Saurabh Tiwary
-
ఒకేసారి ఐదుగురు క్రికెటర్లు రిటైర్మెంట్.. అందులో ధోని ఫ్రెండ్ కూడా!?
భారత దేశీవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ 2023-24 తుది అంకానికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక టోర్నీ ఎలైట్ గ్రూపు లీగ్ మ్యాచ్‌లు సోమవారంతో ముగిశాయి. ప్రస్తుతం ప్లేట్ గ్రూపు ఫైనల్ మ్యాచ్ ఫలితం తేలాల్సి ఉంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ప్లేట్ గ్రూపు ఫైనల్ మ్యాచ్‌లో మిజోరం, హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. అయితే ఫైనల్ పోరులో హైదరాబాద్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. హైదరాబాద్ విజయానికి ఇంకా 127 పరుగులు కావాలి. ఇక ఇది ఇలా ఉండగా.. నాలుగు ఎలైట్ గ్రూపుల నుంచి మొత్తం 8 జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి విదర్భ (33 పాయింట్లు), సౌరాష్ట్ర (28 పాయింట్లు)... గ్రూప్ ‘సి’ నుంచి తమిళనాడు (28 పాయింట్లు), కర్ణాటక (27 పాయింట్లు)... గ్రూప్ ‘డి’ నుంచి మధ్యప్రదేశ్ (32 పాయింట్లు), బరోడా (26 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇక ఈ ఏడాది రంజీట్రోఫీ సీజన్‌తో ఐదుగురు దేశవాళీ టాప్ క్రికెటర్లు రిటైర్ కానున్నారు. వారుఎవరో ఓ లూక్కేద్దం. మనోజ్ తివారీ.. టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. బిహార్‌తో మ్యాచ్ అనంతరం తన 19 ఏళ్ల కెరీర్‌కు తివారీ ముగింపు పలికాడు. తన కెరీర్లో బెంగాల్ తరపున 148 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తివారీ.. 47.86 సగటుతో 10,195 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 30 సెంచరీలు ఉన్నాయి. తివారీ గతంలో భారత జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. ధవల్ కులకర్ణి.. భారత ఫాస్ట్ బౌలర్, ముంబై వెటరన్ పేసర్ ధవల్ కులకర్ణి సైతం డొమాస్టిక్ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ అనంతరం కులకర్ణి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి తప్పకోనున్నాడు. తన కెరీర్లో ముంబై తరపున ఇప్పటివరకు 95 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ధవల్.. 281 వికెట్లు పడగొట్టాడు. 2016లో ధోని సారథ్యంలోనే భారత తరపున కులకర్ణి అరంగేట్రం చేశాడు. కులకర్ణికి ధోని నుంచి ఫుల్ సపోర్ట్ కూడా ఉండేది. అయితే తరువాత కులకర్ణి విఫలమకావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. ఫైజ్ ఫజల్.. టీమిండియా ఓపెనర్, విధర్బ మాజీ కెప్టెన్ ఫైజ్ ఫజల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా హర్యానాతో మ్యాచ్ అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి ఫజల్ తప్పుకున్నాడు. ఇప్పటివరకు తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 137 మ్యాచ్‌లు ఆడిన ఫజల్.. 24 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో 9,183 పరుగులు చేశాడు. ఇక 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో ధోని సారథ్యంలో భారత తరపున ఫజల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సౌరభ్ తివారి.. టీమిండియా వెటరన్, జార్ఖండ్ స్టార్ ప్లేయర్ సౌరభ్ తివారి కూడా ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా రాజస్తాన్‌తో మ్యాచ్ అనంతరం తన 17 ఏళ్ల కెరీర్‌కు విడ్కోలు పలికాడు. సౌరభ్ తివారీ జార్ఖండ్ తరఫున 115 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 22 సెంచరీల సాయంతో 8030 పరుగులు చేశాడు. భారత్ తరఫున 3 వన్డేలు కూడా తివారీ ఆడాడు. వరుణ్ ఆరోన్ టీమిండియా ఫాస్ట్ బౌలర్, మరో జార్ఖండ్ క్రికెట్ వరుణ్ ఆరోన్ సైతం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాజస్తాన్‌తో మ్యాచ్ అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి ఆరోన్ తప్పుకున్నాడు. 2008లో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన వరుణ్ 65 మ్యాచ్‌లు ఆడి 168 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు ఐదు వికెట్ల హాల్స్ ఉన్నాయి. -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
