Satyapal
-
రాయని డైరీ: సత్యపాల్, మేఘాలయ గవర్నర్
పంజాబ్‌లో రైతులు ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని అడ్డుకున్నారని విన్నాక ఆయనకు ఫోన్ చేయబోయి కూడా ఆగిపోయాను. అప్పటికే ఆయన ఘోర భద్రతా వైఫల్యంతో కుంగిపోతూ ఢిల్లీలో ల్యాండ్ అయి ఉంటారు కనుక ఆ సమయంలో ఆయన్ని కదిలించడం ఎందుకని నాకు అనిపించింది. ఒకవేళ నేను మోదీని పలకరించే ప్రయత్నం చేసి, అది సఫలం అయినప్పటికీ.. ‘ప్రధాని కాన్వాయ్‌ని అడ్డుకోవడం చిన్న విషయమేమీ కాదు మోదీజీ..’ అనే ఒక దిగ్భ్రాంతిపూర్వక ప్రారంభవాక్యంతో నా పరామర్శ మొదలవవలసి వచ్చేది. అప్పుడు మోదీజీ.. ‘నా కాన్వాయ్‌ని అడ్డుకోవడం చిన్న విషయం కాదని అంటున్నారంటే.. అడ్డుకున్నవాళ్లు చిన్నవాళ్లు కాదని నాకు చెబుతున్నారా..’ అని నాతో అని ఉండేవారు. మోదీజీకి కొన్నాళ్లుగా రైతులు గానీ, రైతుల వైపు మాట్లాడుతున్న నేను గానీ నచ్చడం లేదు. బహుశా అమిత్‌షా కూడా మోదీజీకి నచ్చకపోతుండవచ్చు. రైతుల విషయంలో మోదీజీకి మతి తప్పిందని అమిత్‌షా నాతో అన్నట్లు నేను అన్నానని కాంగ్రెస్ వాళ్లు ట్విట్టర్లో వీడియో పెట్టడం మోదీజీ దృష్టికి వెళ్లే ఉంటుంది. అమిత్‌షా కూడా షాక్ అయి, వెంటనే నాకు కాల్ చేశారు. ‘‘మీ పేరు సత్యపాల్ కావచ్చు. మీరిప్పుడు ఒక రాష్ట్రానికి గవర్నర్ కావచ్చు. ఒకప్పుడు నాలుగు రాష్ట్రాలకు మీరు గవర్నర్‌గా పని చేసి ఉండొచ్చు. కానీ మీరున్నది బీజేపీలో! బీజేపీలో ఉంటూ బీజేపీలోనే ఒకరికొకరికి తగవు ఎలా పెడతారు? ‘షాజీకి మోదీజీపై ఎనలేని గౌరవం ఉంది’ అని వెంటనే మీకై మీరే ఒక ప్రకటన ఇవ్వండి’’ అన్నారు! సందర్భశుద్ధి లేని గౌరవ ప్రకటన మోదీజీకి ఎలా సమ్మతమౌతుంది? ఢిల్లీలో అమిత్ షా అంతర్గత భద్రతపై ఇంటెలిజెన్స్‌తో భేటీ పెట్టిన రెండో రోజే పంజాబ్‌లో ప్రధాని కాన్వాయ్ ఫ్లై ఓవర్ మీద ఆగిపోయింది! ఇది కూడా మోదీజీ మనసులో ఉండే ఉంటుంది. అలాంటప్పుడు తను ప్రాణా లతో బయట పడినందుకు పంజాబ్ సీఎంకి కాదు మోదీజీ ధన్యవాదాలు చెప్పవలసింది... దేశ హోమ్ మంత్రి అమిత్‌షాకి! ‘రైతులతో మీరు స్నేహపూర్వకంగా ఉండటం లేదు మోదీజీ’ అని మోదీజీతో పర్సనల్ మీటింగ్‌లో నేను అన్నప్పుడు.. ‘ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు? వెళ్లి అమిత్‌షాతో మాట్లాడండి..’ అన్నారు మోదీజీ! ఆ మాట చెప్పినప్పుడు నాతో అమిత్ షా అన్నమాటే.. మోదీజీకి మతి పోయిందని! రైతుల గురించి ప్రధానితో మాట్లాడాలి. లేదంటే వ్యవసాయశాఖ మంత్రితో మాట్లాడాలి. హోమ్ మినిస్టర్‌తో మాట్లాడమని అన్నారంటే.. మోదీజీ రైతుల సమస్యల్ని దేశ శాంతి భద్రతల సమస్యగా చూస్తున్నారా?!! మోదీజీకి రైతులు నచ్చకపోవడం ఎలా ఉన్నా, రైతులకు ఇప్పుడు నరేంద్ర అనే పేరే నచ్చడం లేదనిపిస్తోంది. సాగు చట్టాల్ని రద్దు చేసి రైతులకు మోదీజీ క్షమాపణ చెప్పి ఉండొచ్చు. మళ్లీ ఆ చట్టాలను తెస్తాం అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అనడం రైతుల్ని గాయపరిచింది. ఆయన పేరులోనూ ‘నరేంద్ర’ ఉంది. నరేంద్ర సింగ్ తోమర్ ఆయన. పీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతుల వెనుక ఎవరున్నారో తెలుసుకోవడం కోసం దర్యాప్తు మొదలైంది. ఎవరిని బుక్ చేస్తారు? రైతుల పోరాటాన్ని నడిపిన ఇద్దరిలో బల్బీర్ సింగ్ రజేవాల్నా? రాకేశ్ తికాయత్నా? రజేవాల్ పంజాబ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడుతున్నారు. రాకేశ్ గురించి అడిగితే ముజఫర్‌నగర్‌లో ఉన్నారని తెలిసింది. ‘‘రాకేశ్! ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ రోజు రైతుల వెనుక మీరున్నారా?’’ అని అడిగాను.. రాకేశ్‌కి ఫోన్ చేసి. రాకేశ్ నవ్వారు. ‘‘రైతుల వెనుక ఎవరుంటారు సత్యపాల్జీ? వారి ధర్మాగ్రహమే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ జరగన్విండి. పీఎం ర్యాలీని అడ్డుకుంది భధ్రతా వైఫల్యమా లేక రైతుల ధర్మాగ్రహమా అనేది తేలుతుంది’’ అన్నారు. -
మావీ ‘అతిపెద్ద’ పార్టీలే!
