International Athletics Federation
-
అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య మాజీ అధ్యక్షుడికి రెండేళ్ల జైలు
పారిస్: అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) మాజీ అధ్యక్షుడు లామినే డియాక్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. రష్యా డోపీలను నిషేధించకుండా పోటీల్లో పాల్గొనేలా అవినీతికి పాల్పడటంతో పారిస్ కోర్టు 87 ఏళ్ల డియాక్‌ను దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. సెనెగల్ దేశానికి చెందిన ఆయన 1999 నుంచి 2015 వరకు సుదీర్ఘకాలం పాటు ఐఏఏఎఫ్‌లోనే అత్యంత ప్రభావవంతమైన అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారించిన కోర్టు జైలుశిక్షతోపాటు 5 లక్షల యూరోలు (రూ. 4 కోట్ల 34 లక్షలు) జరిమానా కూడా విధించింది. శిక్ష ఖరారు చేస్తున్న సమయంలో డియాక్ కోర్టులోనే ఉన్నారు. ఆయన అవకతవకలు, అవినీతి ఉదంతాలపై ఈ శిక్షను విధిస్తున్నట్లు మహిళా న్యాయమూర్తి తీర్పును చదివి వినిపించారు. రష్యా డోపీలకు ఉద్దేశపూర్వకంగానే అండదండలు అందించినట్లు కోర్టు తేల్చిందని ఆమె చెప్పారు. -
ఉషకు ‘వెటరన్ పిన్’ ప్రదానం
దోహా: భారత దిగ్గజ అథ్లెట్ పీటీ ఉషకు అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య (ఐఏఏఎఫ్) నుంచి గౌరవ పురస్కారం లభించింది. బుధవారం ఇక్కడ ఘనంగా జరిగిన ఐఏఏఎఫ్ కాంగ్రెస్ వేడుకలో సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్ కో ‘పరుగుల రాణి’ పీటీ ఉషకు ‘వెటరన్ పిన్’ పురస్కారాన్ని అందజేశారు. ఆసియా నుంచి ఈ గౌరవ పురస్కారం పొందిన మూడో అథ్లెట్ ఉష. అథ్లెటిక్స్ ఉన్నతికి, ట్రాక్ అండ్ ఫీల్డ్‌కే వన్నె తెచి్చన అతి కొద్ది మందికి మాత్రమే ఈ పురస్కారం అందజేస్తారు. దిగ్గజ అథ్లెట్ ఉష తన విజయవంతమైన కెరీర్లో 100 మీ., 200 మీ., 400 మీ., 4్ఠ400 మీ. రిలే పరుగుతో పాటు 400 మీ. హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచింది. 1985లో జరిగిన జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచింది. తనకు గౌరవ పురస్కారం లభించడం పట్ల పీటీ ఉష సంతోషం వెలిబుచి్చంది. దేశంలో అథ్లెటిక్స్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూనే ఉంటానని ఆమె చెప్పింది. సుమరివాలా మరోసారి ఎన్నిక భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) అధ్యక్షుడు అదిలే సుమరివాలా బుధవారం ఐఏఏఎఫ్ మండలి సభ్యుడిగా తిరిగి ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవికి ఎంపిక కావడం ఇది వరుసగా రెండోసారి. ఈ పదవిలో సుమరివాలా 4 ఏళ్ల పాటు కొనసాగుతారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 121 ఓట్లు వచ్చాయి. ఐఏఏఎఫ్ మండలిలో మొత్తం 13 మంది సభ్యులు ఉంటారు. -
పి.టి. ఉషకు ఐఏఏఎఫ్ అవార్డు
న్యూఢిల్లీ: భారత మాజీ అథ్లెట్, దిగ్గజ ఒలింపియన్ పి.టి. ఉషను అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ప్రతిష్టాత్మక ‘వెటరన్ పిన్’ అవార్డుకు ఎంపిక చేసింది. మన దేశంలో విశేష కృషికి గుర్తింపుగా ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారంలాంటిదే ‘వెటరన్ పిన్’ అవార్డు. తను ఈ అవార్డుకు ఎంపికైన విషయాన్ని ఆమె ట్విట్టర్లో తెలియజేసింది. ‘ప్రపంచ అథ్లెటిక్స్‌లో సుదీర్ఘ కాలం పాటు చేసే సేవలకు గుర్తింపుగా ఐఏఏఎఫ్ వెటరన్ పిన్ అవార్డు అందజేస్తారు. అలాంటి విశిష్ట పురస్కారానికి నేను ఎంపికవడం చాలా సంతోషంగా ఉంది. ఐఏఏఎఫ్‌కు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేసింది. దోహాలో సెప్టెంబర్ 24న జరిగే ఐఏఏఎఫ్ కాంగ్రెస్‌లో 55 ఏళ్ల ఉషకు ఈ అవార్డు అందజేస్తారు. -
అర్పిందర్‌కు కాంస్యం
ఒస్ట్రావా (చెక్ రిపబ్లిక్): అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యల సంఘం (ఐఏఏఎఫ్) కాంటినెంటల్ కప్‌లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా అర్పిందర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్‌లో అర్పిందర్ 16.59 మీటర్ల దూరం దూకి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఈటెను 80.24 మీటర్లు విసిరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
రష్యాకు ఎదురుదెబ్బ!
ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లకు నో ఎంట్రీ తీర్పు వెలువరించిన సీఏఎస్ నిషేధం దిశగా అడుగులు లుసానే: డోపింగ్ స్కామ్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తమ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు రియోలో పాల్గొనకుండా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) గురువారం తోసిపుచ్చింది. రష్యా అథ్లెట్లు రియోలో పాల్గొనేందుకు అర్హత లేదని స్పష్టం చేసింది. అలాగే ఐఏఏఎఫ్ విధించిన నిషేధాన్ని సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ‘తమ కింద పనిచేసే జాతీయ సమాఖ్యలను ఐఏఏఎఫ్ సస్పెండ్ చేసినప్పుడు దానికి సంబంధించిన అథ్లెట్లు కూడా అనర్హులవుతారు. ఇది ఐఏఏఎఫ్ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ఫలితంగా ఆయా సమాఖ్యలకు చెందిన అథ్లెట్లు గేమ్స్‌లో పాల్గొనడానికి వీల్లేదు’ అని సీఏఎస్ కోర్టు పేర్కొంది. కోర్టు తీర్పుతో రష్యాకు చెందిన 68 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల భవిష్యత్ ప్రస్తుతానికి సందిగ్దంలో పడింది. కోర్టు తీర్పు అథ్లెట్లకు అంతిమయాత్ర వంటిదని రష్యా పోల్‌వాల్ట్ మాజీ చాంపియన్ ఇసిన్ బయోవా తెలిపింది. ఐఓసీ ఏం చేస్తుందో...! సీఏఎస్ తీర్పు తర్వాత బంతి ఇప్పుడు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కోర్టులోకి వెళ్లింది. ఓ రాష్ట్రమే డోపింగ్‌కు కేంద్రంగా మారడంతో రష్యాపై కచ్చితంగా నిషేధం విధించాల్సిందేనని చాలా దేశాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు రియో ఒలింపిక్స్‌కు మరో 15 రోజులే గడువు ఉండటంతో ఇప్పుడు ఐఓసీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. సీఏఎస్ తీర్పు తర్వాత రష్యాకు చెందిన మిగతా క్రీడాకారులు కూడా గే మ్స్‌లో పాల్గొనే అంశంపై స్పష్టత కరువైంది. రష్యాపై పూర్తి నిషేధం విధించడానికి ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు తొలి అడుగని విశ్లేషకులు భావిస్తున్నారు.