తిరువనంతపురం: భారత దిగ్గజ అథ్లెట్, పరుగుల రాణి పిటి ఉషపై కేసు నమోదైంది. కేరళలోని కోజికోడ్ పోలీసులు పి.టి ఉషపై చీటింగ్ కేసు నమోదు చేశారు. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ చేసిన ఫిర్యాదు మేరకు ఉష సహా మరో ఆరుగురిపై ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పిటి ఉష హామీతో.. జెమ్మా జోసెఫ్ కేరళలోని కొజికోడ్‌లో 1,012 చదరపు అడుగుల ఫ్లాట్‌ను ఓ బిల్డర్ నుంచి కొనుగోలు చేసింది.
అందుకోసం జోసెఫ్ వాయిదాల రూపంలో మొత్తం రూ. 46 లక్షలు చెల్లించారు. సొమ్ము చెల్లించినా బిల్డర్ ఫ్లాట్‌ను జోసెఫ్‌కు రాసివ్వలేదు. దీంతో జోసెఫ్ కోజికోడ్ పోలీసులను ఆశ్రయించారు. పిటి ఉష హామీ మేరకే బిల్డర్‌కు డబ్బులు చెల్లించానని అయితే బిల్డర్ ఫ్లాట్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. జోసెఫ్ ఫిర్యాదుపై కోజికోడ్ జిల్లా పోలీస్ చీఫ్ ఏవీ జార్జ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ కేసును వెల్లాయిల్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment