దోహా: భారత దిగ్గజ అథ్లెట్ పీటీ ఉషకు అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య (ఐఏఏఎఫ్) నుంచి గౌరవ పురస్కారం లభించింది. బుధవారం ఇక్కడ ఘనంగా జరిగిన ఐఏఏఎఫ్ కాంగ్రెస్ వేడుకలో సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్ కో ‘పరుగుల రాణి’ పీటీ ఉషకు ‘వెటరన్ పిన్’ పురస్కారాన్ని అందజేశారు. ఆసియా నుంచి ఈ గౌరవ పురస్కారం పొందిన మూడో అథ్లెట్ ఉష. అథ్లెటిక్స్ ఉన్నతికి, ట్రాక్ అండ్ ఫీల్డ్‌కే వన్నె తెచి్చన అతి కొద్ది మందికి మాత్రమే ఈ పురస్కారం అందజేస్తారు. దిగ్గజ అథ్లెట్ ఉష తన విజయవంతమైన కెరీర్‌లో 100 మీ., 200 మీ., 400 మీ., 4్ఠ400 మీ. రిలే పరుగుతో పాటు 400 మీ. హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచింది. 1985లో జరిగిన జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచింది. తనకు గౌరవ పురస్కారం లభించడం పట్ల పీటీ ఉష సంతోషం వెలిబుచి్చంది. దేశంలో అథ్లెటిక్స్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూనే ఉంటానని ఆమె చెప్పింది.
సుమరివాలా మరోసారి ఎన్నిక
భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడు అదిలే సుమరివాలా బుధవారం ఐఏఏఎఫ్ మండలి సభ్యుడిగా తిరిగి ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవికి ఎంపిక కావడం ఇది వరుసగా రెండోసారి. ఈ పదవిలో సుమరివాలా 4 ఏళ్ల పాటు కొనసాగుతారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 121 ఓట్లు వచ్చాయి. ఐఏఏఎఫ్ మండలిలో మొత్తం 13 మంది సభ్యులు ఉంటారు.
ఉషకు ‘వెటరన్ పిన్’ ప్రదానం
Published Thu, Sep 26 2019 3:22 AM | Last Updated on Thu, Sep 26 2019 3:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment