బెజవాడలో జంట హత్యల కలకలం | Double murder at vijayawada | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 15 2013 8:19 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

విజయవాడ సత్యనారాయణపురంలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. తాడంకి వారి వీధిలోని ఓ ఇంట్లో వృద్ధురాలు, మనవరాలును ....దుండగులు గొంతు కోసి దారుణంగా హతమార్చారు. వన్టౌన్ శివాలయం వీధిలో బంగారం వ్యాపారం చేస్తున్న సత్యనారాయణకు ఇద్దరు కుమారులు. దసరా సెలవులు కావటంతో ఇద్దరు కుమారులు ఊరికి వెళ్లిన సమయంలో ఆగంతకులు సత్యనారాయణ భార్య పుణ్యవతి, రెండవ కుమారుడు కుమార్తె సాయి చంద్రికను అతి కిరాతంగా గొంతు కోశారు. గత రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న డీసీపీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఎవరు లేని విషయాన్ని గమనించిన దుండగులు డబ్బు కోసమే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని డీసీపీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు లిప్ట్ మెకానిక్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement