School correspondent
-
‘మీ కుమారుడు మా స్కూల్లో అవసరం లేదు.. ఇంటికి తీసుకుపోండి’
అనంతపురం: తొమ్మిదో తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాల కరస్పాండెంట్ పెట్టిన చిత్రహింసలు భరించలేకే తన కుమారుడు ఉరి వేసుకుని చనిపోయాడని ఆ విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూడేరు మండలంలోని ముద్దలాపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. ముద్దలాపురం గ్రామానికి చెందిన గొల్ల రమేష్ రెండో కుమారుడు హరికృష్ణ(13) అనంతపురంలోని రామన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్లుగా ఈ పాఠశాలలోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. హరికృష్ణ బుధవారం రాత్రి స్కూల్ నుంచి ముద్దలాపురంలోని తమ ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్న హరికృష్ణ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం నుంచి వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా ఉరికి వేలాడుతున్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కూడేరు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేశారు. చిత్రహింసలకు గురిచేశారు...అవమానించారు తన కుమారుడు హరికృష్ణపై రామన్ స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడని, చిత్రహింసలు పెట్టి ఆత్మహత్యకు పాల్పడేలా చేశాడని విద్యార్థి తండ్రి గొల్ల రమేష్ కూడేరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో తమ కుమారుడిని రామాంజనేయులు విపరీతంగా కొట్టారని తెలిపారు. అనంతరం 6301824064 సెల్ నంబర్ నుంచి తమకు ఫోన్ చేసి ‘మీ కుమారుడు మా స్కూల్లో ఉండాల్సిన అవసరం లేదు.. ఇంటికి పిలుచుకుని పోండి’ అని చెప్పాడన్నారు. తాము పాఠశాల వద్దకు వెళ్లకపోవడంతో తమ కుమారుడిని ఇంటికి పంపారని చెప్పారు. బుధవారం రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చిన తన కుమారుడు... తనను అవమానించారని, పదేపదే వేదన చెందాడన్నారు. ఇంట్లోనే ఉండి చదువుకోవాలని తాము సర్ది చెప్పామని తెలిపారు. గురువారం ఉదయం తాము పొలం పనులకు వెళ్లగా... కరస్పాండెంట్ పెట్టిన చిత్రహింసలను తలచుకుని జీవితంపై విరక్తి చెందిన హరికృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుమారుడి మృతికి కారణమైన స్కూల్ కరస్పాండెంట్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. మరోవైపు హరికృష్ణ మృతికి కారణమైన రామన్ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాల ఎదుట కొద్దిసేపు ఆందోళన చేశారు. చదవండి: ప్రేమ ఎంత కఠినం -
స్కూల్ కరస్పాండెంట్ పాడుపని.. బాలికకు మత్తు టాబ్లెట్లు ఇచ్చి..
కాకినాడ సిటీ: ఓ బాలికపై లైంగిక దాడి చేసిన ఘటనలో హెల్పింగ్ హ్యాండ్స్ పాఠశాల కరస్పాండెంట్ అరవై ఏళ్ల విజయకుమార్‌ను అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ సుంకర మురళీమోహన్ వివరించారు. ఆదివారం స్థానిక దిశ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ కొండయ్యపాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ స్కూల్ కరస్పాండెంట్ విజయకుమార్ అదే స్కూల్ వసతి గృహంలో ఉండే 9వ తరగతి విద్యార్థిని (14)కి మత్తు టాబ్లెట్లు ఇచ్చి నాలుగు నెలలుగా పలుమార్లు లైంగిక దాడి చేశాడు. చదవండి: భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో సహజీవనం.. రాత్రి ఇంటికి వచ్చి.. ఆ బాలిక గర్భం దాల్చింది. వేసవి సెలవులు కావడంతో గొడారిగుంటలోని తన ఇంటికి ఆమె వెళ్లింది. రెండు రోజులుగా బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె తల్లికి విషయం చెప్పింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు విజయకుమార్‌ను అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దిశ డీఎస్పీ మురళీమోహన్ తెలిపారు. ఇదే స్కూల్లో 40 మంది విద్యార్థులు ఉన్నారని, స్కూల్‌కు సంబంధించి పూర్తి దర్యాప్తు జరుగుతుందని వివరించారు. -
