PT Usha (player)
-
పరుగుల రాణి పీటీ ఉషపై కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు
తిరువనంతపురం: భారత దిగ్గజ అథ్లెట్, పరుగుల రాణి పిటి ఉషపై కేసు నమోదైంది. కేరళలోని కోజికోడ్ పోలీసులు పి.టి ఉషపై చీటింగ్ కేసు నమోదు చేశారు. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ చేసిన ఫిర్యాదు మేరకు ఉష సహా మరో ఆరుగురిపై ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పిటి ఉష హామీతో.. జెమ్మా జోసెఫ్ కేరళలోని కొజికోడ్‌లో 1,012 చదరపు అడుగుల ఫ్లాట్‌ను ఓ బిల్డర్ నుంచి కొనుగోలు చేసింది. అందుకోసం జోసెఫ్ వాయిదాల రూపంలో మొత్తం రూ. 46 లక్షలు చెల్లించారు. సొమ్ము చెల్లించినా బిల్డర్ ఫ్లాట్‌ను జోసెఫ్‌కు రాసివ్వలేదు. దీంతో జోసెఫ్ కోజికోడ్ పోలీసులను ఆశ్రయించారు. పిటి ఉష హామీ మేరకే బిల్డర్‌కు డబ్బులు చెల్లించానని అయితే బిల్డర్ ఫ్లాట్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. జోసెఫ్ ఫిర్యాదుపై కోజికోడ్ జిల్లా పోలీస్ చీఫ్ ఏవీ జార్జ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ కేసును వెల్లాయిల్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. చదవండి: (ఒమిక్రాన్ సోకిన మహిళ తండ్రికి కరోనా పాజిటివ్) -
ప్రతిభా మూర్తులు పోరాట యోధులు
అవార్డు గుర్తింపును తెస్తుంది. అవార్డుకే గుర్తింపు తెచ్చారు ఈ మహిళలు. దాదాపు ప్రతి రంగంలోనూ.. ఈ ఏడాది నారీ శక్తి ప్రతిఫలించింది. పోరాట పటిమ ప్రస్ఫుటించింది. వీళ్ల స్ఫూర్తి కదిలిస్తుంది. ముందు తరాలనూ నడిపిస్తుంది. 1. దీపికారెడ్డి, నృత్యకారిణి ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డికి ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. రాష్ట్రపతి భవన్లో ఫిబ్రవరి 6న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి ఆమె ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన దీపికారెడ్డి గత 47 సంవత్సరాలుగా కూచిపూడి నాట్య రంగంలో సేవలను అందిస్తున్నారు. ‘దీపాంజలి’ పేరుతో నృత్య పాఠశాలను కూడా ప్రారంభించారు. 2. ప్రియాంక దూబే, పాత్రికేయురాలు బీబీసీ ఢిల్లీ బ్యూరో ద్విభాషా వ్యాఖ్యాత, ప్రముఖ పాత్రికేయురాలు ప్రియాంక దూబే ప్రతిష్టాత్మక చమేలీదేవి జైన్ అవార్డు–2018కు ఎంపికయ్యారు. పరిశోధనాత్మక జర్నలిజంలో ఉత్తమప్రతిభ కనబరిచినందుకుగాను ప్రియాంకకు ఈ అవార్డు దక్కింది. 3. రాధా దేవి, మున్నుస్వామి శాంతి టీటీడీ మహిళా క్షురకుల సంఘం అధ్యక్షురాలు కగ్గనపల్లి రాధాదేవి, ఇస్రో మహిళా శాస్త్రవేత్త మున్నుస్వామి శాంతిలకు ‘నారీశక్తి పురస్కారం’ లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీరికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. మహిళా సాధికారతకు, లింగ సమానత్వానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా వీరికి ఈ అవార్డు దక్కింది. 4. జోఖా అల్హార్తి, రచయిత్రి ఒమన్ రచయిత్రి జోఖా అల్హార్తి (40) మాన్ బుకర్ ప్రైజ్–2019 గెలుపొందారు. ఆమె రాసిన ‘సెలస్టియల్ బాడీ’ నవలకు ఈ ప్రైజ్ దక్కింది. ఈ అవార్డును గెలుచుకున్న తొలి అరబ్ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. బ్రిటన్ నుంచి 1951లో స్వాతంత్య్రం పొందాక ఒమన్‌లో చోటుచేసుకున్న మార్పులను, బానిసత్వ పరిస్థితులను ఈ నవలలో అల్హార్తి వర్ణించారు. 