SCO countries
-
బాలీవుడ్ సాంగ్స్‌కు భారత్, పాక్ సైనికులు డ్యాన్స్
-
చిందేసిన భారత్, పాక్ సైన్యం
మాస్కో: సరిహద్దుల్లో ఎప్పుడూ తుపాకులతో తలపడే భారత్, పాకిస్తాన్ సైనికులు తొలిసారి చిందేశారు. బాలీవుడ్ సాంగ్స్‌కు తమ స్టెప్టులతో శాంతి సందేశాన్నిచ్చారు. రష్యాలో జరిగిన యాంటీ టెర్రర్ డ్రిల్‌లో పాల్గొన్న ఇరు దేశాల జవాన్లు.. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. రష్యాలోని చెబర్కుల్ పట్టణంలో జరిగిన ఈ డ్రిల్‌ను బీజింగ్‌కు చెందిన షాంఘై కార్పోరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) నిర్వహించింది. ఈ వీడియోను న్యూఢిల్లీలోని రష్యా ఎంబసీ సైతం ట్వీట్ చేసింది. ఎస్సీవో సభ్యదేశాలు అయిన తర్వాత తొలిసారి దాయదీ దేశాలు మిలిటరీ విన్యాసాల్లో పాల్గొన్నాయి. రష్యాకు చెందిన సెంట్రల్ మిలిటరీ కమీషన్ ఆధ్వర్యంలో ఈ సంయుక్త విన్యాసాలు జరిగాయి. ఈ డ్రిల్‌కు భారత్-పాక్ కలిసి రావడాన్ని చైనా స్వాగతించింది. రష్యా, చైనా, కజకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిజిస్తాన్, భారత్, పాక్‌ల నుంచి మూడు వేల మంది సైనికులు ఈ డ్రిల్‌లో పాల్గొన్నారు. 2001లో ఏర్పాటు అయిన ఎస్సీవోలో చైనా, రష్యా, కజకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిజిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు వ్యవస్థాపక సభ్యులుగా కాగా.. 2017లో పాక్, భారత్‌లు కలిసాయి. This video show the true meaning of peace and love #IndianArmy #pakistanarmy doing dance together in Russia #SCO2018 #Chebarkul Jai Hind jai Bharat Bharat mata ki..... pic.twitter.com/h8ahcKyE69 — Nand Lal (@imjatNandlal) August 29, 2018 -
చైనా చేరుకున్న ప్రధాని మోదీ
బీజింగ్ : షాంఘై సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాకు చేరుకున్నారు. చైనాలోని క్వింగ్దాలో రెండు రోజులపాటు జరగనున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) 18వ సమావేశంలో ఎస్సీఓ దేశాల ప్రతినిధులంతా పాల్గొననున్నారు. ఎస్సీఓ దేశాల(చైనా, భారత్, పాకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, తజకిస్తాన్, కిర్జిస్తాన్, ఉజ్బెకిస్తాన్)కు సంబంధించిన వివిధ అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. పాక్ తీరుపై చర్చించనున్న భారత్ షాంఘై సదస్సులో భాగంగా ఉగ్రవాద దాడులను అరికట్టేందుకు ఎస్సీఓ దేశాలు అవలంబించాల్సిన విధానాల గురించి భారత్ పలు సూచనలు చేయనుంది. అంతేకాకుండా ఎస్సీఓ దేశాల మధ్య సరిహద్దు సమస్యలు సహా పలు అంశాల పరిష్కారంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. సదస్సులో భాగంగా జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్న మోదీ.. ముఖ్యంగా ఇస్లామాబాద్ కేంద్రంగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న అంశాన్ని లేవనెత్తనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదొక మంచి అవకాశం... చైనాకు బయల్దేరే ముందు మీడియాతో మాట్లాడిన మోదీ...గతేడాది ఎస్సీఓలో శాశ్వత సభ్యత్వం పొందడం సంతోషంగా ఉందన్నారు. ఎస్సీఓ దేశాలతో ఉన్న స్నేహబంధాన్ని భారత్ ఆస్వాదిస్తోందని తెలిపారు. ఉగ్రవాదం, వేర్పాటువాదాలకు వ్యతిరేకంగా ఎస్సీఓ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు షాంఘై అజెండా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. క్వింగ్దా సదస్సులో జరిగే చర్చల అనంతరం ఎస్సీఓ దేశాలతో భారత్ బంధం మరింత బలోపేతం అవుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. -
భారత్, పాక్ చేతులు కలిపేనా?