చిన్నారిపై పాఠశాల కరస్పాండెంట్ పైశాచికత్వం
లక్కిరెడ్డిపల్లె: హోం వర్కు చేయలేదనే కారణంతో మూడో తరగతి విద్యార్థిని పాఠశాల కరస్పాండెంట్ చితకబాదాడు. తీవ్రగాయాలపాలైన విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లెలో సోమవారం జరిగింది. లక్కిరెడ్డిపల్లె మండలం యనమలవాండ్లపల్లెకు చెందిన చిరంజీవి,రమాదేవి దంపతులు పొట్టకూటి కోసం ఇద్దరు బిడ్డలను అవ్వాతాతల దగ్గర వదిలి కువైట్‌కు వెళ్లారు. గ్రామంలో ప్రభుత్వ బడి మూతబడటంతో సమీపంలోని లక్కిరెడ్డిపల్లెలోని సందీప్ స్కూలులో ఈ బిడ్డలను చేర్పించారు. పెద్ద కుమారుడు యశ్వంత్ మూడో తరగతి చదువుతున్నాడు. హోం వర్క్ చేయలేదనే కారణంతో యశ్వంత్‌ను పాఠశాల కరస్పాండెంట్ శివ సోమవారం ఉదయం చితకబాదాడు. దెబ్బలకు తట్టుకోలేక యశ్వంత్ అరుపులు, కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు స్కూల్ వద్దకు చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మీకు సంబంధం లేదంటూ వారిపైనా శివ చిందులేశాడు. విలేకర్లను కూడా మీకు ఇక్కడ ఏం పని ఉంది? వెళ్లిపోండంటూ గెంటి వేయడానికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. లక్కిరెడ్డిపల్లె ఎస్ఐ సురేష్ రెడ్డి, ఎంఈవో చక్రేనాయక్‌లు పాఠశాల వద్దకు చేరుకుని కరస్పాండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న రాయచోటి డిప్యూటీ డీఈవో వరలక్ష్మి పాఠశాలకు చేరుకుని డీఈవో, ఆర్జేడీలకు ఫోన్ ద్వారా జరిగిన విషయాన్ని తెలిపారు. వారు స్పందించి స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని ఎంఈవో ఆదేశించారు. -
బాలుడిపై కరస్పాండెంట్ లైంగికదాడి
అత్తాపూర్: బాలుడిపై లైంగికదాడి జరిగిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని జనచైతన్య ప్రాంతంలో మహ్మద్ అబేద్ అలీ తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. స్థానికంగా ఉన్న సెయింట్ అడమ్స్స్కూల్లో అబేద్ అలీ కుమారుడు (8) రెండవ తరగతి చదువుతున్నాడు. కాగా కొద్దిరోజులగా స్కూల్ కరస్పాండెంట్ రమణ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. విద్యార్థి పాఠశాలలో తనపై జరిగిన ఘటన గురించి గురువారం ఉదయం తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహంతో పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం రాజేంద్రనగర్ ఏసీపీ అశోక చక్రవర్తిని కలిసి ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పొలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాప్ కేసులో నటుడి అరెస్ట్
