భారత్ 105 ఆలౌట్.. బంగ్లాతో రెండో వన్డే | India 105 all out against Bangladesh in second One-Day | Sakshi
Sakshi News home page

భారత్ 105 ఆలౌట్.. బంగ్లాతో రెండో వన్డే

Published Tue, Jun 17 2014 5:39 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

India 105 all out against Bangladesh in second One-Day

మీర్పూర్ (బంగ్లాదేశ్): బంగ్లాదేశ్తో తొలివన్డేలో ఘనవిజయం సాధించిన భారత్ రెండో వన్డేలో పరుగుల వేటలో చతికిలపడింది. మూడు వన్డేల సిరీస్లో మంగళవారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 25.3 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టులో సురేష్ రైనా (27) టాప్ స్కోరర్. బంగ్లా అరంగేట్ర బౌలర్ టస్కిన్ అహ్మద్ ఐదు వికెట్లు పడగొట్టాడు.

 

వర్షం అంతరాయం కలిగించడంతో ఇన్నింగ్స్ను 41 ఓవర్ల చొప్పున కుదించారు. భారత్ 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసిన సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. తెరిపినిచ్చాక మళ్లీ ఆరంభమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement