చంద్రబాబుతో అంజన్ కుమార్ భేటీ
హైదరాబాద్: తన కుమార్తె వివాహానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని ఆహ్వానించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం చంద్రబాబు నివాసం బయట అంజన్ కుమార్ యాదవ్ విలేకర్లతో మాట్లాడారు. పార్టీ మారే ఉద్దేశ్యం ఏమైనా ఉందా అంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు అంజన్ కుమార్ సమాధానమిస్తూ.... తన కుమార్తె వివాహం నిశ్చయమైందని... ఈ నేపథ్యంలో ఆ వివాహానికి రావాల్సిందిగా బాబును ఆహ్వానించేందుకు తాను వచ్చినట్లు అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. చంద్రబాబుకు తన కుమార్తె పెండ్లి ఆహ్వాన పత్రికను ఇచ్చి ఆహ్వానించినట్లు అంజన్ కుమార్ యాదవ్ చెప్పారు.