నెక్కంటిలో అధికార యంత్రాంగం తనిఖీలు
జె.తిమ్మాపురం (పెద్దాపురం) :
స్థానిక జగ్గంపేట రోడ్డులోని జె.తిమ్మాపురం పంచాయతీ పరిధిలో గల నెక్కంటి సీ ఫుడ్ (రొయ్యల పరిశ్రమ)లో శుక్రవారం పలు శాఖల అధికారులు అకస్మిక తనిఖీ చేశారు. గత నెల 24వ తేదీన అమోనియా గ్యాస్ లీకై పలువురు అస్వస్థతకు గురి కావడం, తదుపరి అధికారుల తనిఖీ అనంతరం తాత్కాలికంగా పరిశ్రమను మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శుక్రవారం కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్దాపురం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, చీఫ్ ఇ¯ŒSస్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్‌రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి జిల్లా ఈఈ రవీంద్రబాబు, అడిష¯ŒS డీఎంహెచ్ఓ సత్యనారాయణ, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, సాంకేతిక నిపుణులు ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టారు. కార్మికుల రక్షణకు తీసుకున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రధానంగా ప్రొసెసింగ్ జరిగే ప్రదేశంలో కావాల్సిన ఏహెచ్, ఏసీ మెషీన్ పరికరాల అమరిక. గ్యాస్ లీక్, ఆక్సిజ¯ŒS పరిశీ లించి సంతృప్తిని వ్యక్తం చేశారు. తదుపరి చేపట్టాల్సిన థర్డ్‌పార్టీ ఏజెన్సీ ఏర్పాటు చేయాల్సిందని, తదుపరి తనిఖీ ల అనంతరం పరిశ్రమ పునః ప్రారంభమౌతుందని అధికారులు తెలిపారు. ఆయా ప్రదేశా ల్లో కోరమండ ల్, ఎ¯ŒSఎఫ్‌సీఎల్ సాంకేతిక నిపుణుల బృం దం ప్లాంట్‌లో ఉన్న ఆక్సిజన్, అమోనియా సెన్సార్ల స్థా యిని క్షుణ్ణంగా తనిఖీ చేసి నివేదికలు ఇచ్చారు. ఆ ర్డీవో విశ్వేశ్వరరావు మాట్లాడుతూ మరో సారి సంబం«ధి త అధికారులతో తనిఖీ చేశామని, నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పి స్తామన్నారు. త దుపరి ఆదేశాల మేరకు పరిశ్రమను ప్రారంభి స్తామని అన్నారు.