సాక్షి, చెన్నై: వాణియంబాడి పాఠశాల కరస్పాండెంట్ కిడ్నాప్ కేసులో తమిళ నటుడు ఒకరిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. వాణియంబాడి టీచర్స్ కాలనీకి చెందిన సెంథిల్‌కుమార్.. ఆదర్శ్ మాట్రిక్ పాఠశాలలో కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. జనవరి 19న బైక్‌పై వెళ్తుండగా ఆయనను ముగ్గురు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేశారు. కొద్ది సేపటి తర్వాత సెంథిల్‌కుమార్ తన అన్నయ్య ఉదయచంద్రన్కు ఫోన్ చేసి కిడ్నాప్‌నకు గురైనట్టు తెలిపాడు. తనను విడిచిపెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారని చెప్పడంతో ఉదయచంద్రన్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తర్వాత అతడు రూ.50 లక్షల నగదుతో కృష్ణగిరి– ధర్మపురి హైరోడ్డులో కారిమంగళం అనే ప్రాంతానికి వెళ్లాడు. అతడిని వెంబడించిన వాణియంబాడి పోలీసులు కిడ్నాపర్లు ఉపయోగించిన కారు ఆధారంగా రెడ్‌హిల్స్‌కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కిడ్నాప్‌నకు సూత్రధారుడు హరి అని తెలిసింది. ఆంబూరు సమీపం శంకరాపురానికి చెందిన హరి పలు సినిమాల్లో విలన్‌గా నటించాడు. అతడు జిమ్నాస్టిక్ సెంటర్ కూడా నడుపుతున్నట్లు తెలిసింది. హరి భార్య ప్రియ12 ఏళ్లుగా సెంథిల్‌కుమార్ స్కూలులో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో సెంథిల్‌కుమార్‌ను హరి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న కారు ఇద్దరు దుర్మరణం
కావలి: ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపక్కన ఆగిఉన్న టిప్పర్‌ను కారు ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పట్టణ శివారులో శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. ప్రమాదంలో పమిడి స్కూల్ కరస్పాండెంట్ పమిడి వెంకటసుబ్బయ్యనాయుడు(50), కలిగిరి మండలం అయ్యపురెడ్డిపాళెంకు చెందిన మన్నం చంద్రమౌళి(47) మృతి చెందారు. చిన్నారావుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైకు తరలించారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసుల కథనం మేరకు.. దగదర్తి మండలం మనుబోలుపాడు చెందిన పమిడి వెంకటసుబ్బయ్యనాయుడు ముసునూరులో పమిడి కాన్సెప్ట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. ఆయన భార్య సుభాషిణి దుండిగం ఎంపీటీసీ. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. కలిగిరి మండలం అయ్యపురెడ్డిపాళెంకు చెందిన మన్నం చంద్రమౌళి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఆయన భార్య శిరీష, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. గురువారం అర్ధరాత్రి దాటిని తర్వాత మన్నం చంద్రమౌళి, ఆయన అన్న చిన్నారావు, మేనల్లుడు ఆనందరావు కారులో పట్టణం నుంచి జలదంకి మండలం జమ్మపాళెంలో ఉన్న ఓ డాబాకు వెళ్లారు. అక్కడ భోజనం చేసి శుక్రవారం వేకువన తిరిగి కావలికి బయలుదేరారు. పట్టణ శివారు ప్రాంతమైన బుడంగుంట ఇందిరమ్మ కాలనీకి సమీపించే సరికి ప్రమాదం జరిగింది. చంద్రమౌళి, వెంకట సుబ్బయ్యనాయుడు ప్రమాదస్థంలోనే చనిపోగా గాయపడిన ఆనందరావును 108 వాహన సిబ్బంది చికిత్స కోసం కావలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చిన్నారావు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని వైద్యశాలకు తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుల కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. జెడ్పీచైర్మన్ పరామర్శ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఏరియా వైద్యశాలకు వచ్చి మృతుల కుటుంభ సభ్యులను, బంధువులను పరామర్శించారు. కావలి ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, వివిధ పార్టీల నాయకులు ఏరియా వైద్యశాలకు వచ్చారు. -
టెన్త్ విద్యార్థినికి నీలిచిత్రాలు చూపిస్తున్న....
