ఏజెన్సీలో ప్రబలుతున్న జ్వరాలు.. ముగ్గురు మృతి | viral fever spreading in seethampeta agency | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో ప్రబలుతున్న జ్వరాలు.. ముగ్గురు మృతి

Published Wed, Feb 11 2015 8:24 PM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

viral fever spreading in seethampeta agency

సీతంపేట: శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలో జ్వరాలు ప్రబలుతున్నాయి. ఎగువ సీదిగూడ గ్రామంలో 15 రోజుల వ్యవధిలో ముగ్గురు గిరిజనులు మృతి చెందడంతో స్థానికులు భయూందోళన చెందుతున్నారు. బుధవారం సవర సూర్యకుమార్(40) అనే వ్యక్తి మృతి చెందగా, సవర ఎర్రమ్మ, సవర వెంకటరావు అనే గిరిజనులు పదిహేను రోజుల కిందట మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. 

సూర్యకుమార్ ను పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతను మృతి చెందాడని స్థానికులు ఆరోపించారు. ప్రస్తుతం అదే గ్రామంలో పది మంది వరకు జ్వరాలతో మంచం పట్టారు. వీరిలో సవర రమేష్ పరిస్థితి విషమంగా ఉంది. డిప్యూటీ డీఎంహెచ్‌వో నాయక్, తహశీల్దార్ ఎం.సావిత్రిలు సీతంపేటను పర్యవేక్షించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement