాబాద్‌కి
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈవో, భారతీయడు సత్య నాదెళ్ల వచ్చేవారం మరోసారి ఇండియాను సందర్శించనున్నారు. తన పుస్తకం హిట్ రిఫ్రెష్ ప్రమోషన్లో భాగంగా ఆయన రెండు రోజులపాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. నవంబర్ 6-7 తేదీల్లో న్యూఢిల్లీ, హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు, విద్యార్ధులు, ఇతర షేర్ హోల్డర్స్ సహా ప్రముఖ విద్యావేత్తలతో ఆయన భేటీ కానున్నారని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన తన పుస్తకంపై నిర్వహించే ఒక కార్యక్రమంలో వివిధ రంగాలవారితో ముచ్చటిస్తారు. ముఖ్యంగా ఇండస్ట్రీ ప్రముఖులు, కేంద్రప్రభుత్వ అధికారులతో పాటు విద్యార్థులు స్టార్ట్ అప్ కంపెనీలు, ఇతర ప్రముఖులను కలుస్తారు. కాగా భారత సంతతికి చెందిన టెక్ టైకూన్ సత్యనాదెళ్ల ఫిబ్రవరి 2014 లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించగా, ‘హిట్ రిఫ్రెష్’ పుస్తకంతో రచయితగా అవతరించారు. తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన పరివర్తన, మైక్రోసాఫ్ట్ కంపెనీలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత మార్పులు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే మూడింటి ప్రస్తావన ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 26న ఆవిష్కరించిన ఈ పుస్తకం త్వరలో ఇది హిందీ, తెలుగు , తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. హిట్ రిఫ్రెష్ -
2017లో సత్య నాదెళ్ల తొలి పుస్తకం.. ‘హిట్ రిఫ్రెష్’
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్’ సీఈవో ‘సత్య నాదెళ్ల’ రచించిన తొలి పుస్తకం ‘హిట్ రిఫ్రెష్’ వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. ఈ పుస్తకంప్రింటింగ్ రైట్స్‌ను ‘హార్పర్ బిజినెస్’ సొంతం చేసుకుంది. అంటే ఈ సంస్థ నాదెళ్ల పుస్తకాన్ని ఆంగ్లంలో ప్రింట్ చేసి అంతర్జాతీయంగా విక్రయిస్తుంది. హిట్ రిఫ్రెష్ పుస్తకం.. మార్పునకు సంబంధించిందని సత్య నాదెళ్ల తెలిపారు. ఎలా విజయవంతమవ్వాలి? చరిత్ర.. జ్ఞాపకాలు వంటి అంశాలకు సంబంధించినది కాదని చెప్పారు. పుస్తకంలో ప్రధానంగా తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన పరివర్తన, మైక్రోసాఫ్ట్ కంపెనీలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత మార్పులు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే మూడింటి ప్రస్తావన ఉంటుందని వివరించారు. -
నాదెళ్ల తొలిపుస్తకానికి ముహుర్తం ఖరారు
న్యూఢిల్లీ : మైక్రోసాప్ట్ సీఈవో సత్యనాదెళ్ల తొలిపుస్తకానికి ముహుర్తం ఖరారైంది. వచ్చే ఏడాది(2017) నుంచి అన్ని స్టోర్లలో అందుబాటులోకి రానుంది. మార్పు అనే కాన్సెప్ట్ తో నాదెళ్ల రాసిన హిట్ రీఫ్రెష్ అనే బుక్ ను మూడు స్టోరీ లైన్లను ప్రతిబింబిస్తూ మార్కెట్లోకి రాబోతుంది. ఎలా విజయం సాధించాలి, లేదా నాదెళ్లకు ఓ జ్ఞాపకంలా ఈ బుక్ ను మార్కెట్లోకి రావడం లేదని, పూర్తిగా మార్పుకు సంబంధించే నాదెళ్ల ఈ బుక్ ను రచించినట్టు తెలుస్తోంది. నాదెళ్ల వ్యక్తిగత జీవిత ప్రయాణంలోని పరిణామాలు, సాంకేతిక సంస్థల మధ్య నేడు నెలకొంటున్న మార్పు, మన జీవనంలో ఇంటెలిజెన్స్ మిషన్స్ తీసుకొస్తున్న మార్పు లను నాదెళ్ల ఈ బుక్ వివరించబోతున్నారని పబ్లిషర్ హార్పెర్ బిజినెస్ చెప్పింది. సత్య నాదెళ్ల తొలి పుస్తకానికి హార్పెర్ కొల్లిన్స్ పబ్లిషర్ ప్రపంచ ఇంగ్లిష్ ప్రింటింగ్ హక్కులను దక్కించుకుంది. లెవిన్ గ్రీన్‌బెర్గ్ రోస్టన్ లిటరరీ ఏజెన్సీ జేమ్స్ లెవిన్ తో ఒప్పంద చర్చలు జరిగాయని హార్పెర్ బిజినెస్ ల వైస్ ప్రెసిడెంట్, ప్రచురణ కర్త హోల్లియిస్ హేమ్ బౌచ్ తెలిపారు. 2017లో దీన్ని పబ్లిష్ చేస్తున్నామని ప్రకటించారు. ప్రజలు, ఆర్గనైజేషన్స్, సొసైటీల్లో ఎలా మార్పులు సంభవిస్తున్నాయో అన్వేషిస్తూ హిట్ రీఫ్రెష్ ను నాదెళ్ల రచించారు. న్యూ ఎనర్జీ, న్యూ ఐడియాలు, రిలవెన్స్ లను నిరంతర తపనగా హిట్ రీఫ్రెష్ బుక్ ద్వారా నాదెళ్ల మనకు తెలియజేయబోతున్నారు. ఈ బుక్ అంతా మార్పు అనే అంశంపైనే ఉంటుందని నాదెళ్ల పేర్కొన్నారు. ఈ బుక్ ను మైక్రోసాప్ట్ టీమ్ మెంబర్లకు, కస్టమర్లకు, పార్టనర్లను ఉద్దేశించి రచించానని, మార్పుకు సంబంధించిన స్టోరీలు కచ్చితంగా వీరికి ఉపయోగపడతాయని విశ్వసిస్తున్నట్టు, వారి సొంత బాటలో నడవడానికి మార్గ నిర్దేశం చేస్తుందని తెలిపారు.