Sebastian Coe
-
ఉషకు ‘వెటరన్ పిన్’ ప్రదానం
దోహా: భారత దిగ్గజ అథ్లెట్ పీటీ ఉషకు అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య (ఐఏఏఎఫ్) నుంచి గౌరవ పురస్కారం లభించింది. బుధవారం ఇక్కడ ఘనంగా జరిగిన ఐఏఏఎఫ్ కాంగ్రెస్ వేడుకలో సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్ కో ‘పరుగుల రాణి’ పీటీ ఉషకు ‘వెటరన్ పిన్’ పురస్కారాన్ని అందజేశారు. ఆసియా నుంచి ఈ గౌరవ పురస్కారం పొందిన మూడో అథ్లెట్ ఉష. అథ్లెటిక్స్ ఉన్నతికి, ట్రాక్ అండ్ ఫీల్డ్‌కే వన్నె తెచి్చన అతి కొద్ది మందికి మాత్రమే ఈ పురస్కారం అందజేస్తారు. దిగ్గజ అథ్లెట్ ఉష తన విజయవంతమైన కెరీర్లో 100 మీ., 200 మీ., 400 మీ., 4్ఠ400 మీ. రిలే పరుగుతో పాటు 400 మీ. హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచింది. 1985లో జరిగిన జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచింది. తనకు గౌరవ పురస్కారం లభించడం పట్ల పీటీ ఉష సంతోషం వెలిబుచి్చంది. దేశంలో అథ్లెటిక్స్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూనే ఉంటానని ఆమె చెప్పింది. సుమరివాలా మరోసారి ఎన్నిక భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) అధ్యక్షుడు అదిలే సుమరివాలా బుధవారం ఐఏఏఎఫ్ మండలి సభ్యుడిగా తిరిగి ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవికి ఎంపిక కావడం ఇది వరుసగా రెండోసారి. ఈ పదవిలో సుమరివాలా 4 ఏళ్ల పాటు కొనసాగుతారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 121 ఓట్లు వచ్చాయి. ఐఏఏఎఫ్ మండలిలో మొత్తం 13 మంది సభ్యులు ఉంటారు. -
ఐఏఏఎఫ్ అధ్యక్షుడిగా సెబాస్టియన్ కో
బీజింగ్ : బ్రిటన్ దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్ మాజీ చాంపియన్ సెబాస్టియన్ కో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో సెబాస్టియన్ కోకు 115 ఓట్లు రాగా... ఆయన ప్రత్యర్థి, ఉక్రెయిన్ పోల్‌వాల్ట్ దిగ్గజం సెర్గీ బుబ్కాకు 92 ఓట్లు వచ్చాయి. 16 ఏళ్లుగా ఈ పదవిలో ఉన్న లామైన్ డియాక్ (సెనెగల్) స్థానంలో ఆగస్టు 31న కో బాధ్యతలు స్వీకరిస్తారు. 58 ఏళ్ల సెబాస్టియన్ కో 1980 మాస్కో, 1984 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్‌లలో 1500 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించారు. అంతేకాకుండా ఎనిమిది అవుట్డోర్, మూడు ఇండోర్ ప్రపంచ రికార్డులను సృష్టించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన సెర్గీ బుబ్కా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బుబ్కాతోపాటు దహ్లాన్ అల్ హమాద్ (ఖతార్), హమాద్ కల్కాబా మల్బూమ్ (కామెరూన్), అల్బెర్టో యువాన్‌టొరెనా (క్యూబా) ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇదే ఎన్నికల్లో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) అధ్యక్షుడు అదిల్లె సుమరివల్లా ఐఏఏఎఫ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.