Courtesy: IPL
Saurabh Tiwary gets hit by Arshdeep Singh: ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో మూడు వరుస అపజయాలతో డీలా పడ్డ ముంబై.. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి గాడిలో పడింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముంబై ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో సౌరబ్ తివారీ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే బంతి నేరుగా బౌలర్ చేతిలోకి వెళ్లింది.
వెంటనే అర్ష్‌దీప్ స్టైక్‌లో ఉన్న తివారీ వైపు బంతిని బలంగా విసిరాడు. దీంతో బాల్ తగిలి అతడు కిందపడి కొద్ది సేపు విలవిల్లాడు. వెంటనే అర్ష్‌దీప్ క్షమాపణలు చెప్పి క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. కాగా కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా తివారి వద్దకు పపరుగెత్తుకుంటూ వెళ్లి సహాయం చేశాడు. కాగా కీలక ఇన్నింగ్స్ ఆడిన సౌరబ్ తివారి 37 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్స్‌లతో 45 పరుగులు చేశాడు.
కృనాల్ పాండ్యా, రోహిత్ శర్మ క్రీడాస్పూర్తికు అభిమానులు ఫిధా
ఇక పంజాబ్ ఇన్నింగ్స్‌లో కృనాల్ పాండ్యా, రోహిత్ శర్మ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించిన సంగతి తెలిసిందే. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో.. క్రిస్ గేల్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. ఈ క్రమంలో... నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రాహుల్ అడ్డుగా రావడంతో అతని చేతికి బంతి తగిలి కృనాల్ వైపు వెళ్లింది. అయితే, అప్పటికే రాహుల్ క్రీజుదాటి బయటికి వెళ్లడం.. కృనాల్ బంతిని వికెట్ల మీదకు విసరడం జరిగాయి.
నిజానికి కేఎల్ రాహుల్ అవుట్ అయినట్లే లెక్క. అంపైర్ కూడా థర్డ్ అంపైర్‌కు సిగ్నల్ ఇవ్వబోయాడు. అయితే రాహుల్ మాత్రం ప్రశ్నార్థకంగా కృనాల్ వైపు చూడటంతో.. అతడు అంపైర్ వద్దకు వెళ్లి తన అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పాడు. రోహిత్‌కు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ వెనక్కి తగ్గాడు.
చదవండి: IPL 2021: ఔటవ్వాల్సింది బతికిపోయాడు.. కృనాల్, రోహిత్ క్రీడాస్పూర్తికి రాహుల్ ఫిదా
— pant shirt fc (@pant_fc) September 28, 2021
Comments
Please login to add a commentAdd a comment