5. గ్రెటా థన్‌బర్గ్, ఉద్యమకారిణి స్వీడన్‌కు చెందిన టీనేజ్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక మానవ హక్కుల పురస్కారం ‘అంబాసిడర్ ఆఫ్ కన్సైన్స్’ లభించింది. అలాగే ఆమె ‘రైట్ టు లైవ్లీహుడ్’ అవార్డుకు ఎంపికైంది. నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ అయింది. 6. పి.టి. ఉష, అథ్లెట్ భారత మాజీ అథ్లెట్, దిగ్గజ ఒలింపియన్ పి.టి. ఉష అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ప్రతిష్టాత్మక ‘వెటరన్ పిన్’ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో సుదీర్ఘ కాలం పాటు చేసే సేవలకు గుర్తింపుగా ఐఏఏఎఫ్ వెటరన్ పిన్ అవార్డును అందజేస్తారు. పి.టి. ఉష పూర్తి పేరు పిలావుళ్లకండి తెక్కేపఱంబిల్ ఉష. 7. అస్కా సలోమీ, ప్రిన్సిపాల్ ప్రభుత్వ వైద్యంలో నర్సింగ్ వృత్తిలో విశేష సేవలందించినందుకు అస్కా సలోమీకి ‘జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ అవార్డు–2019’ లభించింది. అస్కా సలోమీ 2009లో గాంధీ నర్సింగ్ కళాశాల నుంచి ప్రధానాచార్యులుగా పదవీ విరమణ పొందారు. 8. పాయల్ జంగిడ్, సామాజిక కార్యకర్త బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేసిన పాయల్ జంగిడ్‌కి బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఇచ్చే ‘ఛేంజ్మేకర్–2019’ అవార్డు లభించింది. రాజస్థాన్‌లోని హిన్‌స్లా గ్రామానికి చెందిన 17 ఏళ్ల పాయల్.. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు, ఆడపిల్లలు చదువుకునేందుకు కృషి చేస్తోంది. 9. ఓల్గా, పర్యావరణవేత్త సాహితీ రంగంలో విశేషంగా చేసిన ప్రముఖ పర్యావరణ వేత్త, స్త్రీవాది, మేధావి, నవలా రచయిత్రి ఓల్గా టోర్కార్క్విజ్కు (పోలెండ్) నోబెల్ బహుమతి లభించింది. ఆమె రాసిన ‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్‘ అనే నవలకు గానూ 2018 సంవత్సరానికి ఈ బహుమతి లభించింది. (గత ఏడాది అవార్డును ఈ ఏడాది ప్రకటించారు) -
ఉషకు ‘వెటరన్ పిన్’ ప్రదానం
దోహా: భారత దిగ్గజ అథ్లెట్ పీటీ ఉషకు అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య (ఐఏఏఎఫ్) నుంచి గౌరవ పురస్కారం లభించింది. బుధవారం ఇక్కడ ఘనంగా జరిగిన ఐఏఏఎఫ్ కాంగ్రెస్ వేడుకలో సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్ కో ‘పరుగుల రాణి’ పీటీ ఉషకు ‘వెటరన్ పిన్’ పురస్కారాన్ని అందజేశారు. ఆసియా నుంచి ఈ గౌరవ పురస్కారం పొందిన మూడో అథ్లెట్ ఉష. అథ్లెటిక్స్ ఉన్నతికి, ట్రాక్ అండ్ ఫీల్డ్‌కే వన్నె తెచి్చన అతి కొద్ది మందికి మాత్రమే ఈ పురస్కారం అందజేస్తారు. దిగ్గజ అథ్లెట్ ఉష తన విజయవంతమైన కెరీర్లో 100 మీ., 200 మీ., 400 మీ., 4్ఠ400 మీ. రిలే పరుగుతో పాటు 400 మీ. హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచింది. 1985లో జరిగిన జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచింది. తనకు గౌరవ పురస్కారం లభించడం పట్ల పీటీ ఉష సంతోషం వెలిబుచి్చంది. దేశంలో అథ్లెటిక్స్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూనే ఉంటానని ఆమె చెప్పింది. సుమరివాలా మరోసారి ఎన్నిక భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) అధ్యక్షుడు అదిలే సుమరివాలా బుధవారం ఐఏఏఎఫ్ మండలి సభ్యుడిగా తిరిగి ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవికి ఎంపిక కావడం ఇది వరుసగా రెండోసారి. ఈ పదవిలో సుమరివాలా 4 ఏళ్ల పాటు కొనసాగుతారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 121 ఓట్లు వచ్చాయి. ఐఏఏఎఫ్ మండలిలో మొత్తం 13 మంది సభ్యులు ఉంటారు. -
గంజి అన్నంతోనే గడిపాను...
