Savomi
-
ఇక షావోమీ.. వ్యక్తిగత రుణాలు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన షావోమీ.. భారత్‌లో రుణ మంజూరీ సేవలను ప్రారంభించింది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇక్కడ మార్కెట్‌కు సుపరిచితమైన ఈ సంస్థ.. మొబైల్ అప్లికేషన్ ఆధారంగా వ్యక్తిగత రుణాలను ఇవ్వనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇందుకోసం ‘మీ క్రెడిట్’ పేరిట యాప్‌ను అందుబాటులో ఉంచింది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని రూ. లక్ష వరకు రుణం పొందవచ్చని వివరించింది. ఈ అంశంపై కంపెనీ వైస్ ప్రెసిడెంట్, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ మాట్లాడుతూ.. ‘ఆన్లైన్ ద్వారా వ్యక్తిగత రుణాలను అందించడానికి మీ క్రెడిట్ యాప్‌ను అధికారికంగా ప్రారంభించాం. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ సేవలు పైలట్ పద్ధతిలో అందుబాటులో ఉన్నాయి.అత్యంత తక్కువ ప్రొసెసింగ్ సమయంతో రుణం పొందే విధంగా యాప్‌ను రూపొందించాం’ అని చెప్పారు. ప్రస్తుతం రుణ భాగస్వాముల జాబితాలో ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్, మనీ వ్యూ, ఎర్లీశాలరీ, జెస్ట్‌మనీ, క్రెడిట్‌విద్యా వంటి బ్యాంకింగేతర సంస్థలు ఉన్నట్లు వెల్లడించారు. వ్యక్తగత రుణ పద్ధతిలో ఉన్న సవాళ్లను అధిగమిస్తూ.. డిజిటల్ పద్ధతిలో రుణ మంజూరీ చేయనున్నామని వివరించిన ఆయన.. యువ నిపుణులు, మిలీనియల్స్ (1980– 2000 మధ్య జని్మంచినవారు) తమ లక్ష్యమని చెప్పారు. విని యోగదారు డేటా సురక్షితంగా ఉండడం కోసం అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో షావోమీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఏడాది నవంబర్‌లో రూ. 28 కోట్లను మంజూరు చేసింది. ఇందులో 20% మంది రూ. లక్ష రుణం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో 1,500 పిన్కోడ్లలో సేవలు అందుబాటులో ఉండగా.. 2019–20 చివరినాటికి 100% పిన్కోడ్లలో సేవలు విస్తరించా లని భావిస్తోంది. ఇక షావోమీ ఫోన్ యూజర్లకు క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా అందిస్తోంది. ఫైనాన్షియల్ సేవలపై దృష్టి భారత్‌లో ఇప్పటికే ‘మీ పే’ పేరిట యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్ సేవలను అందిస్తోన్న ఈ సంస్థ.. రానున్నకాలంలో మరిన్ని ఫైనాన్షియల్ సేవలను ఇక్కడి మార్కెట్లో అందించనున్నట్లు ప్రకటించింది. తాజాగా అందుబాటులోకి తెచ్చిన ‘మీ క్రెడిట్’కు వచ్చే స్పందన ఆధారంగా విస్తృత సేవలను తీసుకుని రానున్నట్లు వివరించింది. ఇక 2023 నాటికి ఆన్లైన్ క్రెడిట్ వ్యాపారం రూ. 70 లక్షల కోట్లకు చేరుకోనుందని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం రూ. 4 లక్షల కోట్ల విలువైన వ్యక్తిగత రుణాలను 1.9 కోట్ల మంది కస్టమర్లు పొందారని, వీరి అవుట్‌స్టాండింగ్ అమౌంట్ రూ. 2 లక్షలుగా ఉన్నట్లు సిబిల్ రిపోర్ట్ ద్వారా వెల్లడైనట్లు షావోమీ వివరించింది. -

మార్కెట్లోకి ‘షావోమీ’ నూతన ఉత్పత్తులు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమీ తాజాగా భారత మార్కెట్లోకి తన అధునాతన ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. మొత్తం నాలుగు నూతన ఉత్పత్తులను మంగళవారం విడుదలచేసింది. ‘ఎంఐ టీవీ 4ఎక్స్’ పేరుతో టీవీ సిరీస్‌ను ప్రవేశపెట్టగా.. వీటిలో 65 అంగుళాల టీవీ భారత్‌లోనే ఇప్పటివరకు అతిపెద్ద టీవీగా రికార్డు తిరగరాసింది. దీని ధర రూ. 64,999 కాగా, కార్టెక్స్ ఏ55 ప్రాసెసర్‌తో ఇది లభ్యమవుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎంఐ టీవీ 4ఎక్స్ 50 అంగుళాల టీవీ ధర రూ.29,999 (అమెజాన్‌లో లభ్యం), 43 అంగుళాల టీవీ ధర రూ. 24,999 (ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం)గా నిర్ణయించింది. ఇక 40 అంగుళాల పూర్తి హెచ్డీ టీవీ ధర రూ. 17,999. అన్ని సైజుల టీవీలు సెపె్టంబర్ 29 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని వివరించింది. ‘ఎంఐ వాటర్ ప్యూరిఫయర్’ విడుదల ఎఫ్‌డీఏ ఆమోదించిన ముడిపదార్ధాలతో ఉత్పత్తి చేసిన ‘ఎంఐ వాటర్ ప్యూరిఫయర్’ను షావోమీ ప్రవేశపెట్టింది. అత్యంత చిన్న సైజులో ఉండే ఈ ప్యూరిఫయర్‌లో 7–లీటర్ల ట్యాంక్ ఉంది. దీని ధర రూ. 11,999. ‘ఎంఐ బ్యాండ్ 4’ పేరుతో 0.95 అంగుళాల డిస్ప్లే ప్యానెల్ కలిగిన వాచ్‌ను విదుదలచేసింది. ‘ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2’ను ఇక్కడి మార్కెట్లోకి తీసుకొచి్చంది. -
షావొమీ... ‘స్మార్ట్’ బాట!
దశలవారీగా భారత్‌లో స్మార్ట్ ఉపకరణాలు ఈ ఏడాదే ఎయిర్ ప్యూరిఫయర్స్ షావొమీ ఇండియా హెడ్ మను జైన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న షావొమీ ‘స్మార్ట్’ బాట పట్టింది. భారత్‌లో స్మార్ట్ఫోన్లు, ఫిట్నెస్ బ్యాండ్, పవర్ బ్యాకప్, యాక్సెసరీస్‌ను విక్రయిస్తున్న ఈ సంస్థ వినూత్న స్మార్ట్ ఉపకరణాలను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్లను పరిచయం చేయనుంది. టీవీలు, రౌటర్లు, వాటర్ ప్యూరిఫయర్లు, మస్కిటో రెపెల్లెంట్, ఎలక్ట్రికల్ బైసికిల్, డ్రోన్, బూట్లు, రైస్ కుకర్, ల్యాప్‌టాప్‌ల వంటి స్మార్ట్ ప్రొడక్ట్స్‌ను సైతం కంపెనీ తయారు చేస్తోంది. వ చ్చే ఏడాది నుంచి వీటిని దశలవారీగా ఇక్కడి మార్కెట్లోకి తీసుకు రావాలని నిర్ణయించినట్టు షావొమీ ఇండియా హెడ్ మను జైన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు. ప్రతి ఉపకరణాన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించవచ్చని తెలిపారు. వేటికవే ప్రత్యేకం..: షావొమీ వాటర్ ప్యూరిఫయర్‌లో నాలుగు ఫిల్టర్లుంటాయి. ఏది పాడైనా వెంటనే కస్టమర్ స్మార్ట్‌ఫోన్‌కు, అలాగే కంపెనీ కేంద్ర కార్యాలయానికి సమాచారం వెళ్తుంది. ఒక్క క్లిక్‌తో ఫిల్టర్‌ను ఆర్డరివ్వొచ్చు. టెక్నీషియన్ అవసరం లేకుండానే అయిదు నిముషాల్లో బిగించొచ్చు కూడా. -
షావోమి నుంచి ‘ఎంఐ 5’
న్యూఢిల్లీ: చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ షావోమి తాజాగా ‘ఎంఐ 5’ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.24,999. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.15 అంగుళాల స్క్రీన్ (1080ఁ1920 పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 16 ఎంపీ రియర్ కెమెరా, 4 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, ఎన్ఎఫ్సీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. నలుపు, బంగారం, తెలుపు రంగుల్లో లభించనున్న ఈ స్మార్ట్‌పోన్స్ ఏప్రిల్ 6 నుంచి ఎంఐ.కామ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.