secret survey
-
మళ్లీ రహస్య సర్వే...
సాక్షి, టెక్కలి : అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం గ్రానైట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. టెక్కలి పరిసర ప్రాంతాల్లో లభించే నీలి గ్రానైట్‌కు దేశ విదేశాల్లో ఎంతో గిరాకీ ఉంది. నందిగాం మండలం సొంటినూరు ప్రాంతం సర్వే నంబరు 1లో అతి విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటి ఖరీదైన గ్రానైట్‌ను ఎలాగైనా దక్కించుకోవాలనే ఎత్తుగడలతో దిల్లీ, ముంబయ్‌కు చెందిన బడా కార్పొరేట్ సంస్థలు కొన్ని రహస్య సర్వేలకు మరోసారి సిద్ధమవుతున్నారు. గతంలో టీడీపీ హయాంలో టీడీపీ రాష్ట్ర స్థాయి అగ్ర నాయకుడి సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఈ రహస్య సర్వేలకు సహకరించినట్లు సమాచారం. అప్పట్లో ‘సాక్షి’లో వచ్చిన కథనంతో రహస్య సర్వేలకు కొన్ని నెలలపాటు విరామం ఇచ్చారు. అయితే రాష్ట్రంలో టీడీపీ గల్లంతు కావడం... టీడీపీకి చెందిన కొంతమంది అగ్ర నాయకులు బీజేపీలో చేరడంతో కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మరోసారి రహస్య సర్వేలకు తెర తీస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పారదర్శకమైన పాలన కొనసాగుతున్న నేపథ్యంలో తమ రహస్య సర్వేలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించదనే భయంతో కేంద్ర ప్రభుత్వం అండ ఉన్న కొంతమంది నాయకులను అడ్డం పెట్టుకుని మరోసారి రహస్య సర్వేలకు తెగబడుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో కొన్ని రకాల ఆంక్షలు ఉన్నప్పటికీ ఆయా నిక్షేపాలను తీసేందుకు అడ్డంకులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఎలాగైనా విలువైన నీలి గ్రానైట్ నిక్షేపాలను సొంతం చేసుకునేందుకు దిల్లీ, ముంబాయ్‌కు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలు స్కెచ్ వేసినట్లు సమాచారం. అత్యాధునిక పరికరాలతో అర్ధరాత్రి రహస్య సర్వేలు సుమారు 1686 ఎకరాల విస్తీర్ణం కలిగిన సొంటినూరు కొండపై ఇప్పటికే సుమారు 75 ఎకరాల వరకు గ్రానైట్‌కు అనుమతులు ఉన్నాయి. మిగిలిన ప్రాంతానికి సంబంధించి కొన్ని రకాల ఆంక్షలతో అనుమతులు నిలిచిపోయాయి. విలువైన ఖనిజ నిక్షేపాలను సొంతం చేసుకోవడానికి దిల్లీ, ముంబాయ్‌కు చెందిన కొన్ని కార్పొరేట్ కంపెనీలు మరోసారి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అత్యాధునిక జర్మన్, జపాన్ టెక్నాలజీకు చెందిన శాటిలైట్, లేజర్ సర్వేలతో అర్ధరాత్రి సమయాల్లో రహస్య సర్వేలు చేసి బడా కంపెనీలకు అనుకూలంగా ఉన్న కొంతమంది వ్యక్తులతో పదుల సంఖ్యలో దరఖాస్తులు చేయించి పై స్థాయి నుంచి ఒత్తిడితో గ్రానైట్ క్వారీ అనుమతులను దక్కించుకునే ప్రయత్నాలు చేశారు. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి చెందిన చెందిన రాష్ట్ర నాయకుని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితోపాటు జాతీయ ఖనిజ సంస్థకు చెందిన అదే సామాజిక వర్గం అధికారితో కార్పొరేట్ సంస్థలు కుమ్మక్కై అప్పట్లో శాటిలైట్, లేజర్ సర్వేలు చేసిన విషయం బయట పడడంతో కొన్ని నెలలపాటు ఆ ప్రయత్నాలకు విరామం పలికారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న కొంతమంది నాయకుల అండతో మరోసారి రహస్య సర్వేలకు తెర తీసినట్లు తెలుస్తోంది. ఈ సర్వేల్లో భాగంగా భూ అంతర్భాగం క్వారీయింగ్ విధానాన్ని అనుసరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భూమి లోపల సుమారు 500 నుంచి 800 మీటర్ల వరకు లేజర్ సర్వేలు నిర్వహించి నీలి గ్రానైట్ నిక్షేపాల ఖనిజాలను కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు భోగట్టా. ఈ ప్రాంతంలో విస్తారంగా ఉన్న విలువైన నీలి గ్రానైట్ ఖనిజ సంపదపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి ఈ సంపదను రాష్ట్రాభివృద్ధికి వినియోగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రహస్య సర్వేల విషయంపై దృష్టి సారిస్తాం సొంటినూరు కొండపై రహస్య సర్వేల విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. సొంటినూరు పరిసర ప్రాంతాల్లో కొండల పై గ్రానైట్ నిర్వహణకు ఇప్పటికే కొన్ని దరఖాస్తులు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేస్తాం. –కె.శంకర్రావు, మైన్స్ ఏడీ, టెక్కలి -
భారత్‌లోనూ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’లు
న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కన్సల్టెన్సీ సంస్థ 8.7 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అంతకు మించిన సమాచార కుంభకోణాలు మన దేశంలోనే జరుగుతున్న విషయం ‘ఇండియా టుడే’ రహస్య పరిశీలనలో తాజాగా తేటతెల్లమైంది. ఆన్లైన్ వ్యవస్థ, సమాచారంపై దేశంలో సరైన నియంత్రణ, చట్టాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రజల ఓట్లను ప్రభావితం చేయడం కోసం భారత్‌లోనూ వివిధ ప్రధాన నగరాల్లో కన్సల్టెన్సీ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఉద్యోగాల కోసం జాబ్ పోర్టళ్లలో రెజ్యూమె పెట్టినప్పుడు, షాపింగ్ యాప్‌లు, ఆఫ్‌లైన్ స్టోర్లలో షాపింగ్ చేసినప్పుడు, క్రెడిట్, డెబిట్ కార్డులు వాడినప్పుడు, బ్యాంకులు, టెలికం, డీటీహెచ్ సేవలను ఉపయోగించుకున్నప్పుడు.. ఇలా ప్రతీ సందర్భంలోనూ కోట్లాది మంది ప్రజల అమూల్యమైన సమాచారాన్ని అవి తస్కరిస్తున్నాయి. తర్వాత ఆ వివరాలను ఉపయోగించుకుని వినియోగదారుల అభిరుచులను బట్టి వారి ఓట్లను ప్రభావితం చేసేలా వివిధ రాజకీయ పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని మొబైల్‌తోపాటు వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లోనూ మెసేజ్‌లు పంపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేస్తాం.. ఢిల్లీకి చెందిన ‘జనాధార్’ అనే కన్సల్టెన్సీ సంస్థ వ్యవస్థాపకుడు మనీశ్ మాట్లాడుతూ అనేక మార్గాల్లో సేకరించిన ఓటర్ల జాబితా తమ వద్ద ఉందనీ, ఈ నెలలోనే జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తామని ఇండియా టుడే విలేకరికి హామీనిచ్చాడు. రెండోసారి విలేకరి మనీశ్‌ను కలిసినప్పటికి దక్షిణ బెంగళూరు నియోజకవర్గానికి చెందిన రెండు లక్షల ఓటర్ల వివరాలను అతను సేకరించి పెట్టాడు. ఓటరు పేరు, చిరునామా, ఫోన్ నంబర్, పాన్, ఆధార్ నంబర్, ఆర్థిక పరమైన వివరాలు కూడా ఉన్నాయి.‘ఎవరైనా ఉద్యోగం కోసం జాబ్ పోర్టళ్లలో రెజ్యూమె పెట్టినా, క్రెడిట్ కార్డు వాడినా, లాయల్టీ ప్రోగ్రాంలలో సభ్యత్వం తీసుకున్నా వారికి సంబంధించిన సమాచారం నాకు అందుతుంది. వారు వారి సమాచారాన్ని ఎక్కడ ఇచ్చినా అది నాకు చేరుతుంది’ అని మనీశ్ చెప్పుకొచ్చాడు. అయితే బెంగళూరు నగరంలోని ఒక నియోజకవర్గ ఓటర్ల సమాచారాన్ని ఇచ్చేందుకే అతను ఏకంగా 1.2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. టెలికం అధికారులతో లాలూచీ.. టెలికాం కంపెనీల అధికారులతో కుమ్మక్కయ్యి ఒక్కో ప్రాంతంలోని టవర్ల నుంచి ప్రతి వినియోగదారుడి సమాచారాన్ని తాము సేకరిస్తున్నామని పోల్స్టర్ అనే మరో సంస్థ ప్రతినిధి వెల్లడించారు. అలాగే ఓటు హక్కుపై అవగాహన కల్పించే నెపంతో తమ సిబ్బంది వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి ఓటర్ల సమాచారాన్ని సేకరిస్తారని కూడా ఆయన తెలిపారు. ఈ విధంగా వచ్చిన సమాచారంతో కనీసం 5 నుంచి 6 శాతం ఓటర్లను ప్రభావితం చేయొచ్చని వివరించారు. ఢిల్లీకి చెందిన మావరిక్ డిజిటల్, ముంబై కేంద్రంగా పనిచేసే క్రోనో డిజిటల్ తదితర కంపెనీలు కూడా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఇండియా టుడే పరిశీలనలో బయటపడింది. -
‘రజనీ పేరవై’తో ప్రజల్లోకి..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ ‘రజనీ పేరవై’ (రజనీ సమాఖ్య) పేరుతో ప్రజల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందరూ అనుకుంటున్నట్లుగా ఆయన ఈ నెల 31న పార్టీ ప్రకటించబోరని తెలుస్తోంది. అయితే ‘రజనీ పేరవై’ పేరిట ఒక వేదికను ప్రకటిస్తారని సమాచారం. 20– 30 ఏళ్ల మధ్యనున్న యువకులను పేరవైలో సభ్యులుగా చేర్చుకోవాలని అభిమాన సంఘాలకు ఇప్పటికే రజనీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. నియోజవర్గాల వారీగా జనాభా, ఓటర్ల సంఖ్య, స్థానిక సమస్యల గురించి సమాచారం సేకరించే బాధ్యతలను పేరవై ప్రతినిధులకు అప్పగించే అవకాశాలున్నాయి. అలాగే తాను పార్టీ స్థాపిస్తే సినీ పరిశ్రమ నుంచి ఎవరెవరు వస్తారని రహస్య సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, అభిమానులతో రజనీ భేటీ చెన్నైలో గురువారమూ కొనసాగింది. -
చిల్లర దేవుళ్లకు.. వెయ్యి కోట్ల ‘మామూళ్లు’
సాక్షి, హైదరాబాద్ : ప్రజలకు నిత్యం వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాల్లో ఎన్నో రకాల సేవలు అవసరం. అవన్నీ జనానికి ఉచితంగానే అందాలి. కానీ ఇలా మామూలుగా అందాల్సిన సేవలు ప్రభుత్వ కార్యాలయాల్లో ‘మామూళ్లు’గా మారాయి. ప్రతి సేవకూ తృణమో, పణమో సమర్పించక తప్పదు కదా అన్న భావన కూడా స్థిరపడిపోయింది. రాష్ట్రంలో ఏటా ఇలాంటి చిన్న చిన్న ‘చిల్లర’లంచాల మొత్తమే ఏకంగా రూ. 1,000 కోట్లు దాటిపోతోంది. ప్రజలకు తరచూ ఏదో ఒక పనిపడే ప్రభుత్వ విభాగాల్లో ఈ జాడ్యం ఎక్కువగా ఉంటోంది. ఇలా ఒక్కో శాఖ పరిధిలోని అధికారులు, సిబ్బంది జేబుల్లోకి ఏటా వేల కోట్ల రూపాయలు చేరుతున్నట్లు ఏసీబీ, విజిలెన్స్ విభాగాల రహస్య అధ్యయనంలోనే వెల్లడైంది. ఇక అవసరమైన పెద్ద పనుల కోసం, అక్రమాలు, అవకతవకలకు సహకరిస్తూ అధికారులు, సిబ్బంది డిమాండ్ చేసే ‘ముడుపులు’వేరే. అవన్నీ లెక్కగడితే వేల కోట్ల రూపాయలకు చేరుతాయని అంచనా. ‘చిల్లర’లంచాల్లో రెవెన్యూ టాప్ అన్ని ప్రభుత్వ విభాగాలతో పోలిస్తే.. రెవెన్యూ విభాగం ప్రజలకు మరింత దగ్గరగా ఉంటుంది. అదే క్రమంలో చిన్న చిన్న లంచాల స్వీకరణలోనూ టాప్‌లో నిలుస్తోంది. స్థానిక, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నుంచి భూముల లెక్కలు సరిచేసే వరకు చాలా రకాల సేవలు అందించే రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందికి చదివింపులు భారీగానే ఉంటున్నట్టు విజిలెన్స్ అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో కొత్త మండలాలతో కలిపి మొత్తంగా 584 మండలాలు ఉన్నాయి. వీటిలో 510 కార్యాలయాలు నిత్యం బిజీగా ఉంటాయి. వీటిలో పనుల కోసం వచ్చే జనం.. రోజూ సగటున సుమారు రూ.35 వేల వరకు సమర్పించుకుంటున్నారు. ఈ లెక్కన మండల రెవెన్యూ కార్యాలయాలన్నింటిలో కలిపి రోజుకు రూ.1.7 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 645 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతున్నట్లు విజిలెన్స్, ఏసీబీల అధ్యయనంలో వెల్లడైంది. కలెక్టరేట్లలోనూ.. రెవెన్యూ శాఖ పరిధిలో 31 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లోనూ ‘మామూళ్లు’కోట్లకు చేరిపోయాయి. ఒక్కో జిల్లా కలెక్టరేట్లో సగటున రోజూ రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు చదివింపులు జరుగుతున్నాయని.. ఇలా ఏటా రూ.273 కోట్ల మేర లంచాలు వసూలవుతున్నాయని ఏసీబీ ఇటీవల జరిపిన రహస్య అధ్యయనంలో గుర్తించింది. రవాణా శాఖలో ఏటా రూ.220 కోట్లు వాహనాల రిజిస్ట్రేషన్లు సహా పలు రకాల సేవలు అందించే రవాణా శాఖలో లంచాల పర్వం ఎక్కువగానే ఉంది. ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని ఉండకుండా అప్పటికప్పుడే పని పూర్తికావాలంటూ వాహనదారులు మామూళ్లు చెల్లిస్తున్నారని.. ఇలా రోజూ సుమారు రూ. 60 లక్షల మేర లంచంగా సమర్పించుకుంటున్నారని ఏసీబీ, విజిలెన్స్ అధ్యయనంలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 54 ఆర్టీఏ, యూనిట్ ఆఫీసులలో ఒక్కో యూనిట్లో రోజుకు రూ.లక్ష మేరకు చిన్న చిన్న లంచాలు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి వెళుతున్నట్లు అంచనా. ఇలా ముడుపుల సొమ్ము ఏటా రూ.220 కోట్ల వరకు చేరుతోంది. రిజిస్ట్రేషన్‌లో ‘మామూలే’! స్థలం అమ్మినా, కొన్నా, బదిలీ చేసినా.. ఇలా 14 రకాల సేవలు అందించే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగంలోనూ చిన్న చిన్న ముడుపులు మామూలైపోయాయి. రాష్ట్రంలో 22 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, 195 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో పట్టణ ప్రాంతాల్లోని 22 కార్యాలయాల్లో ఒక్కో దానిలో నెలకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు (మొత్తంగా 66 లక్షలు).. 195 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్కోదానిలో నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ( మొత్తంగా రూ.1.56 కోట్లు) చిల్లర లంచాలు జమవుతున్నాయి. మొత్తంగా జిల్లా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కలిపి నెలకు సుమారు రూ.2.2 కోట్ల చొప్పున ఏటా రూ.26 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతోందని ఏసీబీ, విజిలెన్స్ సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. ఎక్సైజ్‌లో నెలకు రూ.15 కోట్లు.. మద్యం అమ్మకాలపై రాష్ట్ర ఖజానాలకు వేల కోట్ల రూపాయలు వచ్చిచేరుతున్నట్టే.. అధికారులు, సిబ్బంది జేబుల్లోకి కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఏసీబీ అధికారులు చేసిన అధ్యయనం మేరకు.. ప్రతీ నెల జిల్లాల వారీగా రూ.45 లక్షల నుంచి రూ.60 లక్షల దాకా చిన్న చిన్న చదివింపులు ఉంటున్నాయి. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల రూ. 15 కోట్ల చొప్పున ఏడాదికి రూ.180 కోట్ల మేర ‘మామూళ్లు’అందుతున్నాయి. జీఎస్టీతో తగ్గిన ‘వాణిజ్య’జోరు వాణిజ్య పన్నుల శాఖలో పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. జీఎస్టీ రాకముందు వాణిజ్య పన్నుల శాఖకు వ్యాపారుల నుంచి రోజు వారీ చెల్లింపులు భారీగానే ఉండేవి. కానీ జీఎస్టీ వచ్చిన తర్వాత నెల వారీగా మాత్రమే చదివింపులు వస్తున్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలోని 12 డివిజన్లలో ప్రతీ నెలా రూ.65 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ‘చిన్న మొత్తాలు’వస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇలా ఏటా రూ.10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతోంది. వీటిలో నెలవారీ వసూళ్లు..! సమయం, సందర్భాన్ని బట్టి ప్రజలు ఉపయోగించుకునే విభాగాల్లో.. రోజు లెక్కన కాకుండా నెలవారీగా ‘చదివింపులు’జరుగుతున్నాయి. పోలీసు, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మున్సిపల్, తూనికలు కొలతలు, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాలకు నెలవారీగా చిన్న లంచాలు అందుతున్నాయి. వీటిల్లో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మొదటి, రెండో స్థానాల్లో ఉండగా... జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపల్ శాఖలు అనుమతులను బట్టి మూడో స్థానంలో ఉన్నాయి. తూనికలు కొలతలు, పోలీసుశాఖ నాలుగో స్థానంలో ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా ‘చదివింపులు’ ⇒ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపల్ విభాగాల్లో అనుమతుల అవసరాలు, సందర్భాన్ని బట్టి ‘చిల్లర లంచం’సమర్పణలు జరుగుతున్నాయి. ఈ మూడింటిలో కలిపి ఏటా రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ‘చిన్న మొత్తాలు’అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతున్నాయి. ⇒ పోలీసు శాఖలోనూ జిల్లాల్లో నెలవారీ మామూళ్ల లెక్క కోట్లు దాటుతోంది. కమిషనరేట్లు, జిల్లా పోలీస్ విభాగాల పరిధిలో 740 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. పట్టణ ప్రాంత పోలీస్స్టేషన్లలో రూ.5 లక్షల వరకు, రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రూ.లక్ష వరకు మామూళ్లు వస్తున్నట్లు ఏసీబీ అధ్యయనంలో గుర్తించింది. ఈ లెక్కన మొత్తంగా ఏటా రూ.180 కోట్ల మేర చిల్లర చెల్లింపులు ఉంటున్నట్టు తేల్చింది. ⇒ తూనికలు కొలతలు, కాలుష్య నియంత్రణ మండలిలకు కేసుల వారీగా చెల్లింపులు ఉంటున్నట్టు ఏసీబీ అధ్యయనంలో తేల్చింది. ఈ రెండు విభాగాల్లో ఏటా రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ‘చిల్లర’చెల్లింపులు ఉంటున్నట్టు అంచనా వేసింది. -
జిల్లా నేతలపై టీడీపీ రహస్య సర్వే
-
స్టాలిన్ సర్వే
రాష్ట్రంలో జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, అక్కడి నేతల వ్యవహార శైలి గురించి డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ రహస్య సర్వే నిర్వహించి ఉన్నారు. బలహీనంగా ఉన్నచోట్ల బలోపేతం లక్ష్యంగా, గ్రూపు తగాదాలు ఉన్న చోట్ల ప్రత్యామ్నాయం అడుగులకు సిద్ధం అయ్యారు. గ్రూపు రాజకీయాలు సాగిస్తున్న జిల్లాల నేతల్ని పిలిపించి చీవాట్లు పెట్టడంతోపాటుగా తీవ్ర హెచ్చరికలు చేసి పంపుతున్నారు. ఉన్న జిల్లాల సంఖ్యను 65కు చేర్చారు. నాయకుల్లో ఉన్న అసంతృప్తి జ్వాలను చల్లార్చే రీతిలో వ్యవహరించి పదవుల్ని