సున్నపుగెడ్డ జలపాతాన్ని వీక్షిస్తున్న పీఓ, ఎమ్మెల్యే కళావతి తదితరులు
శ్రీకాకుళం , సీతంపేట:
సీతంపేట ఏజెన్సీ ప్రకృతి అందాలకు మారుపే రు. ఇక్కడి కొండకోనల్లో హŸయలొలికించే ఎన్నో జలపాతాలు ఉన్నా దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు చేపట్టిన లోతేటి శివశంకర్ కొద్ది నెలలుగా తనదైన శైలిలో టూరి జాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే మెట్టుగూడ జలపాతాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దారు. పర్యాటకుల కోసం పగోడాలు, ఉండడానికి వీలుగా ఒక భవనం, ఇ తర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే సందర్శకుల తాకిడి సైతం ప్రారంభమైంది. అలాగే చంద్రమ్మ గుడిని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇ క్కడ రైలింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఎప్పటి నుం చో అభివృద్ధికి నోచుకోని సున్నపుగెడ్డ వద్ద కాటేజీలు ఏ ర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. రవికెల బంద చెరువు వద్ద ఎన్టీఆర్ జలవిహార్ కేంద్రం ఏర్పాటు చేసి, చిన్నారులతో హాయిగా కొద్ది సేపు పర్యాటకులు గ డిపేలా రూపుదిద్దుతున్నారు. పొల్ల, జగతి పల్లి కొండల ను వీక్షించేలా వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పారామోటరింగ్‌ను ఈనెల 27 టూరిజం డే రోజున ప్రారంభించనున్నారు.
యువతకు ఉపాధి
ఏజెన్సీలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. పర్యాటకం అభివృద్ధి చెందితే గిరిజన యువతకు ఉపాధి లభిస్తుంది. నవంబర్‌లో సీతంపేట ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చేవారు కనీసం పది బస్సులతో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – లోతేటి శివశంకర్, ఐటీడీఏ పీఓ