Seeman director
-
29న నటి విజయలక్ష్మి కోర్టులో హాజరుకావాల్సిందే
ఇటీవల శాండల్‌వుడ్ విజయలక్ష్మి నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అతని వల్ల ఏడుసార్లు అబార్షన్ అయిందంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సైతం దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఈ కేసు ఊహించని విధంగా మలుపులు తిరిగింది. సీమాన్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. దీంతో మద్రాస్ హైకోర్టు నటి విజయలక్ష్మిని ఈ నెల 29న హాజరుకావాలని ఆదేశించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని నటి విజయలక్ష్మి 2011లో నామ్ తమిళర్ పార్టీ కోఆర్డినేటర్ సీమాన్న్పై వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. (ఇదీ చదవండి: వరస మార్చిన రైతుబిడ్డ.. రతికని అక్క అనేశాడు!) సీమాన్, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2011లో దాఖలు చేసిన ఫిర్యాదును 2012లో ఉపసంహరించుకోవాలని నటి విజయలక్ష్మి ఇచ్చిన లేఖ ఆధారంగా పోలీసులు కేసును క్లోజ్ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ కేసు విచారణ చేపట్టి సమన్లు జారీ చేశారు. 12 ఏళ్ల నాటి కేసులో ఫిర్యాదుదారుల తర్వాత రాజకీయ ఉద్దేశంతో కేసును మళ్లీ తెరుస్తున్నందున కేసు దర్యాప్తుపై నిషేధం విధించాలని కోరారు. ఈ కేసు చివరిసారి విచారణకు వచ్చినప్పుడు 2011లో నటి ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నప్పుడు కేసు ఎందుకు పెండింగ్‌లో ఉంచారో కూడా సమాధానం చెప్పాలని పోలీసులు ఆదేశించారు. ఈ వ్యాజ్యం మంగళవారం జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఎదుట మరోసారి విచారణకు వచ్చింది. పోలీసు రిపోర్టు దాఖలైంది. అనంతరం సీమాన్ కేసు రద్దుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు నటి విజయలక్ష్మిని 29న కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు విచారణను వాయిదా వేశారు. సీమాన్ సూపర్.. ఆయన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఓ సంస్థకు చెందిన వీరలక్ష్మి పర్యవేక్షణలో తాను గృహ నిర్భంధంలో ఉన్నట్టుగా గత కొద్ది రోజులుగా పరిణామాలు చోటు చేసుకున్నాయని విజయలక్ష్మి అన్నారు. ఇవి తనను ఎంతగానో బాధించాయని పేర్కొన్నారు. సీమాన్ సూపర్ అని.. ఆయన పవర్ ఫుల్ అని కామెంట్స్ చేశారు. ఆయన్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరని.. తాను మళ్లీ ఇక్కడికి రాబోనని, బెంగళూరు వెళ్లి పోతున్నట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. సీమాన్ పవర్ ముందు తాను ఓటమిని అంగీకరించి వెళ్తున్నానని అన్నారు. అతను బాగుండాలని.. రాజకీయంగా మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకున్నారు. తాను సీమాన్ వద్ద ఎలాంటి నగదు, మరే ఇతర తాయిలాలు తీసుకోలేదని మరోసారి ఆమె స్పష్టం చేశారు. -
ఏడుసార్లు అబార్షన్ అంటూ నటి ఫిర్యాదు.. అంతలోనే బిగ్ ట్విస్ట్!
ఇటీవల శాండల్‌వుడ్ విజయలక్ష్మి నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అతని వల్ల ఏడుసార్లు అబార్షన్ అయిందంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సైతం దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఈ కేసు ఊహించని విధంగా మలుపులు తిరిగింది. సీమాన్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. (ఇది చదవండి: మహేశ్ బాబు నుంచి మరో మల్టీఫ్లెక్స్ థియేటర్ రెడీ.. ఎక్కడో తెలుసా?) అయితే ఈ కేసులో ఇప్పటికే ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. సీమాన్ పలుమార్లు అబార్షన్లు చేయించారని ఆరోపిస్తూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. సీమాన్ తనను వాడుకుని మోసం చేసినట్టుగా దశాబ్దం కాలంగా విజయలక్ష్మి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీమాన్ పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి యూటర్న్ తీసుకుంది. వలసర వాక్కం పోలీసు స్టేషన్లో కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు లిఖిత పూర్వకంగా వినతిపత్రం సమర్పించారామె. దీంతో పోలీసులు సీమాన్ సూపర్.. ఓ సంస్థకు చెందిన వీరలక్ష్మి పర్యవేక్షణలో తాను గృహ నిర్భంధంలో ఉన్నట్టుగా గత కొద్ది రోజులుగా పరిణామాలు చోటు చేసుకున్నాయని విజయలక్ష్మి అన్నారు. ఇవి తనను ఎంతగానో బాధించాయని పేర్కొన్నారు. సీమాన్ సూపర్ అని.. ఆయన పవర్ ఫుల్ అని కామెంట్స్ చేశారు. ఆయన్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరని.. తాను మళ్లీ ఇక్కడికి రాబోనని, బెంగళూరు వెళ్లి పోతున్నట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. సీమాన్ పవర్ ముందు తాను ఓటమిని అంగీకరించి వెళ్తున్నానని అన్నారు. అతను బాగుండాలని.. రాజకీయంగా మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకున్నారు. తాను సీమాన్ వద్ద ఎలాంటి నగదు, మరే ఇతర తాయిలాలు తీసుకోలేదని మరోసారి ఆమె స్పష్టం చేశారు. (ఇది చదవండి: హర్ఘసాయి హీరోగా మెగా సినిమా.. టీజర్ వచ్చేసింది) -
సినీ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : సినీ దర్శకుడు సీమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'దేశంలో అన్నీ ప్రైవేట్ సంస్థల అధీనంలోకి వెళ్లిపోతున్నాయి. అన్నింటికీ పన్ను కడుతున్నాం. విద్యను, వైద్యాన్ని కొనుక్కుంటున్నాం. ఇక ప్రభుత్వం చేసే పనేంటని' ఆయన ప్రశ్నించారు. మన దేశ విద్యావిధానాన్ని మార్చాలన్న కథాంశంతో తెరకెక్కుతున్న మూవీ పాఠం. రోలాన్ మూవీస్ పతాకంపై పి.ఎస్.జుపిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఇ.రాజశేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తీక్, మోనా హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి మనో ఛాయాగ్రహణాన్ని, గణేశ్ రాఘవేంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న నామ్ తమిళర్ పార్టీ అధ్యక్షుడు సీమాన్ మాట్లాడుతూ.. ముందుగా పాఘం పేరుతో మన విద్యా విధానాన్ని ప్రశ్నించే చక్కని చిత్రాన్ని నిర్మిస్తున్న జుపిన్ను అభినందించారు. ఈ చిత్రం కచ్చితంగా పలు అవార్డులను గెలుచుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక విద్యను నేర్చుకోవడం విద్యార్ధుల హక్కు అని, దాన్ని సక్రమంగా అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అలాంటిది ఇప్పుడు విద్యే కాదు, వైద్యం, ఇతర అన్నీ వ్యాపారం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించాల్సినవన్నీ ప్రైవేట్‌పరం అవుతున్నాయనీ, అన్నిటికీ మనం పన్నులు చెల్లిస్తున్నా ఏదీ అందుబాటులోకి రావడం లేదని.. ప్రభుత్వం చేసే పనేంటని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వంటివారే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారంటే పాలకులకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై నమ్మకం లేదని నిరూపితమైందన్నారు. ఇక్కడ డబ్బున్నోళ్లే ప్రాణాలను కాపాడుకుంటారని, డబ్బు లేనోళ్లు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు దర్శకుడు సీమాన్. -
రజనీకాంత్‌ని ఢీ కొట్టేందుకు రెడీ
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఢీ కొట్టేందుకు నామ్ తమిళర్ కట్చి నేత, దర్శకుడు సీమాన్ సిద్ధమయ్యారు. రజనీ రాజకీయాల్లోకి ఒంటరిగా వచ్చినా, మద్దతుతో వచ్చినా ఢీ కొట్టేందుకు రెడీ అని సవాల్ విసిరారు. తమిళుడే ఈ గడ్డను ఏలాలని, ఎవరు బడితే వాళ్లు జబ్బలు చరిస్తే ఊరుకోమన్నారు. * తేల్చుకుందాం * సీమాన్ సవాల్ * తమిళుడే ఈ గడ్డను ఏలాలి సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించే విధంగా పలువురు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాను మాత్రం రాజకీయాల్లోకి రాబోనని రజనీ స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సినీ దర్శకుడిగా, నటుడిగా తమిళనాట ప్రస్తానాన్ని ఆరంభించి నామ్ తమిళర్ కట్చి నేతగా ఎదిగిన సీమాన్ ఏకంగా రజనీ కాంత్‌ను టార్గెట్ చేసి సవాళ్లు విసరడం చర్చనీయాంశమైంది. ‘‘ఒంటరిగా వస్తావా..మద్దతుగా వస్తా వా.. రా...తేల్చుకుందాం’’ అంటూ వారిద్దరి మధ్య పాత పగ ఉన్నట్లు సీమాన్ వ్యాఖ్యలు చేయడాన్ని రజనీ అభిమానులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు నామ్ తమిళర్ కట్చి, రజనీ అభిమానుల మధ్య వివాదాన్ని రేపే అవకాశాలు కన్పిస్తున్నాయి. టార్గెట్ రజనీ: ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ జయంతి, మహావీరుల దినోత్సవం గురువారం తిరునెండ్రయూరులోని ఓ కల్యాణ మండపంలో జరిగింది. ఇందులో సీమాన్ ప్రసంగిస్తూ రజనీ కాంత్‌ను టార్గెట్ చేసి విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో ప్రభాకరన్ మహా నేత అని, ఆయన్ను మహా నేతగా ప్రతి తమిళుడు అభివర్ణించాల్సిందేనన్నారు. ఆయనకు సరి తూగే నాయకుడెవ్వరు ఇక్కడ లేరని, అందరూ తమ ఉనికిని చాటుకునేందుకు రాజకీయాల్లోకి వస్తే, తమిళ జాతి కోసం తనువు చాలించేందు కు సిద్ధపడ్డ నేత ప్రభాకరన్ అని కొనియాడారు. తమిళుల కోసం తమ పార్టీ ఆవిర్భవించిందని, తాను సీఎంను అవుతానో లేదో తనకు అనవసరం అని, తనకు తమిళ జాతి మనుగడ, సంక్షేమం, సంస్కృతి పరిరక్షణ ముఖ్యం అన్నారు. రజనీ కాంత్‌ను రాజకీయాల్లోకి రావాలని అనేక మంది ఆహ్వానిస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. తన జీవిత కాలంలో తమిళుల కోసం ఆయన ఏమి చేశారని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు. ఆయన్ను ఆహ్వానిస్తున్న వాళ్లంతా భజన ప్రియులేనని, తమిళ జాతి విలువ తెలియనివాళ్లేనని మండిపడ్డారు. తమిళుల కోసం సర్వాన్ని ఆర్పించిన అనేక మంది మహానుభావులు ఈ గడ్డ మీద ఉన్నారని, అలాంటి వారిని ఎందుకు రాజకీయాల్లోకి ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు. తమిళుడే ఈ గడ్డను ఏలాలి అని, ఎవరిని బడితే వారిని ఆహ్వానిచ్చేయడం ఇకనైనా మానుకోండని హితవు పలికారు. ఒక వేళ రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తే, ఒంటరిగానైనా సరే, మద్దతుగానైనా సరే ఎన్నికల్లో నిలబడితే ఢీ కొట్టేందుకు తాను రెడీ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఆయన అడుగు బెడితే, తొలి ప్రత్యర్థిని తానేనని, తాను ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అని ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలు నామ్ తమిళర్ కట్చి వర్గాల్ని ఉత్సాహంలో నింపినా, రజనీ అభిమానుల్లో మాత్రం ఆగ్రహాన్ని రేపుతోంది. సీమాన్ ఎల్టీటీఈ అస్త్రంతో మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు సైతం ఈ వేదిక మీద చేయడాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో కటకటాల్లోకి వెళ్లొచ్చిన సీమాన్‌కు తాజా వ్యాఖ్యలు ఎలాంటి చిక్కుల్ని సృష్టించబోతున్నాయో..!