న్యూఢిల్లీ: చైనా నాయకత్వంలోని షాంఘై సహకారం సంఘం (ఎస్సీఓ)లో 17 నెలల నిరీక్షణ అనంతరం భారత్‌కు సభ్యత్వం లభించింది. రష్యా, చైనా సూచనల మేరకే 2014లో ఈ సహకార సంఘం సభ్యత్వానికి భారత్ దరఖాస్తు చేసుకొంది. వాస్తవానికి ఈ సభ్యత్వం కోసం భారత్ ఎప్పటి నుంచో నిరీక్షిస్తోంది. 2005లోనే ఈ సంఘంలో భారత్‌లో పరిశీలక హోదా పొందింది. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం లాగా ఇది ఓ భౌగోళిక ప్రాధాన్యత గల సంఘం కాదు? మరి షాంఘై సహకార సంఘం సభ్యత్వం వల్ల భారత దేశానికి కలిగే ప్రయోజనాలేమిటీ? ఈ సంఘం చాప్టర్ ప్రకారం సభ్య దేశాలు రక్షణ రంగంలో ప్రధానంగా పరస్పరం సహకరించుకోవాలి. ప్రతి సభ్య దేశం మరో దేశంలో సంయుక్తంగా సైనిక విన్యాసాలు జరపాలి. అంటే భారత దేశం వెళ్లి పాకిస్తాన్లో, పాకిస్తాన్ వచ్చి భారత్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించాలి. నిత్యం సరిహద్దుల్లో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటున్న ఇరు దేశాల సైనికుల మధ్య ఈ సరికొత్త బంధం ఏర్పడుతుందా? అన్నది ప్రస్తుతానికి అనుమానమే. షాంఘై సంఘం సభ్యత్వం సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సభ్య దేశాలన్నీ ఉమ్మడిగా ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. అటు పాకిస్తాన్‌ను ఇటు భారత దేశాన్ని వేదిస్తున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇరుదేశాల సైన్యం ఏకమైతే అంతకంటే జరిగే మేలు మరొకటి ఉంది. ముఖ్యంగా ఇది నెరవేరాలన్నా ఉద్దేశంతోనే చైనా అటు పాకిస్తాన్‌ను, ఇటు భారత్‌ను సంఘంలోకి ఆహ్వానించింది. పాకిస్తాన్ మీదుగా వెళుతున్న చైనా ఆర్థిక కారిడార్‌కు ఇరుదేశాల మధ్య శాంతియుత పరిస్థితులు, ముఖ్యంగా చైనా కారిడార్ వెళ్లే పాకిస్తాన్ భూభాగంలో అల్లర్లు జరుగకూడదు. అందుకనే ‘చైనా సింగిల్ రూట్, సింగిల్ బెల్ట్’ ప్రాజెక్టులో భారత్ చేరకపోయినప్పటికీ షాంఘై సంఘంలో మనకు ఉచితాసనం ఇచ్చింది. వాస్తవానికి చెప్పాలంటే నార్త్ అట్లాంటిక్ దేశాల మధ్య సైనిక సహకారం కోసం ఏర్పాటైన ‘నాటో’ లాంటి అంతర్జాతీయ సంస్థలకు పోటీకాగానే చైనా ఈ సహకార సంఘాన్ని తీసుకొచ్చింది.