Satyameva Jayate TV show
-
మూసీ ప్రక్షాళన.. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి..?
-
ట్రోల్స్, రోస్టర్స్ ముసుగులో రెచ్చిపోతున్న కామాంధులు..
-
Satyameva Jayate: పోలీసులకు మరింత పవర్.. లాభమా..? నష్టమా..?
-
‘ఆ సినిమా కథ కాపీరైట్స్ నావే’
సాక్షి, హైదరాబాద్ : తాను కాపీరైట్స్ తీసుకున్న కథను మరొకరికి విక్రయించిన వ్యక్తిపై, ఆ కథతో సినిమాను తెరకెక్కించిన నిర్మాత, నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని రచయిత డాక్టర్ నంది చిన్నికుమార్ విజ్ఞప్తి చేశాడు. మంగళవా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ఆమీర్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే ‘సత్యమేవ జయతే’ కార్యక్రమంలో నాగ్‌పూర్‌కు చెందిన అఖిలేపాల్ అనే వ్యక్తి జీవిత కథను విన్నానని తెలిపారు. ఆయన ఓ మురికివాడలో పుట్టి ఎన్నో నేరాలు చేసి తర్వాత ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదిగి బ్రెజిల్లో జరిగిన సాకర్ కప్ టోర్నమెంట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడన్నారు. ప్రస్తుతం మురికివాడల్లోని, రెడ్‌లైట్ ఏరియాల్లోని పిల్లలకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అతని జీవిత కథ తనకెంతో నచ్చడంతో ఆయన దగ్గరికెళ్లి సినిమా తీసేందుకు 2018 మార్చి 19న కాపీరైట్స్ అగ్రిమెంట్ చేసుకున్నానని వివరించారు. ఇందుకు కొంత నగదు కూడా చెల్లించినట్లు పేర్కొన్నారు. తాను సినిమా స్టోరీ అంతా సిద్ధం చేసుకొని... నటీనటులు, నిర్మాతల కోసం వెతుకుతున్నానన్నారు. కాగా ఇటీవల విడుదలైన విజిల్ (తెలుగు), తమిళ్లో (బిగిల్) సినిమా తాను కాపీరైట్స్ తీసుకున్నదేనన్నారు. దీనిపై పాల్‌ను సంప్రదించగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా బృందాన్ని సంప్రదించినా స్పందన లేదన్నారు. దీంతో తెలంగాణ సినిమా రైటర్స్ అసోసియేషన్, సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోనూ అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేయగా, వారు బాధ్యులపై కేసు నమోదు చేశారన్నారు. దీనిపై త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తానన్నారు. -
ఆ పాట నన్ను స్టార్‌ని చేసింది!
సంభాషణం: సత్యమేవ జయతే కార్యక్రమం చూసినవాళ్లకి సోనా మహాపాత్ర గురించి చెప్పాల్సిన పని లేదు. ఎపిసోడ్ చివర్లో ఆమె పాడే ఒక్క పాట... వేలాదిమంది కళ్లు చెమర్చేలా చేస్తుంది. ఆ ప్రోగ్రామ్‌తో ఎంతోమందికి అభిమాన గాయనిగా మారిన సోనా మనసులోని మాటలు... మీరు క్లాసికల్ సింగరా? అవును. కానీ స్టేజీల మీద ప్రదర్శనలివ్వడానికే నా టాలెంట్‌ని పరిమితం చేయదలచుకోలేదు. ఆల్బమ్స్ చేశాను. సినిమాల్లో పాడాను. కాన్సర్ట్స్ ఇచ్చాను. అడ్వర్టయిజ్మెంట్లకి కూడా స్వరమిచ్చాను. పాటంటే ఎందుకంత ప్రేమ? తెలియదు. కటక్‌లోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. చిన్నప్పుడే సంగీతం పట్ల ఆసక్తి ఏర్పడింది. అయితే చదువులోనూ వెనకబడలేదు. బీటెక్ పూర్తి చేసి, ఎంబీయే కూడా చేశాను. ప్యారచూట్, మెడికర్ లాంటి ఉత్పత్తులకు బ్రాండ్ మేనేజర్‌గా పని చేశాను. అయితే ఏ దారిలో సాగినా నా గమ్యం సంగీతమే అనిపించి ఇటువైపు వచ్చేశాను. జింగిల్స్‌తో ప్రారంభించాను. తర్వాత సోనీ కంపెనీ సహకారంతో ‘సోనా’ అనే ఆల్బమ్ రిలీజ్ చేశాను. ఢిల్లీ బెల్లీ, ఐ హేట్ లవ్‌స్టోరీస్, తలాష్ వంటి సినిమాలకు పాడాను. కానీ మీరంటే ఏంటో ‘సత్యమేవ జయతే’తోనే తెలిసింది...? అవును. అసలా కార్యక్రమమే ఎంతో గొప్ప ఆలోచనతో చేస్తున్నది. సమాజంలో మార్పు తీసుకువచ్చే లక్ష్యంతో ఆమిర్‌ఖాన్ దాన్ని ప్రారంభించారు. ప్రతి ఎపిసోడ్ చివర్లో ఆ కాన్సెప్ట్‌తోనే ఓ పాట పెట్టాలనుకున్నారు. అది పాడే చాన్స్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. ‘ముఝేకా బేచేగా రూపయా’ పాటయితే నన్ను స్టార్‌ని చేసేసింది. సింగర్‌గా మీకున్న బలం ఏమిటి? ఫీలై పాడటం. పాటలో లీనమవడం వల్లే సత్యమేవ జయతే పాటలతో కదిలించగలిగాను. నా ఇంకో బలం... నా భర్త రామ్. తను కంపోజర్. మాకు ముంబైలో ప్రొడక్షన్ హౌస్ ఉంది. తన ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తోంది.