పాముకాటుతో యువకుడి మృతి
వనపర్తి: మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం సవాయిగూడెంలో ఆదివారం తెల్లవారుజామున పాముకాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. గ్రామానికి చెందిన శివ (18) ఇంటి బయట నిద్రిస్తుండగా అర్ధరాత్రి దాటాక వర్షం పడింది. వెంటనే ఇంట్లోకి వెళ్లి పరుపు మీద పడుకున్నాడు. పరుపులో ఉన్న కట్లపాము శివ తల మీద కాటేయడంతో కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.