second One-Day
-
రెండో వన్డే ఇంగ్లండ్ దే
5 వికెట్లతో ఓడిన దక్షిణాఫ్రికా పోర్ట్ ఎలిజబెత్: బౌలింగ్‌లో విఫలమైన దక్షిణాఫ్రికా.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ ఓటమిపాలైంది. హేల్స్ (99), బట్లర్ (48 నాటౌట్) చెలరేగి ఆడటంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో సఫారీలపై నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మోర్గాన్‌సేన 2-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. డిలియర్స్ (73), డుమిని (47), డు ఫ్లెసిస్ (46) రాణించారు. టోప్లే 4 వికెట్లు తీశాడు. తర్వాత ఇంగ్లండ్ 46.2 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు చేసింది. బట్లర్ (48 నాటౌట్), రూట్ (38), మోర్గాన్ (29) ఫర్వాలేదనిపించారు. అబాట్ 3, మోర్కెల్ 2 వికెట్లు తీశారు. ఇరుజట్ల మధ్య మూడో వన్డే సెంచూరియన్‌లో మంగళవారం జరుగుతుంది. -
భారత్ 105 ఆలౌట్.. బంగ్లాతో రెండో వన్డే
మీర్పూర్ (బంగ్లాదేశ్): బంగ్లాదేశ్‌తో తొలివన్డేలో ఘనవిజయం సాధించిన భారత్ రెండో వన్డేలో పరుగుల వేటలో చతికిలపడింది. మూడు వన్డేల సిరీస్‌లో మంగళవారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 25.3 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టులో సురేష్ రైనా (27) టాప్ స్కోరర్. బంగ్లా అరంగేట్ర బౌలర్ టస్కిన్ అహ్మద్ ఐదు వికెట్లు పడగొట్టాడు. వర్షం అంతరాయం కలిగించడంతో ఇన్నింగ్స్‌ను 41 ఓవర్ల చొప్పున కుదించారు. భారత్ 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసిన సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. తెరిపినిచ్చాక మళ్లీ ఆరంభమైంది. -
భారత్-బంగ్లా రెండో వన్డే 41 ఓవర్లకు కుదింపు
మీర్పూర్ (బంగ్లాదేశ్): భారత్, బంగ్లాదేశ్‌ల రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఆరంభమైన ఈ మ్యాచ్ కాసేపటికే ఆగిపోయింది. టాస్ గెలిచిన బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ఈ సమయంలో భారీ వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. వర్షం తెరిపినిచ్చాక మ్యాచ్ మళ్లీ మొదలైంది. కాగా మ్యాచ్‌ను 41 ఓవర్ల ఇన్నింగ్స్ చొప్పున కుదించారు. వకాశముంది.