Scatting
-
చిన్నారుల ప్రతిభకు సీఎం జగన్ ప్రశంస
అమరావతి: పశ్చిమ గోదావరికి జిల్లా తణుకు పట్టణానికి చెందిన చిన్నారి జొనాదుల లిషిత (5)ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఇటీవలే స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు కోసం లిషిత తణుకులో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది. 20 మీటర్ల పొడవు, 8 అంగుళాల ఎత్తు కేటగిరీలో ఫైర్ లింబో స్కేటింగ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులు అనూష, ఉమామహేశ్వర్, కోచ్ లావణ్య సహా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా చిన్నారి లిషితను అభినందించిన సీఎం ఆమెకు లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. సానా నుంచి అవార్డును పొందిన చిన్నారి పాన్ స్టార్స్ టెలిస్కోప్ సహకారంతో బృహస్పతి (గురుడు), అంగారక గ్రహాల మధ్య ఆస్టరాయిడ్‌ను కనుగొన్న చిన్నారి కైవల్యారెడ్డిని సీఎం జగన్ అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కైవల్యా ప్రతిభను మెచ్చి నాసా గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ (ఐఏఎస్‌సి) ఆమెకు అవార్డును బహుకరించింది. ఈ సందర్భంగా చిన్నారి కైవల్యను అభినందించిన సీఎం ఆమెకు లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. చిన్నారితో వెంట ఆమె తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి ఉన్నారు. చదవండి: ఫైర్ లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు ఒమన్ నుంచి ముగ్గురు మహిళలు రాక -
ఫైర్ లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు
తణుకు అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన ఐదేళ్ల చిన్నారి జొన్నాదుల లిషిత ఫైర్ లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తణుకులోని స్కేటింగ్ కోర్టులో మంగళవారం వజ్రా వరల్డ్ రికార్డ్ ఆధ్వర్యంలో 8 అంగుళాల ఎత్తులో ఏర్పాటు చేసిన హార్డిల్స్పై మంటలు వస్తుండగా.. వాటి కిందగా స్కేటింగ్ చేసి ప్రపంచ రికార్డు సాధించింది. వజ్రా వరల్డ్ రికార్డ్ సంస్థ సీఈవో తిరుమలరావు అవార్డుతో పాటు ట్రోఫీ, మెడల్స్‌ను చిన్నారికి అందజేశారు. లిషితను రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్, విద్యావేత్త గుబ్బల తమ్మయ్య అభినందించారు. -
స్కేటింగ్ సిటీ
పరుగులు తీసే మనసును.. పగ్గాల్లేకుండా దూసుకుపోయేలా చేస్తుంది. ఉరకలు తీసే పిల్లలకు స్కేటింగ్ మరింత ఉత్సాహాన్నిస్తోంది. సిటీలో ఎప్పట్నుంచో ఉన్న ఈ ట్రెండ్ ఈ మధ్య వేగం పెంచింది. స్కేటింగ్ అంటేనే హైదరాబాద్ అని గుర్తొచ్చేలా ఈవెంట్లు జరుగుతున్నాయి. లోకల్ బాలబాలికలెందరో ఈ ఆటలో అదరగొడుతున్నారు. దూలపల్లిలోని డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండు రోజుల పాటు సాగిన సీబీఎస్ఈ సౌత్‌జోన్ రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్ ఉత్సాహభరితంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల నుంచి వందలాది మంది విద్యార్థులు స్కేటింగ్ బాట పట్టారు. తల్లిదండ్రుల సంపూర్ణ మద్దతుతో తమకిష్టమైన స్కేటింగ్‌లో సత్తా