మహబూబ్‌నగర్: పాఠాలు చెప్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు పశువుగా మారాడు.పదవ తరగతి విద్యార్థినికి నీలి చిత్రాలు చూపిస్తూ తన కోరిక తీర్చాల్సిందిగా వత్తిడి చేశాడు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలోని సాందీపని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న జానకిరాంరెడ్డి తన స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. తన కోరిక తీరిస్తే స్కూల్ ఫీజులు, పరీక్ష ఫీజులు తనే చెల్లిస్తానంటూ వేధించసాగాడు. ఉపాధ్యాయుడి వేధింపుల గురించి ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. వారు పాఠశాల వద్దకు వచ్చేసరికి ఉపాధ్యాయుడు పరారైనాడు. స్థానిక విద్యార్థి సంఘాలు నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగాయి. . పోలీసులు కేసు నమోదు చేస్తామనిహామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాలు నిరసన విరమణ చేశాయి. ** -
నిజమే.. వజీర్‌ను చితక్కొట్టారు
సాక్షి, ఏలూరు/దెందులూరు : స్కూల్ కరస్పాండెంట్ చావబాదడంతో మతిస్థిమితం కోల్పోయిన నాలుగో తరగతి విద్యార్థి ఉదంతంపై కలెక్టర్ కాటమనేని భాస్కర్ తీవ్రంగా స్పందించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించి నివేదిక ఇవ్వాల్సిందిగా డీఈవో ఆర్.నరసింహరావును ఆదేశించారు. దెందులూరు మండలం గంగన్నగూడెంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూపీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న వజీర్‌ను ఆ స్కూల్ కరస్పాండెంట్ వసీవుల్లా విచక్షణా రహితంగా కొట్టడంతో మతిస్థిమితం కోల్పోయాడని వజీర్ తండ్రి హిదయతుల్లా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ ఉదంతాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, కలెక్టర్ స్పందించారు. హుటాహుటిన విద్యాశాఖ అధికారుల నుంచి ప్రాథమిక సమాచారం తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరిపి సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాల్సిందిగా డీఈవో ఆర్.నరసింహరావును ఆదేశించారు. దీంతో దెందులూరు ఎంఈవో వి.రంగప్రసాద్‌ను విచారణాధికారిగా నియమిస్తూ డీఈవో ఉత్తర్వులు ఇచ్చారు. శనివారం సాయంత్రం ఎంఈవో రంగప్రసాద్ ఆ పాఠశాలకు వెళ్లి విచారణ నిర్వహించారు. ఉపాధ్యాయులు అఫీజుల్లా, నుజమిల్, 6వ తరగతి విద్యార్థులు అనిష్, అబ్దుల్ రెహమాన్ షాలిక్‌తోపాటు మరో 12 మందిని విడివిడిగా విచారించిన ఎంఈవో వివరాలు నమోదు చేశారు. కొట్టిన విషయం వాస్తవమే... ఘటన జరిగిన రోజున విద్యార్థి వజీర్ కరస్పాండెంట్ ఉంటున్న గదిలోకి వెళ్లి పాస్ పోసినట్టు విచారణాధికారికి ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన కరస్పాండెంట్ వజీర్‌ను కొట్టిన విషయం వాస్తవమేనన్నారు. వజీర్ బాగా చదువుతాడని, క్రమశిక్షణతో ఉంటాడని విద్యార్థులు వాగ్మూ లం ఇచ్చారు. అయితే వజీర్ తరచూ కిందపడిపోతూ ఉంటాడని, అతనికి ఫిట్స్ ఉందని కొందరు చెప్పినట్టు విచారణాధికారి తెలిపారు. ఘటనపై డీఈవోకు నివేదిక అందజేస్తామని రంగప్రసాద్ తెలిపారు. కాగా విచారణ నిర్వహించిన సమయంలో బాధిత విద్యార్థి సోదరుడు, కరస్పాండెంట్ అక్కడ లేరు. చైల్డ్‌లైన్ సిబ్బంది కౌన్సెలింగ్ మౌలానా అబ్దుల్ కలాం పాఠశాలలో చైల్డ్‌లైన్ (ఏలూరు) కో-ఆర్డినేటర్లు వి.ప్రసాద్, జె.ప్రసాద్ తదితరులు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శని వారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు, మానసిక స్థితిగతులు, బోధన, పరస్పర సహాయ సహకారాలు, మానవతా ధృక్పథం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.