science centre
-
Narendra Modi: ప్రపంచ వైజ్ఞానిక కేంద్రంగా భారత్
రాజ్‌గిర్: అత్యాధునిక, పరిశోధనల ఆధారిత ఉన్నత విద్యా వ్యవస్థతో ప్రపంచంలోనే అతిముఖ్యమైన వైజ్ఞానిక కేంద్రంగా ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఎల్లప్పుడూ జిజ్ఞాస, ధైర్యసాహసాలు కలిగి ఉండాలని విద్యార్థులకు ఉద్బోధించారు. బిహార్‌లోని రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 10 రోజుల వ్యవధిలోనే ఇక్కడికి వచ్చే అవకాశం దక్కడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. విజ్ఞానాన్ని అగి్నకీలలతో కాల్చి బూడిద చెయ్యలేమని, ఇందుకు నలంద విశ్వవిద్యాలయమే ఒక ఉదాహరణ అని చెప్పారు. 21వ శతాబ్దంలో భారత్ కీలక పాత్ర పోషించనుందని, ఆ శతాబ్దం ఆసియాదేనని, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని పునరుద్ఘాటించారు. విద్యా రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిన దేశాలే ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రరాజ్యాలుగా ఎదుగుతాయని, ఇది చరిత్ర చెబుతున్న సత్యం అని పేర్కొన్నారు. ప్రాచీన కాలంలో మన దేశం ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రరాజ్య హోదాను అనుభవించిందని గుర్తుచేశారు. అప్పట్లో నలంద, విక్రమశిల వంటి విద్యాసంస్థలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయన్నారు. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో మన వర్సిటీలు భారత్‌ను ప్రపంచ వైజ్ఞానిక కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగా చిన్నారుల్లో నవీన ఆలోచనలను ప్రోది చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’ల ద్వారా కోటి మందికిపైగా బాలలకు అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు. చంద్రయాన్, గగన్‌యాన్ వంటి ప్రయోగాలు మన బాలబాలికల్లో సైన్స్ పట్ల ఉత్సకతను కలిగిస్తున్నాయని చెప్పారు. పదేళ్ల క్రితం మన దేశంలో కేవలం 100 స్టార్టప్ కంపెనీలు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 1.30 లక్షలు దాటేసిందని హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పేటెంట్లు మనకు లభిస్తున్నాయని, రీసెర్చ్ పేపర్ల ప్రచురణలో ముందంజలో ఉన్నామని పేర్కొన్నారు. పరిశోధన, నవీన ఆవిష్కరణలకు మరింత ఊతం ఇవ్వడానికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధిని ప్రకటించామన్నారు. గత పదేళ్లుగా చూస్తే మన దేశంలో సగటున ప్రతి వారానికొక యూనివర్సిటీని నెలకొల్పినట్లు, ప్రతి పది రోజులకొక ఐటీఐని స్థాపించినట్లు తెలుస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. రెండు రొజులకొక అటల్ టింకరింగ్ ల్యాబ్, ప్రతిరోజూ రెండు కొత్త కాలేజీలు ఏర్పాటయ్యాయని స్పష్టంచేశారు. ప్రస్తుతం 23 ఐఐటీలు, 21 ఐఐఎంలు, 22 ఎయిమ్స్‌లు ఉన్నాయన్నారు. గత పదేళ్లలో మెడికల్ కాలేజీ సంఖ్య రెండింతలు అయ్యిందన్నారు. నలంద మహా విహార సందర్శనబిహార్ రాష్ట్రం నలంద జిల్లా రాజ్‌గిర్‌లోని ప్రాచీన నలంద విశ్వవిద్యాలయ శిథిలాలలో కూడిన నలంద మహా విహారను ప్రధాని మోదీ బుధవారం సందర్శించారు. ఈ కట్టడం విశేషాలను అధికారులు ఆయనకు వివరించారు. ఈ మహా విహార యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది.మోదీ వేలిపై సిరా గుర్తు ఉందా? నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ ప్రారం¿ోత్సవంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోదీ ఎడమ చేతిని కొద్దిసేపు పట్టుకొని చూశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసిన మోదీ చూపుడు వేలిపై సిరా గుర్తు ఇంకా ఉందా? అని పరిశీలించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నితీశ్ ఆకస్మిక చర్యకు మోదీ కూడా కొంత ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించారు. అంతేకాదు ఆయన వెనుక ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. -
'సిని'వారం
ప్రతి శనివారంషార్ట్ఫిల్మ్ల ప్రదర్శన సైన్స్ సెంటర్లో మినీ థియేటర్ కొత్త దర్శకులకు ప్రోత్సాహం వచ్చే నెలలో ప్రారంభం రవీంద్రభారతి తరహాలో వరంగల్‌లో వేదిక సాక్షి ప్రతినిధి, వరంగల్: షార్ట్‌ఫిల్మ్ మేకింగ్, సినీరంగంపై ఆసక్తి , సృజనాత్మకత ఉన్న వారు తమ ప్రతిభను చాటుకునేందుకు వరంగల్‌లో వేదిక సిద్ధమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో విజయవంతమైన సినివారం కార్యక్రమాన్ని వరంగల్‌లో ప్రారంభించనున్నారు. తెలుగు మహసభల ప్రారంభోత్సవ సమయానికల్లా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కొత్త టాలెంట్‌ను వెతికేందుకు.. కొత్త తరాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర భాషా, సంస్కృతిక శాఖ సినివారం కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు షార్ట్‌ఫిల్మ్‌లను ప్రదర్శిస్తున్నారు. 2016 నవంబరు 12న ఈ సినీవారం కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటివరకు వందకు పైగా షార్ట్‌ఫిల్మ్‌లను ఇక్కడ ప్రదర్శించారు. వీటిని చూసేందుకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ షార్ట్‌ఫిల్మ్‌లను చూడవచ్చు. ప్రదర్శన అనంతరం వాటిని రూపొందించిన వ్యక్తుల పరిచయం, షార్ట్‌ఫిల్మ్‌కి సంబంధించిన అంశాలపై వివరణ, కొత్త ఆలోచనలను వీక్షకులతో పంచుకోవచ్చు. కొత్త టాలెంట్‌ను వెతికి పట్టుకునేందుకు సినీరంగానికి చెందిన ప్రముఖులు ఈ షార్ట్‌ఫిల్మ్‌లు చూసేందుకు వస్తున్నారు. అక్కడ మంచి ఫలితాలు రావడంతో దీన్ని వరంగల్‌కు తీసుకువచ్చేందుకు రాష్ట్ర భాషా, సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సుముఖంగా ఉన్నారు. వరంగల్‌లో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా వరంగల్ గుర్తింపు పొందింది. హైదరాబాద్ తరహాలోనే ఇక్కడ సినీవారం కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అధికారులు అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించారు. హంటర్‌రోడ్డులోని రీజనల్ సైన్స్ సెంటర్లో ఉన్న మినీ ఆడిటోరియాన్ని ఎంపి క చేశారు. షార్ట్‌ఫిల్మ్ ప్రదర్శించేందుకు, తిలకించేం దుకు వీలుగా ఇందులో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సంబంధి త శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నా రు. సాధ్యమైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం నాటికి వరంగల్‌లో సినీవారం కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా వరంగల్‌లో పర్యాటక ప్రాంతాలు, చారిత్రక నేపథ్యం, ఎంజీఎం ఆస్పత్రి ఈ మూడు అంశాలపై షార్ట్‌ఫిల్మ్ పోటీలు పెట్టనున్నారు. చక్కని వేదిక.. కొంత కాలంగా వరంగల్ నుంచి అనేక మంది కొత్త తరం దర్శకులు వెండితెరకు పరిచయం అవుతున్నారు. అనేక మంది సినిమా, టీవీ రంగాల్లో రాణిస్తున్నారు. వెలుగులోకి రాకుండా తమ ప్రయత్నాలను కొనసాగించేవారు ఎందరో ఉన్నారు. వీడియో కెమెరాలు, నాణ్యతతో వీడియో తీసే మొబైల్ ఫోన్స్ అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ కారణంగా ఎడిటింగ్, మిక్సింగ్ వంటి ఎన్నో సేవలు సులభంగా లభిస్తుండడంతో షార్ట్ ఫిల్మ్ తీసేవారి సంఖ్య పెరుగుతోంది. వరంగల్ కేంద్రంగా దాదాపు 40 బృందాలు రెగ్యులర్‌గా షార్ట్‌ఫిల్మ్ తీస్తున్నారు. ప్రస్తుతం వీరందరూ యూట్యూబ్, వాట్సప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా మలుచుకుని ప్రతిభను చాటుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో షార్ట్‌ఫిల్మ్‌లు ఇందులో అప్లోడ్ అవుతుండడంతో గుర్తింపు సాధించడం కష్టంగా మారింది. ఇదే సమయంలో సినీ, టీవీ రంగాలకు సంబంధించిన ప్రధాన వేదికల్లో ప్రదర్శన చేసేందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్న ప్రతిభా వంతులకు సినీవారం కార్యక్రమం చక్కని వేదిక కానుంది. -
సైన్స్ సెంటర్ ఖాళీ
అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభమైన జూల్ 22వ తేదీ నుంచి రోజూ వేలాదిమంది టీచర్లు, వారి బంధువులు, స్నేహితులతో సైన్స్ సెంటర్ కిటకిటలాడింది. ఒక్కోరోజు కనీసం లోపలికి అడుగుపెట్టే పరిస్థితి కూడా ఉండేది కాదు. రానురాను కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో టీచర్ల తాకిడి తగ్గుతూ వచ్చింది. చివరిరోజు బుధవారంతో సైన్స్ సెంటర్ ఖాళీగా కనిపించింది. -
విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథం పెంచాలి : డీఈఓ
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థులు శాస్త్రీయ దక్పథాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా సైన్స్ సెంటర్లో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్–2016పై శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రతి పాఠశాల నుంచి బాలల సైన్స్–2016లో ప్రాజెక్టులు ప్రదర్శించాలన్నారు. ఎన్సీఎస్సీ కో–ఆర్డినేటర్ కె.ఆనందభాస్కర్‌రెడ్డి, సైన్స్ సెంటర్ క్యూరేటర్ సి.వెంకటరంగయ్య పాల్గొన్నారు. రీసోర్స్‌పర్సన్లుగా శామ్యూల్ ప్రతాప్, నారాయణ, నాగరాజు వ్యవహరించారు.