కేటాయించారు. అనేక జిల్లాల్లో కీలక పదవుల్ని కొత్త వాళ్లకు, యువతకు అప్పగించారు. ఇంత వరకు అంత బాగానే ఉన్నా, జిల్లాల్లో సీనియర్లు, జూనియర్లు అన్న బేధాలు లేకుండా అందరూ సమిష్టిగా పనిచేయాలన్న విషయాన్ని సేనలకు ఉపదేశించడంలో మరిచారు. దీంతో కొత్తగా ఎంపికైన వాళ్లకు సీనియర్లను చిక్కులు, సమస్యలు తప్పలేదు. ఇది కాస్త గ్రూపులకు ఆజ్యం పోసి ఉన్నది. స్టాలిన్ సర్వే : అధినేత కరుణానిధి వారసుడిగా, ప్రతినిధిగా నిత్యం పార్టీ వర్గాలకు అందుబాటులో ఉన్నది డిఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ అన్న విషయం తెలిసిందే. పార్టీ సంస్థాగత సమరం, పదవుల పందేరాలు ముగియడంతో ప్రస్తుతం జిల్లాల్లో పార్టీ పరిస్థితి, నేతల తీరు తెన్నులు , వ్యవహార శైలిపై స్టాలిన్ రహస్య సర్వే చేపట్టి ఉన్నారు. రాష్ర్టంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాల వారీగా సమాచారాన్ని సేకరించి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలం పేరిగి ఉన్నట్టు ఆ సర్వేలో తేలి ఉన్నది. అలాగే, గతంలో మరీ బలహీనంగా ఉన్న కొన్ని జిల్లాల్లో పార్టీ బల పడ్డా, కొందరు నాయకుల గ్రూపు రాజకీయాల రూపంలో ఎన్నికల వేళ చిక్కులు తప్పవన్న విషయం ఆ సర్వేలో తేలింది. ఈ సమాచారంతో మేల్కొన్న స్టాలిన్ గ్రూపు రాజకీయాలకు కల్లెం వేసే పనిలో పడ్డారు. రోజుకు ఒక జిల్లా చొప్పున అక్కడున్న నాయకులందరిని పిలిపించి క్లాస్ పీకే పనిలో పడ్డట్టు అన్నా అరివాలయం వర్గాలు పేర్కొంటున్నారు. హెచ్చరికలు : అన్ని జిల్లాల నాయకులతో స్టాలిన్ మంతనాలు జరుపుతూ, సూచనలు సలహాలు, మందలిస్తున్నా, ప్రధానంగా పదిహేను జిల్లా నాయకుల్ని మాత్రం టార్గెట్ చేసి తీవ్రంగా హెచ్చరించే పనిలో పడ్డట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా బుధవారం తిరునల్వేలి జిల్లాలోని నాయకులతో సాగిన భేటీ వాడి వేడిగా జరిగినట్టు పేర్కొంటున్నారు. ఈ సమావేశానికి తిరునల్వేలి పరిధిలోని మూడు జిల్లాల కార్యదర్శులు ఆవుడయప్పన్, అబ్దుల్ వాహాబ్, దురై రాజ్‌లతో పాటుగా మాజీ మంత్రు లు పూంగోదై, మొహిద్దీన్ ఖాన్, యూనియన్, నగర విభాగాల నాయకుల్ని, మాజీ ఎమ్మెల్యేలను పిలిపించి ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కరుప్పుస్వామి పాండియన్ మాత్రం డుమ్మా కొట్టారు. ఈ భేటీలో ప్రధానంగా గ్రూపు రాజకీయాలకు కల్లెం వేయడం లక్ష్యంగా స్టాలిన్ తీవ్రంగా స్పందించినట్టు ఆ జిల్లా నాయకులు ఒకరు పేర్కొన్నారు. రెండు గంటల పాటుగా సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో పరిస్థితులు డీఎంకేకు అనుకూలంగానేఉన్నాయని, ఐక్యతతో ముందుకు సాగని పక్షంలో ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించి ఉన్నారు. ఎవరికి వారు గ్రూపులతో, విబేధాలతో సాగిన పక్షంలో పార్టీని ఒడ్డుకు చేర్చడం కష్టం అని మందలించి ఉన్నారు. వాళ్లతో కలిసి పనిచేయం, వీళ్లతో కలసి పనిచేయం అని వాళ్లు మర్యాదగా పార్టీ నుంచి బయటకు వెళ్ల వచ్చని, అసవరం అయితే, జిల్లా కమిటీల్ని రద్దు చేస్తానని తీవ్రంగా హెచ్చరించినట్టుగా అన్నా అరివాలయంలో చర్చ సాగుతున్నది. స్టాలిన్ తీవ్రంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో గ్రూపుల్ని కట్టిబెట్టి ఐక్యతను చాటుకునే విధంగా స్టాలిన్ ఎదుట ప్రత్యక్షం అయ్యేందుకు ఆయా జిల్లాల నాయకులు సిద్ధం అవుతున్నారటా..!