self benifit
-
జీవితమే పాఠం.. ఎవరేమన్నా లైట్ తీస్కో! నువ్వేంటో నీకే తెలుసు
-
స్వప్రయోజనాలే పరమావధి
జైపూర్: కాంగ్రెస్ పార్టీకి దేశం కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. కేవలం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం వీలైనన్ని అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేసిందన్నారు. ఆయన బుధవారం రాజస్తాన్‌లోని అబూ రోడ్లో ర్యాలీలో మాట్లాడారు. ‘‘సుడాన్ అంతర్యుద్ధంలో చిక్కిన కర్ణాటక హక్కీపిక్కీ గిరిజనుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేందుకు కూడా కాంగ్రెస్ వెనకాడలేదు. వారి ప్రాణాలు అక్కడ ప్రమాదంలో ఉన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే బయట పెట్టింది. తద్వారా ఒకరిద్దరైనా చనిపోకపోతారా అని చూసింది. అదే జరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యంగా చూపి కర్ణాటకలో ఓట్లు దండుకోవాలని పన్నాగం పన్నింది’’ అన్నారు. ఉగ్రవాదం పట్ల మెతక వైఖరి సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా ఉగ్రవాదుల పట్ల మెతక వైఖరి అవలంబించడం కాంగ్రెస్ నైజమని మోదీ మండిపడ్డారు. జైపూర్ బాంబు పేలుళ్ల కేసులో ఉద్దేశపూర్వకంగానే కోర్టులో సరిగా వాదనలు విన్పించకుండా నిందితులంతా విడుదలయ్యేందుకు రాజస్తాన్ సర్కారు సహకరించిందన్నారు. ‘‘ఐదేళ్లుగా రాష్ట్ర కాంగ్రెస్‌లో సిగ్గుచేటైన రాజకీయ పోరాటం సాగుతోంది. సీఎంతో సహా నేతలంతా కుర్చీ కోసం కొట్టుకోవడంలో మునిగిపోయారు. ప్రజలను, పాలనను గాలికొదిలేశారు’’ అంటూ ధ్వజమెత్తారు. ‘‘సీఎం అశోక్ గహ్లోత్‌కు సొంత ఎమ్మెల్యేలపైనే విశ్వాసం లేదు. వారికీ ఆయన మీద నమ్మకం లేదు’’ అంటూ చెణుకులు విసిరారు. 2020లో అసమ్మతి కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తిరుగుబావుటా ఎగరేసినప్పుడు వసుంధర రాజె సింధియా వంటి రాష్ట్ర బీజేపీ అగ్ర నేతల మద్దతుతోనే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగానని గహ్లోత్ ఆదివారం చెప్పడం తెలిసిందే. అంతకుముందు నాథ్ద్వారాలో రూ.5,500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం గహ్లోత్‌తో కలిసి మోదీ శంకుస్థాపన చేశారు. దేశానికి ఏ మంచి జరిగినా కాంగ్రెస్, విపక్షాలు భరించలేవంటూ ఈ సందర్భంగా దుయ్యబట్టారు. ప్రతిదాన్నీ ఓట్ల కోణం నుంచే చూసేవాళ్లు దేశం కోసం ఏమీ చేయలేరన్నారు. అందువల్లే రాజస్తాన్ వంటి రాష్ట్రాలు మౌలిక ప్రాజెక్టులకు నోచుకోక వెనకబడ్డాయన్నారు. రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్టులను గహ్లోత్ ఈ సందర్భంగా మోదీ దృష్టికి తీసుకెళ్లడం విశేషం. జూన్‌లో అమెరికాకు మోదీ న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జూన్‌లో అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు పర్యటిస్తున్నట్టు విదేశాంగ శాఖ తెలిపింది. జూన్ 22న మోదీకి బైడెన్ విందు ఇస్తారు. ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి మోదీ పర్యటన ఉపయోగపడుతుందని వైట్‌హౌస్ పేర్కొంది. -
స్వలాభం కోసమే హోదా తాకట్టు
– గడప గడపకూ వైఎస్సార్‌లో ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి రామసముద్రం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన స్వలాభం కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం రామసముద్రం మండలం పెద్దకుప్పల్లె పంచాయతీలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలు, తప్పుడు హామీలపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని అన్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చి హోదాతో ఒరిగేదేమీ లేదని చెప్పడం దారుణమన్నారు. రాయలసీమ ప్రజలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నా సీఎం పట్టించుకోకుండా సింగపూర్. లండన్ అంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులైనా రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. గ్రామాల్లోకి వెళితే ప్రజలు పెన్షన్లు, ఇళ్లు, నష్టపరిహారం, రుణమాఫీ తదితరాలపై నిలదీస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పాపానపోలేదన్నారు. అనంతరం తిరుమలరెడ్డిపల్లెలో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీ జరీనాహైదర్బేగం, జెడ్పీటీసీ సీహెచ్.రామచంద్రారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు కేశవరెడ్డి, ఉపాధ్యక్షుడు రెడ్డెప్ప, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ సర్పంచు బాస్కర్గౌడు, ఎంపీటీసీలు రెడ్డెప్పనాయుడు, శంకర, ఆనంద, వైఎస్సార్సీపీ మండల మహిళా అధ్యక్షురాలు శాంతమ్మ, నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షుడు తిమ్మయ్య, కో–ఆప్షన్ సభ్యులు మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.