satyanarayana puram
-
ఇంటిపై దాడి.. ఆపై యువతిపై అత్యాచారయత్నం
తిరుపతి: ఓ ఇంటిపై దాడి చేసిన యువకులు.. ఆ ఇంట్లో ఉన్న ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన తిరుపతిలోని సత్యనారాయణపురంలో శుక్రవారం వెలుగుచూసింది. దాంతో బాధితురాలు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నేత్రపర్వం..కలశజ్యోతి మహోత్సవం
విజయవాడ, న్యూస్‌లైన్ : బెజవాడ దుర్గమ్మ కలశజ్యోతి మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సత్యనారాయణపురంలోని శివరామకృష్ణక్షేత్రం నుంచి కలశజ్యోతి ప్రదర్శన ప్రారంభమైంది. ప్రత్యేకంగా అలంకరించిన పుష్పకవాహనంపై శ్రీ గంగాపార్వతీసమేత మల్లేశ్వరస్వామి కొలువుదీరారు. ఉత్సవమూర్తులకు ఇన్చార్జి ఈవో త్రినాథ్‌రావు పూజాదికాలు నిర్వహించి ప్రదర్శన ప్రారంభించారు. భవానీలు కలశాలను చేతబూని జై భవానీ, జై ైజై భవానీ నామస్మరణ చేస్తూ ముందుకుసాగారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ ప్రదర్శన కనులపండువగా సాగింది. బాల భవానీలు జ్యోతులను పట్టుకుని వడివడిగా అడుగులు వేశారు. ఉత్సవమూర్తులు కొలువుదీరిన వాహనంతోపాటు దేవస్థాన ప్రచార రథంతో ఊరేగింపు గాంధీనగర్, అలంకార్ టాకీస్, చల్లపల్లి బంగళా మీదుగా ప్లైఓవర్ ఎక్కి కెనాల్ రోడ్డు, టోల్‌గేటు మీదుగా ఓం టర్నింగ్ వరకు సాగింది. అక్కడ జ్యోతులను ఉంచి భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. కలశజ్యోతి ఉత్సవంలో స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాదశర్మ, మల్లేశ్వరాలయ ప్రధాన అర్చకులు యనమండ్ర మల్లయ్యశాస్త్రి, వైదిక కమిటీ సభ్యులు మురళి, షన్ముఖ, అర్చకులు కోట ప్రసాద్, శంకరమంచి ప్రసాద్, యజ్ఞనారాయణ, ఆలయ ఈఈ కోటేశ్వరరావు, స్తపతి రామబ్రహ్మం, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
బెజవాడ జంట హత్యల కేసులో పురోగతి
విజయవాడ : విజయవాడ సత్యనారాయణపురంలో నిన్న రాత్రి జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నగలు, నగదు కోసమే నిందితుడు ఈ హత్యలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో లిప్ట్ మెకానిక్ ప్రధాని నిందితుడిగా భావిస్తున్నారు. పండక్కి అందరూ ఊరెళ్లారని తెల్సుకుని .. ఇంట్లో బామ్మ, మనవరాలే ఉన్నారని గమనించి దుండగుడు ఈ ఘటనకు పాల్పడ్డారు. అత్యంత దారుణంగా కత్తులతో గొంతుకోసి, ఇక చోరీ చేద్దామనేలోగా, ఏదో అలికిడి వినబడి పారిపోయాడు. ఈ దారుణంలో సత్యనారాయణ భార్య పుణ్యవతి, మనవరాలు సాయిచంద్రికలు అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. చంద్రికతో ఆడుకుందామని ఆమె ఇంటికి వచ్చిన స్నేహితులు .. వారిద్దరూ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి పెద్దలకు చెప్పగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బెజవాడలో జంట హత్యల కలకలం
విజయవాడ : విజయవాడ సత్యనారాయణపురంలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. తాడంకి వారి వీధిలోని ఓ ఇంట్లో వృద్ధురాలు, మనవరాలును ....దుండగులు గొంతు కోసి దారుణంగా హతమార్చారు. వన్‌టౌన్ శివాలయం వీధిలో బంగారం వ్యాపారం చేస్తున్న సత్యనారాయణకు ఇద్దరు కుమారులు. దసరా సెలవులు కావటంతో ఇద్దరు కుమారులు ఊరికి వెళ్లిన సమయంలో ఆగంతకులు సత్యనారాయణ భార్య పుణ్యవతి, రెండవ కుమారుడు కుమార్తె సాయి చంద్రికను అతి కిరాతంగా గొంతు కోశారు. గత రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న డీసీపీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఎవరు లేని విషయాన్ని గమనించిన దుండగులు డబ్బు కోసమే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని డీసీపీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు లిప్ట్ మెకానిక్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
బెజవాడలో జంట హత్యల కలకలం