విజయవాడ : విజయవాడ సత్యనారాయణపురంలో నిన్న రాత్రి జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నగలు, నగదు కోసమే నిందితుడు ఈ హత్యలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో లిప్ట్ మెకానిక్ ప్రధాని నిందితుడిగా భావిస్తున్నారు. పండక్కి అందరూ ఊరెళ్లారని తెల్సుకుని .. ఇంట్లో బామ్మ, మనవరాలే ఉన్నారని గమనించి దుండగుడు ఈ ఘటనకు పాల్పడ్డారు.
అత్యంత దారుణంగా కత్తులతో గొంతుకోసి, ఇక చోరీ చేద్దామనేలోగా, ఏదో అలికిడి వినబడి పారిపోయాడు. ఈ దారుణంలో సత్యనారాయణ భార్య పుణ్యవతి, మనవరాలు సాయిచంద్రికలు అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. చంద్రికతో ఆడుకుందామని ఆమె ఇంటికి వచ్చిన స్నేహితులు .. వారిద్దరూ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి పెద్దలకు చెప్పగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బెజవాడ జంట హత్యల కేసులో పురోగతి
Published Tue, Oct 15 2013 2:43 PM | Last Updated on Sat, Sep 29 2018 4:52 PM
Advertisement
Advertisement