క్షణం ఆలస్యమైతే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి!
రైల్వే ట్రాక్ ను దాటబోతున్న సైక్లిస్ట్ ను ఓ రైల్వే వర్కర్ ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. ట్రాక్ వెంబడి ఉన్న సీసీటీవీల్లో ఈ ఘటన మొత్తం రికార్డు అయింది. మత్తులో ఉన్న ఓ సైక్లిస్ట్ దారిలో అడ్డం వచ్చిన ఓ రైల్వే ట్రాక్ దాటబోయాడు. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో అర్ధంకాక ట్రాక్ తగిలి మధ్యలో పడిపోయాడు. మళ్లీ పైకి లేచి సైకిల్ ను ట్రాక్ అవతలి వైపు విసేరేశాడు.
ఇంతలో అతని వెనుకగా రైలు వస్తోంది. ఇది గమనించిన అక్కడ పనిచేసే రైల్వే కార్మికుడు తొలుత రైలు శబ్దానికి సైక్లిస్ట్ పక్కకు తప్పుకుంటాడని భావించాడు. రైలు సమీపిస్తున్న సైక్లిస్ట్ ట్రాక్ మధ్యలో నిలబడిపోవడంతో పరుగెత్తుకు వచ్చి అతన్ని పక్కకు నెట్టాడు. కళ్లు మూసి తెరిచి లోపు సమయంలో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత కొంత సమయం వరకూ ఇద్దరూ షాక్ కు గురైనట్లు కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అయింది. అయితే, కొంతమంది మాత్రం రైలును మరింత దగ్గరగా చూపించేలా వీడియోను ఎడిట్ చేసి ఉంటారని అంటున్నారు.