జార్ఖండ్ ఆటగాడు, టీమిండియా క్రికెటర్ సౌరభ్ తివారి ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 34 ఏళ్ల తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని జంషెడ్‌పూర్‌లో ఇవాళ (ఫిబ్రవరి 12) ప్రకటించాడు. ప్రస్తుత రంజీ సీజన్లో తన జట్టు ప్రస్తానం ముగిసిన అనంతరం తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. దాదాపు 17 ఏళ్ల పాటు జార్ఖండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తివారి.. టీమిండియా తరఫున, ఐపీఎల్లో పలు మ్యాచ్‌లు ఆడాడు. భారత్ తరఫున 3 వన్డేలు ఆడిన తివారి.. ఐపీఎల్లో నాలుగు ఫ్రాంచైజీల తరఫున 93 మ్యాచ్‌లు ఆడాడు. తివారికి హార్డ్ హిట్టర్‌గా పేరుంది. అతని ఆహార్యం, హెయిర్ స్టయిల్ చూసి అప్పట్లో అందరూ మరో ధోని అనే వారు. 2010 ఐపీఎల్ సీజన్లో తివారి ముంబై ఇండియన్స్ తరఫున మెరుపులు మెరిపించాడు. ఆ సీజన్లో అతను 419 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే తివారికి టీమిండియాలో ఛాన్స్ దక్కింది. భారత్ తరఫున అతను ఆడిన 3 మ్యాచ్‌ల్లో 49 పరుగులు చేవాడు. అంతర్జాతీయ స్థాయి తివారి రాణించలేకపోయినా, దేశావాలీ క్రికెట్లో స్టార్‌గా పేరుంది. అతను జార్ఖండ్ తరఫున 115 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 22 సెంచరీల సాయంతో 8030 పరుగులు చేశాడు. ఈ గణంకాలు అదే జార్ఖండ్‌కు ప్రాతినిథ్యం వహించిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కంటే ఎక్కువ కావడం విశేషం. తివారి కోహ్లి నేతృత్వంలోని అండర్-19 ప్రపంచకప్ (2008) గెలిచిన భారత యువ జట్టులో సభ్యుడు కావడం మరో విశేషం. కోహ్లి చొరవతోనే తివారిని ఆర్సీబీ 2011 సీజన్ కోసం భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. జాతీయ జట్టుకు కాని, ఐపీఎల్లో కాని ఆడనప్పుడు క్రికెట్లో కొనసాగడం వేస్ట్ అని రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించే సందర్భంగా తివారి అన్నాడు. -
ఏంటి అర్ష్‌దీప్ ఎందుకు అలా చేశావ్... పాపం సౌరభ్!
Saurabh Tiwary gets hit by Arshdeep Singh: ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో మూడు వరుస అపజయాలతో డీలా పడ్డ ముంబై.. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి గాడిలో పడింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముంబై ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో సౌరబ్ తివారీ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే బంతి నేరుగా బౌలర్ చేతిలోకి వెళ్లింది. వెంటనే అర్ష్‌దీప్ స్టైక్‌లో ఉన్న తివారీ వైపు బంతిని బలంగా విసిరాడు. దీంతో బాల్ తగిలి అతడు కిందపడి కొద్ది సేపు విలవిల్లాడు. వెంటనే అర్ష్‌దీప్ క్షమాపణలు చెప్పి క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. కాగా కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా తివారి వద్దకు పపరుగెత్తుకుంటూ వెళ్లి సహాయం చేశాడు. కాగా కీలక ఇన్నింగ్స్ ఆడిన సౌరబ్ తివారి 37 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్స్‌లతో 45 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్యా, రోహిత్ శర్మ క్రీడాస్పూర్తికు అభిమానులు ఫిధా ఇక పంజాబ్ ఇన్నింగ్స్‌లో కృనాల్ పాండ్యా, రోహిత్ శర్మ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించిన సంగతి తెలిసిందే. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో.. క్రిస్ గేల్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. ఈ క్రమంలో... నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రాహుల్ అడ్డుగా రావడంతో అతని చేతికి బంతి తగిలి కృనాల్ వైపు వెళ్లింది. అయితే, అప్పటికే రాహుల్ క్రీజుదాటి బయటికి వెళ్లడం.. కృనాల్ బంతిని వికెట్ల మీదకు విసరడం జరిగాయి. నిజానికి కేఎల్ రాహుల్ అవుట్ అయినట్లే లెక్క. అంపైర్ కూడా థర్డ్ అంపైర్‌కు సిగ్నల్ ఇవ్వబోయాడు. అయితే రాహుల్ మాత్రం ప్రశ్నార్థకంగా కృనాల్ వైపు చూడటంతో.. అతడు అంపైర్ వద్దకు వెళ్లి తన అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పాడు. రోహిత్‌కు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ వెనక్కి తగ్గాడు. చదవండి: IPL 2021: ఔటవ్వాల్సింది బతికిపోయాడు.. కృనాల్, రోహిత్ క్రీడాస్పూర్తికి రాహుల్ ఫిదా pic.twitter.com/4CEySuE484 — pant shirt fc (@pant_fc) September 28, 2021