Seemanchal
-
పట్టాలు తప్పిన ‘సీమాంచల్’
సోన్పూర్(బిహార్): బిహార్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 29 మంది గాయాలపాలయ్యారు. బిహార్‌లోని జోగ్బనీ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్‌కు చేరాల్సిన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం వేకువజామున పట్టాలు తప్పడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. ‘నంబర్ 12487 జోగ్బనీ–ఆనంద్ విహార్ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ కిషన్‌గంజ్ జిల్లా జోగ్బనీ నుంచి వస్తుండగా తెల్లవారు జామున 4 గంటల సమయంలో రైలు పట్టాల్లో పగుళ్ల కారణంగా సహదాయ్ బుజుర్గ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక జనరల్ బోగీ, ఒక ఏసీ కోచ్, మూడు స్లీపర్ కోచ్‌లతోపాటు మరో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి’ అని రైల్వే శాఖ పేర్కొంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 29 మంది క్షతగాత్రులయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని ముజఫర్‌పూర్, పట్నాలోని ఆస్పత్రులకు తరలించాం. మిగతా వారికి వైశాలి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం’ అని రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. పట్టాలు తప్పని బోగీలకు మరికొన్నిటిని జత చేసి ఉదయం 10 గంటల సమయంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఈస్ట్ జోన్ రైల్వే సేఫ్టీ కమిషనర్ లతీఫ్ ఖాన్‌ను రైల్వే శాఖ ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు చొప్పున రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. -
బీహార్: పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్
-
మతశక్తులతో మీరు ఒంటరిగా పోరాడలేరు!
- లాలూకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సూచన - ‘సీమాంచల్’ ఇస్తే కలిసి పోరాడతామని ప్రకటన హైదరాబాద్: మతశక్తులను దెబ్బతీయాలంటే ఉమ్మడి పోరాటాలు అవసరమని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బీజేపీ అంతుచూసేదాకా నిద్రపోనన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఒంటరిగా ఆ పని చేయలేరని, సీమాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తే ఎంఐఎం కూడా లాలూతో కలిసి పోరాడుతుందని చెప్పారు. బుధవారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘లాలూజీ, మతశక్తులతో మీరు ఒంటరిగా పోరాడలేరు. నిజంగా వాళ్లను అడ్డుకోవాలనుకుంటే ఆ పనిని మరింత బలంగా చేయాలి’అని అసద్.. లాలూకు సూచించారు. సీమాంచల్ రాష్ట్ర ఏర్పాటుకు గనుక లాలూ యాదవ్ సహకరిస్తే.. ఆర్జేడీతో కలిసి పనిచేసేందుకు ఐంఐఎం సిద్ధంగా ఉంటుందని అసద్ అన్నారు. బిహార్ నుంచి సీమాంచల్‌ను వేరుచేస్తే అక్కడి ముస్లింల జీవితాల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో.. సీమాంచల్ ప్రాంతం నుంచి ఎంఐఎం పెద్ద సంఖ్యలో అభ్యర్థులను పోటీకి దింపింది. నాటి ఎన్నికల్లో విజయం సాధించిన మహాఘట్బంధన్(ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ కూటమి) ఇటీవలే కూలిపోయిన దరిమిలా.. అందుకు కారణమైన బీజేపీపై పోరాటాన్ని ఉధృతం చేస్తానని లాలూ యాదవ్ శపథం చేసిన సంగతి తెలిసిందే. అసదుద్దీన్ ప్రకటనపై లాలూ యాదవ్ స్పందించాల్సిఉంది.