న్యూఢిల్లీ/పణజి/పట్నా: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని ఆయుధంగా మార్చుకోనున్నాయి. గోవా, మణిపుర్, మేఘాలయతో పాటు బిహార్‌లో అతిపెద్ద పార్టీలుగా నిల్చిన కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లను కోరేందుకు సిద్ధమయ్యాయి. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరుతూ 16 మంది ఎమ్మెల్యేల సంతకాల లేఖను శుక్రవారం రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హాకు అందజేయనున్నట్లు గోవా కాంగ్రెస్ శాసనసభా పక్షనేత చంద్రకాంత్ కవ్లేకర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకు గానూ కాంగ్రెస్ 17 సీట్లలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిందన్నారు. గవర్నర్‌తో సమావేశంలో గతంలో చేసిన తప్పును సరిదిద్దుకుని కర్ణాటక తరహాలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరతామన్నారు. మరోవైపు మణిపుర్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత ఇబోబీ సింగ్, మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాలు శుక్రవారం ఆయా రాష్ట్రాల గవర్నర్లతో సమావేశం కానున్నారు. మణిçపూర్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉన్నందున తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరతామని ఇబోబీ సింగ్ తెలిపారు. బిహార్ గవర్నర్‌తో భేటీ కానున్న తేజస్వీ కర్ణాటక ఉదంతం నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి బిహార్ గవర్నర్ సత్యపాల్‌తో శుక్రవారం భేటీ అవుతానని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నితీశ్ ప్రభుత్వాన్ని రద్దుచేసి కర్ణాటక తరహాలో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతామన్నారు. -
చుక్కనమ్మలు
ఎలాంటి ఫ్యాషన్లు ఎవర్ గ్రీన్‌గా ఉంటాయి? అమ్మాయిలు ఫాలో అయ్యేవా? అమ్మాయిల్ని ఫాలో అయ్యేవా? అమ్మాయిల్ని ఫాలో అయ్యేవే! నైన్టీన్ సిక్స్టీస్ నుంచి ‘పోల్కా’ అనే ఒక ఫ్యాషన్... అమ్మాయిల్ని ఫాలో అవుతూ వస్తోంది. వాళ్ల బట్టల్నీ, తట్టాబుట్టల్నీ, గోళ్ల రంగుల్నీ... చుక్కలు చుక్కలుగా డిజైన్ చేస్తూ చక్కనమ్మలుగా ముస్తాబు చేస్తోంది. వాళ్ల ఇష్టాయిష్టాలను తెలుసుకుని గౌరవ మర్యాదలు పొందుతోంది. దీన్ని బట్టి ఏం అర్థమౌతోంది? అమ్మాయిల్ని ఫాలో అవాలంటే ఒక స్టేచర్, ఒక డిగ్నిటీ ఉండాలని కదా! ఆ రెండూ పోల్కాకి ఉన్నాయి కనుకనే... ఈవారం ఈ టాపిక్. గుండ్రటి, పెద్ద పెద్ద చుక్కలు అన్నీ ఒకే పరిమాణంలో, సమానమైన దూరంలో కనిపిస్తాయి. తమ మధ్యా ఒక బంధం ఉందన్న భావనను తెలుపుతుంటాయి. ఆ భావనే పోల్కా ప్రింట్కు ప్రాణం అంటారు ఫ్యాషన్ డిజైనర్లు. మొదట స్విమ్‌సూట్ మీద ఊపిరిపోసుకున్న ఈ చుక్కలు ఆ తర్వాత పిల్లల దుస్తులు మొదలుకొని ఆధునికం నుంచి సంప్రదాయం వరకు అన్నింటా పాకిపోయాయి. పోల్కా డాట్స్‌కు సామాన్యులే కాదు రాజకీయ నాయకులూ దాసోహమన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని జాన్ మేజర్, ప్రస్తుత ప్రదాని టోనీ బ్లేయర్ తమ డ్రెస్ నెక్ భాగంలో పోల్కా డాట్స్ ఉండేలా డిజైన్ చేయించుకునేవారు. 1950లో గ్లామర్ క్వీన్ మార్లిన్ మన్రో తన దుస్తుల్లో పోల్కాకు ప్రత్యేకమైన స్థానమిచ్చారు. అనుకరణే ఆయుధం: రెట్రో ఫ్యాషన్‌కి అతి పెద్ద దారిని చూపాయి పోల్కా డిజైనర్ దుస్తులు. వీటిలో ఉండే స్పార్క్ అత్యంత వేగంగా దుస్తుల నుంచి యాక్ససరీస్ వరకు పాకింది. ‘చుక్కలు ఎప్పుడైతే ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చాయో, అప్పుటి నుంచి మనమూ వాటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాం’ అంటారు ప్రఖ్యాత డిజైనర్ సత్యపాల్! దానికి తగ్గట్టే లుక్ ఎలా కావాలంటే అలా మారిపోతుంది పోల్కా డ్రెస్ ధరిస్తే! పోల్కా ప్రింటెడ్ బ్లౌజ్ ధరించి, సాదా చీర కట్టినా, సాదా జాకెట్టు వేసి పోల్కా చుక్కల చీర కట్టినా ఆ అందమే వేరు. అలాగే ప్యాంట్ షర్ట పైన చుక్కల ఓవర్ కోట్ వేసి, సన్ గ్లాసెస్ పెడితే చాలు అల్ట్రామోడ్రన్గానూ వెలిగిపోవచ్చు. జీన్స్ పై పోల్కా: చుక్కల డిజైనింగ్‌లో తమదైన ముద్ర వేయాలనుకుంటే చుక్కల ప్రింట్స్ నచ్చిన దుస్తుల మీద ఫ్యాబ్రిక్ పెయింట్‌తో వేసుకోవచ్చు. బ్లూ, బ్లాక్ జీన్స్, జెగ్గింగ్స్ పైనా పోల్కా చుక్కలను వేసి, సరికొత్త లుక్‌తో మీరు మెరిసిపోవచ్చు. డిజైనర్స్ ఫేవరేట్ పోల్కా: జార్జెట్, షిఫాన్, క్రేప్, బ్రాసో.. అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మీదా అందంగా ఒదిగిపోయే సుగుణం పోల్కా చుక్కల సొంతం. అందుకే డిజైనర్ల పాలిట అదృష్టంగా మారింది పోల్కా. సెలబ్రిటీల అందచందాలను మరింతగా చూపించడానికి పోల్కాను ప్రధానంగా వాడుతున్నారు డిజైనర్లు. ర్యాంప్ పై చుక్కలను చుట్టుకున్న చక్కనమ్మలు చుక్కల్లో చంద్రుడిలా వెలిగిపోతూ డిజైనర్లకు హ్యాట్సాప్ చెబుతున్నారు. పోల్కాతో జిమ్మిక్కులు చేసే డిజైనర్లలో రోహిత్‌బాల్, సవ్యసాచి, సత్యపాల్ వంటి ప్రముఖులూ ఉన్నారు. పోల్కా డాట్స్ డ్రెస్సింగ్ గురించి వారు చెబుతున్న కొన్ని సూచనలు.. మీ వార్డ్ రోబ్‌లో ఒక్క పోల్కా డ్రెస్ లేదా ఏ ఒక్క యాక్ససరీ ఉన్నా చాలు. వెస్ట్రన్ పార్టీకి 5 నిమిషాల్లో రెడీ అయిపోవచ్చు. ప్లెయిన్ డ్రెస్ ధరించి ఒక్క టోపీ వాడితే చాలు. లేదంటే అదే ప్లెయిన్ డ్రెస్‌కు పోల్కా చుక్కలు ఉన్న బెల్ట్ ఉపయోగించినా అల్ట్రామోడ్రన్ అనిపిస్తారు. కాటన్ షూ, శాండల్స్, చెప్పల్స్, బ్యాగ్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్... ఏ చిన్న అలంకరణ వస్తువైనా పోల్కాకు స్థానమిస్తే ఆ లుక్ రిఫరెంట్ అనిపించకమానదు. పోల్కా డ్రెస్ వేసుకుంటున్నాం కదా! అని టాప్ టు బాటమ్ ‘ఇదే తరహా’లో వెళ్లాలనుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే అలంకరణలో ఏదో ఒక ఎలిమెంట్కే ప్రాధాన్యం ఇవ్వడం మేలు.