5 వికెట్లతో ఓడిన దక్షిణాఫ్రికా
పోర్ట్ ఎలిజబెత్: బౌలింగ్‌లో విఫలమైన దక్షిణాఫ్రికా.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ ఓటమిపాలైంది. హేల్స్ (99), బట్లర్ (48 నాటౌట్) చెలరేగి ఆడటంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో సఫారీలపై నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మోర్గాన్‌సేన 2-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. డిలియర్స్ (73), డుమిని (47), డు ఫ్లెసిస్ (46) రాణించారు. టోప్లే 4 వికెట్లు తీశాడు. తర్వాత ఇంగ్లండ్ 46.2 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు చేసింది. బట్లర్ (48 నాటౌట్), రూట్ (38), మోర్గాన్ (29) ఫర్వాలేదనిపించారు. అబాట్ 3, మోర్కెల్ 2 వికెట్లు తీశారు. ఇరుజట్ల మధ్య మూడో వన్డే సెంచూరియన్‌లో మంగళవారం జరుగుతుంది.
రెండో వన్డే ఇంగ్లండ్ దే
Published Sun, Feb 7 2016 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM
Advertisement
Advertisement