చాటుతున్నారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ ఇన్లైన్ ఈవెంట్, క్వాడ్ ఇన్లైన్ ఈవెంట్లలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో ‘సిటీప్లస్’ ముచ్చటించింది. - వాంకె శ్రీనివాస్ ఆనందంగా ఉంది హోం టౌన్లో రాణించడం ఆనందంగా ఉంది నేను పుట్టి పెరిగిన సిటీలోనే స్కేటింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించడం గొప్ప అనుభూతి. రోడ్ టూ ఈవెంట్ అండర్ 16 గర్ల్స్ డిస్టెన్స్ ఐదువేల మీటర్లలో, టైమ్ టైమర్ 300 మీటర్లలో బంగారు, రజత పతకాలు వచ్చాయి. చిన్నప్పటి నుంచే స్కేటింగ్ అంటే ఇష్టం. 2005 నుంచే ఇందిరాపార్క్‌లోని రింగ్, బేగంపేటలో రోడ్ ఈవెంట్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. గత నెలలోనే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఎక్సలెన్సీ సర్టిఫికెట్ అందుకున్నా. అంతర్జాతీయ స్కేటర్‌గా ఎదగాలనేది నా లక్ష్యం. - అమ్రీన్ఖాన్, డీఆర్ఎస్ స్కూల్ విద్యార్థిని తల్లిదండ్రుల ప్రోత్సాహం.. మా నాన్న ఫ్రెండ్ వల్లనే నాకు స్కేటింగ్‌పై ఇష్టం ఏర్పడింది. 2011 నుంచి ఇందిరాపార్క్‌లో ప్రాక్టీసు చేస్తున్నా. గతేడాది అమృత్సర్, విరార్‌లో జరిగిన నేషనల్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో రజత, కాంస్య పతకాలు సాధించా. ఈ ఈవెంట్ రింగ్ 3లో స్వర్ణం, రోడ్ స్కేటింగ్‌లో రజతం వచ్చాయి. ఆరు రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడి ఈ పతకాలు సాధించడం ఆనందంగా ఉంది. నాలాగా అనేక మంది సిటీ విద్యార్థులు స్కేటింగ్‌లో ప్రతిభ కనబర్చడం శుభపరిణామం. - శ్రేయ, సికింద్రాబాద్ ఢిల్లీ పబ్లిక్‌స్కూల్ ్చసిటీ ‘పతకాన్ని’చ్చింది మాది చెన్నై. మా అమ్మాయి కార్తీకను ఇక్కడ స్కేటింగ్ పోటీలకు తీసుకొచ్చా. తొలిసారిగా పాల్గొన్న సీబీఎస్ఈ సౌత్‌జోన్ రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్ అండర్-6 విభాగంలో తను బంగారు పతకం సాధించడం సంతోషాన్నిచ్చింది. మా అమ్మాయికి ప్రారంభ పతకాన్ని ఇచ్చిన ఈ సిటీని ఎప్పటికీ మరవలేము. - కార్తీక తండ్రి జగదీశ్వర్, చెన్నై మంచి ఆదరణ సిటీలో స్కేటింగ్‌కు మంచి ఆదరణ ఉంది. 2010లో ఇక్కడ జరిగిన సీబీఎస్ఈ సౌత్‌జోన్ రోలర్ స్కేటింగ్‌లోనూ పాల్గొన్నా. ఈసారి అండర్-19 విభాగంలో రోడ్ ఈవెంట్లో బంగారం, రింగ్‌లో రజతం సాధించా. మళ్లీ నగరానికి రావాలని కోరుకొంటున్నా. - సిలియా స్మిత, మంగళూరు -
సిటీ స్కేటర్స్
-
సిటీ స్కేటర్స్
స్కేటింగ్‌లో చిన్నారులు దూసుకుపోయారు. ఒకరిని మించి ఒకరు మెరుపు వేగంతో పోటీపడ్డారు. దూలపల్లిలోని డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన సీబీఎస్ఈ సౌత్‌జోన్ రోలర్ స్కేటింగ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. సిటీ విద్యార్థులు మంచి ప్రదర్శనతో పతకాలు సాధించారు. అండర్ 16 గర్ల్స్ ఐదు వేల మీటర్ల డిస్టెన్స్‌లో డీఆర్ఎస్ పాఠశాల విద్యార్థిని అమ్రీఖాన్ స్వర్ణపతకం సాధించింది. రోడ్ టు ఇన్ లైన్ అండర్ 14 గర్ల్స్ ఐదువేల మీటర్ల డిస్టెన్స్‌లో సికింద్రాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిన్నారి శ్రేయ రజత పతకం దక్కించుకుంది. - సాక్షి, సిటీప్లస్