న్యూఢిల్లీ: పోషక విలువల్లేని ఆహారం వల్లే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ (1984)లో పతకం కోల్పోయానని పరుగుల రాణి పీటీ ఉష చెప్పారు. అక్కడి క్రీడా గ్రామంలోని స్థానిక వంటకాలు రుచించక గంజి అన్నం, పచ్చడి తినాల్సివచ్చిందని... ఇది తన ప్రదర్శనపై, చివరకు పతకంపై ప్రభావం చూపిందని గతానుభవాన్ని దిగ్గజ అథ్లెట్ వివరించింది. అప్పట్లో భారత క్రీడాకారులకు అంతంత మాత్రం క్రీడాపరికరాలు, సదుపాయాలు అందుబాటులో ఉండేవని చెప్పారు. విదేశీ క్రీడాకారులు అన్ని హంగులతో, ఆధునిక కిట్లతో కనిపిస్తుంటే తమకు విచారంగా ఉండేదన్నారు. ‘ఏం చేస్తాం! ఒక్క రోజైన అలాంటి కిట్లతో బరిలోకి దిగితే అదే మహాభాగ్యమనిపించేది అప్పుడు. అక్కడి ఆహారం గురించి మాకెలాంటి సమాచారం లేదు. కేవలం స్థానిక పదార్థాల్నే (లాస్ ఏంజిల్స్) వండి వార్చేవారు. బేక్ చేసిన ఆలుగడ్డలు, సోయా సాస్‌తో సగం ఉడికించిన చికెన్ మాకు ఏమాత్రం రుచించలేదు. దీంతో నేను గంజి అన్నం, పచ్చడితో సరిపెట్టుకున్నా. అది అథ్లెట్లు తీసుకునే భోజనం కానేకాదు. అందులో ఎలాంటి పోషకాలు ఉండవు. కానీ నాకు తప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తిన్నా. అలాగే 400 మీ. హర్డిల్స్ బరిలోకి దిగాను. సెకనులో వందో వంతు తేడాతో కాంస్యాన్ని కోల్పోయాను’ అని ఉష ఆనాటి సంగతుల్ని వివరించారు. -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: పి.టి.ఉష (క్రీడాకారిణి), కార్తీక (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధ గ్రహానికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరు బుద్ధిబలం, ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. అన్ని ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోయి, వృత్తి, ఉద్యోగాల పరంగా అనుకోని అవకాశాలు వస్తాయి. కుటుంబ పరంగా ఎంతో ఉత్సాహకరంగా ఉంటుంది. మీ పుట్టిన తేదీ 27 కాబట్టి అది కుజునికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరికి సహజంగానే నాయకత్వ లక్షణాలు, ఇతరులను ప్రభావితం చేయగలిగిన కార్యనిర్వహణా సామర్థ్యం కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలతో మంచి సాంకేతిక నైపుణ్యంతో చురుకుగా పని చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగులకు ముఖ్యంగా యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి ప్రదర్శించి అధికారుల మన్ననలు అందుకుంటారు. లక్కీ నంబర్స్: 1,5,6,9; అన్ లక్కీ నంబర్: 4; లక్కీ కలర్స్: రెడ్, గ్రీన్, సిల్వర్, బ్లూ, గోల్డెన్; లక్కీ డేస్: మంగళ, బుధ, శనివారాలు; సూచనలు: నవగ్రహాలకు అభిషేకం, సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం, రక్తదానం చేయటం, చేయించటం, పేదలకు పుస్తకాలు, పరికరాలు కొనిపెట్టడం; వాహనాలు నడిపేటప్పుడు, ఆయుధాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉంటూ, ప్రతీకార ధోరణిని విడనాడటం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు