seethampeta agency
-
పర్యాటకులను రారమ్మని పిలుస్తోంది..
వేకువ గాలులు నొసటన ముద్దాడుతూ ఉంటే ఈ కొండల్లో విహరించాలి. సూరీడి కిరణాలు నడినెత్తిపై వచ్చే వేళకు ఆ జలపాతం మన శిరసుపై నుంచి పాదాలపైకి దూకాలి. కడుపు లోపల చల్ల కదలకుండా సున్నపుగెడ్డ మధ్యన నడుం వాల్చాలి.వెలుతురు వెళ్లి చీకటి ఇంకా రాని ఆ కొన్ని ఘడియల పాటు చెమట్లు వచ్చేలా సాహస క్రీడల్లో మునిగి తేలాలి. కార్తీక వన విహారానికి ఇంతకు మించిన సాఫల్యత ఏముంటుంది..? ఇవన్నీ నిజం కావాలంటే మంచి సెలవు రోజు చూసుకుని శ్రీకాకుళం జిల్లా సీతంపేటకి చలో అనేయడమే. సీతంపేట: శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీ ప్రాంతం పర్యాటకులను రారమ్మని పిలుస్తోంది. కార్తీకంలో వన విహారానికి తన బెస్ట్ టూరిజం ప్రదేశాలను చూపిస్తూ ఆకర్షిస్తోంది. ఓ వైపు జలపాతాలు, మరోవైపు పార్కు, ఇంకో వైపు అడవుల అందాలతో మన్యం అద్భుతంగా కనిపిస్తోంది. ఏటా ఎన్టీఆర్ అడ్వంచర్ పార్కు, జగతపల్లి, ఆడలి వ్యూపాయింట్లను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి జనాలు వస్తారు. మెట్టుగూడ, సున్నపుగెడ్డ జలపాతాలకు అత్యధిక సంఖ్యలో సందర్శకులు వచ్చి పిక్నిక్లు జరుపుకుంటారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలతో పాటు ఇటు ఒడిశా నుంచి కూడా పర్యాటకులు క్యూ కడుతుంటారు. సాహస క్రీడా వినోదం... సీతంపేట అడ్వంచర్ పార్కు స్థానికంగా దోనుబాయి రహదారి మలుపుకు సమీపంలో ఉంది. ఇక్కడ జలవిహార్‌లో బోటుషికారు ఏర్పాటు చేశారు. సైక్లింగ్, జెయింట్‌వీల్, ఆల్టర్న్ వెహికల్, షూటింగ్, బంజీట్రంపోలిన్, ఫైవ్‌డీ థియేటర్ వంటివి ఉన్నాయి. మెట్టుగూడ.. ఇక్కడ.. మెట్టుగూడ జలపాతం మంచి ప్రాచుర్యం పొందింది. మామూలు రోజుల్లో కూడా ఇక్కడకు వచ్చే సందర్శకుల సంఖ్య అధికంగా ఉంది. సీతంపేట నుంచి కొత్తూరుకు వెళ్లే రహదారిలో మెట్టుగూడ జలపాతం ఉంది. కొత్తూరు నుంచి వస్తే 10 కిలోమీటర్లు, పాలకొండ నుంచి వస్తే 17 కిలోమీటర్ల దూరంలో రహదారి పక్కనే మెట్టుగూడ వస్తుంది. అక్కడ వాహనాలు దిగి కొద్ది దూరం నడిచి వెళ్తే జలపాతాన్ని చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు పాలకొండ–కొత్తూరు నుంచి అనునిత్యం తిరుగుతుంటాయి. పర్యాటకులకు సంబంధించి అన్ని సౌకర్యాలున్నాయి. సున్నపుగెడ్డకు ఇలా.. మరో జలపాతం సున్నపు గెడ్డకు మంచి ప్రాధాన్యం ఉంది. ఇక్కడ వాతావరణం చూపరుల్ని కట్టిపడేస్తుంది. దోనుబాయి గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో సున్నపుగెడ్డ ఉంది. పొల్ల–దోనుబాయి మార్గంలో మేకవ గ్రామానికి సమీపంలో రోడ్డుదిగువ గుండా నడుచుకుంటూ వెళితే సున్నపుగెడ్డ జలపాతానికి చేరుకోవచ్చు. బస్సులు పరిమితంగా ఉంటాయి. సీతంపేట వచ్చి ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. సదుపాయాలు అంతంత మాత్రమే. తిను బండారాలు ఇతర ఆహార సామగ్రి పర్యాటకులు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వ్యూపాయింట్లకు ఇలా.. పొల్ల: సున్నపుగెడ్డకు సమీపంలో పొల్ల వ్యూ పాయింట్ ఉంది. ఆడలి: ఏజెన్సీలోని ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లాలంటే కుశిమి జంక్షన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రత్యేక వాహనాల్లో వెళ్లాలి. జగతపల్లి: సీతంపేట నుంచి7 కిలోమీటర్ల దూరంలో జగతపల్లి ఉంది. వీటిని వీక్షించడానికి ప్రత్యేక టూరిజం వెహికల్‌ను ఏర్పాటు చేశారు. -
ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన నేడు
శ్రీకాకుళం , సీతంపేట: ప్రపంచబ్యాంకు బృందం సీతంపేటలో ఏజెన్సీలో సోమవారం పర్యటించనునందని ఐటీడీఏ పీవో లోతేటి శివశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు బృందాలుగా విడిపోయి మండలంలోని వెంకటిగూడ, చిన్నబగ్గ, చొర్లంగి గ్రామాలను సందర్శించి అక్కడ మహిళా సంఘాలతో సమావేశమవుతాయని పేర్కొన్నారు. దీంతోపాటు స్థానిక వెలుగు ఎంఎంఎస్‌లో ఓబీ సభ్యులతో సమావేశం ఉంటుందని తెలిపారు. -
కొండ కోనల్లో..
శ్రీకాకుళం , సీతంపేట: సీతంపేట ఏజెన్సీ ప్రకృతి అందాలకు మారుపే రు. ఇక్కడి కొండకోనల్లో హŸయలొలికించే ఎన్నో జలపాతాలు ఉన్నా దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు చేపట్టిన లోతేటి శివశంకర్ కొద్ది నెలలుగా తనదైన శైలిలో టూరి జాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే మెట్టుగూడ జలపాతాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దారు. పర్యాటకుల కోసం పగోడాలు, ఉండడానికి వీలుగా ఒక భవనం, ఇ తర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే సందర్శకుల తాకిడి సైతం ప్రారంభమైంది. అలాగే చంద్రమ్మ గుడిని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇ క్కడ రైలింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎప్పటి నుం చో అభివృద్ధికి నోచుకోని సున్నపుగెడ్డ వద్ద కాటేజీలు ఏ ర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. రవికెల బంద చెరువు వద్ద ఎన్టీఆర్ జలవిహార్ కేంద్రం ఏర్పాటు చేసి, చిన్నారులతో హాయిగా కొద్ది సేపు పర్యాటకులు గ డిపేలా రూపుదిద్దుతున్నారు. పొల్ల, జగతి పల్లి కొండల ను వీక్షించేలా వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పారామోటరింగ్‌ను ఈనెల 27 టూరిజం డే రోజున ప్రారంభించనున్నారు. యువతకు ఉపాధి ఏజెన్సీలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. పర్యాటకం అభివృద్ధి చెందితే గిరిజన యువతకు ఉపాధి లభిస్తుంది. నవంబర్‌లో సీతంపేట ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చేవారు కనీసం పది బస్సులతో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – లోతేటి శివశంకర్, ఐటీడీఏ పీఓ -
ఏజెన్సీలో ప్రబలుతున్న జ్వరాలు.. ముగ్గురు మృతి
సీతంపేట: శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలో జ్వరాలు ప్రబలుతున్నాయి. ఎగువ సీదిగూడ గ్రామంలో 15 రోజుల వ్యవధిలో ముగ్గురు గిరిజనులు మృతి చెందడంతో స్థానికులు భయూందోళన చెందుతున్నారు. బుధవారం సవర సూర్యకుమార్(40) అనే వ్యక్తి మృతి చెందగా, సవర ఎర్రమ్మ, సవర వెంకటరావు అనే గిరిజనులు పదిహేను రోజుల కిందట మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. సూర్యకుమార్ ను పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతను మృతి చెందాడని స్థానికులు ఆరోపించారు. ప్రస్తుతం అదే గ్రామంలో పది మంది వరకు జ్వరాలతో మంచం పట్టారు. వీరిలో సవర రమేష్ పరిస్థితి విషమంగా ఉంది. డిప్యూటీ డీఎంహెచ్‌వో నాయక్, తహశీల్దార్ ఎం.సావిత్రిలు సీతంపేటను పర్యవేక్షించారు. -
గ్రామంపై విరుచుకుపడ్డ ఏనుగులు: రైతు మృతి
శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని బుధవారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పాడలి గ్రామంపై ఏనుగులు ఒక్కసారిగా ముకుమ్మడిగా దాడి చేశాయి. ఆ దాడిలో మురళి అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల దాడితో గ్రామస్తులు ఇళ్లు వదిలి భయంతో పరుగులు తీశారు. దాంతో ఏనుగులు గ్రామమంతా కలియ దిరుగుతూ హల్చల్ సృష్టించాయి. పాడలి పరిసర ప్రాంతాలలోని పంటపోలాలన్ని పూర్తిగా నాశనమైనాయి. గ్రామస్తులు గ్రామంలోకి వచ్చేందుకు తీవ్రంగా భయపడుతున్నారు. ఏనుగులు గ్రామంలోకి దూసుకువచ్చి దాడి చేయడంతో గ్రామస్తులు సమీపంలోని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.