Sena
-
నేతాజీకి అండగా నిలిచిన మహిళా సేనాని ఎవరు? ఆమె సేవలకు గుర్తుగా రైల్వే ఏం చేసింది?
ఒక వీధికి లేదా రహదారికి లేదా ఏదైనా ప్రదేశానికి ప్రముఖుల పేర్లు పెట్టడాన్ని మనం చూసేవుంటాం. ఇటువంటి గౌరవం అధికంగా మహనీయులైన పురుషులకే దక్కింది. భారతదేశంలోని దాదాపు ప్రతి ప్రాంతంలో మహాత్మా గాంధీ పేరు మీద ఏదో ఒక రహదారి తప్పకుండా ఉంటుంది. ఈ విషయంలో మహనీయులైన మహిళామణులకు అటువంటి గౌరవం దక్కడం తక్కువేనని చెప్పవచ్చు. తూర్పు రైల్వే కూడా చాలా కాలం పాటు ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అయితే, 1958లో ఈ విధానంలో మార్పును తీసుకువచ్చింది. భారతీయ రైల్వేలు దేశానికి చెందిన ఒక మహనీయురాలికి ఘన నివాళులర్పించాలని నిర్ణయించాయి. ఆ మహనీయురాలి పేరు మీద పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఒక స్టేషన్‌కు ‘బేలా నగర్ రైల్వే స్టేషన్’ అనే పేరు పెట్టారు. భారత చరిత్రలో ఇలాంటి గౌరవం పొందిన తొలి మహిళగా బేలా మిత్ర నిలిచారు. పశ్చిమ బెంగాల్‌లోని కొడలియాలోని సంపన్న కుటుంబంలో 1920లో జన్మించిన బేలా మిత్రను అమిత లేదా బేలా బోస్ అని కూడా పిలుస్తారు. ఆమె తండ్రి సురేంద్ర చంద్రబోస్. ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నయ్య. అంటే బేలా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ‘నేతాజీ’కి మేనకోడలు. 1941లో స్వాతంత్ర్య సంగ్రామ పోరాటం జరుగుతున్న సమయంలో నేతాజీని గృహనిర్బంధంలో ఉంచినప్పుడు, అక్కడి నుంచి ఆయన తప్పించుకునేందుకు బేలా ప్రధాన పాత్ర పోషించారు. చాలా చిన్న వయస్సులోనే బేలా స్వాతంత్ర్య పోరాటానికి అంకితమయ్యారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) ఏర్పడినప్పుడు ఆమె ‘ఝాన్సీ రాణి’ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించారు. ఆమె భర్త హరిదాస్ మిశ్రా కూడా ఆమె మాదిరిగానే విప్లవకారుడు. ఐఎన్ఏ ప్రత్యేక కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు బేలాను అధికారులు కలకత్తాకు పంపారు. అక్కడ ఉంటూనే ఆమె స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, బేలా భర్త జైలు నుండి విడుదలయ్యారు. అతనితో పాటు అనేక మంది విప్లవకారులు విడుదలయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. అదే సమయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని బేలా నిర్ణయించుకున్నారు. విభజన వల్ల జరిగిన హింసాకాండలో నష్టపోయిన వారికి సహాయం చేయాలని బేలా నిర్ణయించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని శరణార్థులకు సహాయం చేయడానికి ఆమె 1947లో ‘ఝాన్సీ రాణి రిలీఫ్ టీమ్’ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి, బాధితులకు సేవలు అందించారు. 1952, జూలైలో ఆమె తన చివరి శ్వాస వరకు బాధితులకు సేవ చేస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రోద్యమంలో విశేష సేవలు అందించినప్పటికీ బేలా పేరు చరిత్ర పుటలలో అంతగా కనిపించకపోవడం శోచనీయం. ఇది కూడా చదవండి: ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు? అమెరికా అసలు ప్లాన్ ఏమిటి? -
కాంగ్రెస్ దేశం కోసం చాలా చేసింది:శివసేన
ముంబై: బీజేపీ, దాని సోదర సంస్థ , కీలక భాగస్వామి శివసేన మధ్య విభేదాలు తారాస్తాయికి చేరినట్టే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు తరువాత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వరసపెట్టి విమర్శలు గుప్పిస్తున్న శివసేన మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకుపడింది. ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ను ఉద్దేశించి మోదీ చేసిన రెయిన్ కోట్ వ్యాఖ్యల్ని ఖండించారు. అలాగే స్వాతంత్ర్యం తరువాత కేంద్రంలో వరుస కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన అభివృద్ధి పనులపై ప్రశంసలు గుప్పించడం విశేషం. అంతేకాదు మోదీ తన పాలనలో దేశాన్ని మరింత వెనక్కి తీసుకెళుతున్నారని మండిపడింది. డీమానిటైజేషన్ అనంతర గందరగో ళాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరంటూ మోదీపై ఆరోపణలు గుప్పించారు. అవినీతితో అంటకాగడం కూడా అవినీతి కిందికే వస్తుందంటూ శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. 1971 యుద్ధంలో అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్తాన్ కు గట్టి బుద్ది చెప్పారని, అందుకే అటల్ బిహారీ వాజ్‌పేయి ఇందిరను దుర్గ అని ప్రశంసించారని రాసింది. జాతి వ్యతిరేకులపై కపటత్వాన్నిఆమె ఎపుడూ ప్రదర్శించలేదనీ, డీమానిటైజేషన్ తో పేదలకు కష్టాలు తెచ్చిపెట్టలేదని పేర్కొంది. బ్యాంకుల జాతీయంతో దేశ ఆర్థికవృద్ధికి తోడ్పడ్డారంది. అలాగే ఖలిస్తాన్ టెర్రరిస్టుల ఘాతుకానికి నేలకొరిగి.. దేశం ఉగ్రవాదులకు లొంగదనే గట్టి సంకేతాన్ని అందించారని ప్రశంసించింది. దేశకోసం ప్రాణాలను సైతం త్యాగం చేశారంటూ ఇందిరను సామ్నా కొనియాడింది. అంతేకాదు కాంగ్రెస్ ప్రధానులు, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావుపై కూడా ప్రశంసలు కురిపించింది. బోఫోర్స్ ఆరోపణలు ఉన్నప్పటికీ దేశానికి కంప్యూటర్లను అందించిన, టెక్నాలజీ వృద్ధికి పునాదులు వేసిన ఘనత రాజీవ్ కే దక్కుతుందన్నారు. అలాగే ఆర్థిక సంక్షోభంనుంచి మన్మోహన్, పీవీ దేశాన్ని రక్షించారని తెలిపింది. అయితే ఈ 60 సంవత్సరాల అభివృద్ధిని మోదీ నాశనం చేస్తున్నారని దుయ్యబట్టింది. దేశాన్ని సోమాలియా, లేదా బురుండి స్థాయికి దిగజారుస్తున్నారని మండిపడింది. స్వాత్రంత్యానికి సూదిని కూడా తయారు చేసుకోలేని దేశం, గణనీయమైన పారిశ్రామిక వృద్దిని సాధించిందని రాసింది. -
పాకిస్తాన్ శాశ్వత శవాసనానికి అర్హురాలు!
యోగా కార్యక్రమంతో ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తేవడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం అని బీజేపీ మిత్రపక్షం శివసేన ప్రశంసలు కురిపించింది. అయితే శరీరంలోని రుగ్మతలను తొలగించే యోగా.. ప్రజలు బాధపడుతున్న అధిక ద్రవ్యోల్బణం, అవినీతి నొప్పులు తగ్గించడానికి పనికిరాదని, యోగాలోని శవాసనానికి పాకిస్తాన్ శాశ్వత అర్హురాలంటూ శివసేన తన పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శించింది. ప్రపంచానికే సెంటర్ స్టేజ్ గా యోగాను తీసుకురావడంతోపాటు, 130 దేశాల్లో యోగా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషి మెచ్చుకోదగ్గ విషయం అని శివసేన ప్రశంసించింది. యోగా ద్వారా 130 దేశాలు నడుం వంచాయని, మోడీ కృషితో అన్ని దేశాలనూ నేలపై పడుకొనేట్లు చేయగలిగారని, అయితే ప్రస్తుతం పాకిస్తాన్ అటువంటి యోగాసనానికి శాశ్వత అర్హురాలంటూ శివసేన చురక వేసింది. అలా జరగాలంటే కేవలం ఆయుధాలతోనే సాధ్యమౌతుందంటూ విమర్శలు చేసింది. శవంలా నేలపై పడుకొనే యోగాసనమైన 'శవాసనం' యోగాలో ప్రముఖమైనది. ఆ ఆసనంలాగానే పాకిస్తాన్ ను చేయాలని శివసేన తన పార్టీ పత్రిక 'సామ్నా' ఎడిటోరియల్ లో పేర్కొంది. బీజేపీయేతర ప్రభుత్వాలున్న కొన్ని రాష్ట్రాలు మోదీ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నాయని, అయితే యోగా కూడ సైన్సేనని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రధాని ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా మతపరమైన, ధార్మిక కార్యక్రమం కాదని, ఇండియాలోనే కాక ఇతర దేశాల్లోనూ లక్షలమంది వివిధ ఆసనాల్లో రెండవ ప్రపంచ యోగాదినాన్ని ఘనంగా జరుపుకున్నారని శివసేన తెలిపింది. అయితే భారత్ లో అవినీతి రూపు మాపేందుకు తాము చేపడుతున్న చర్యలపై దోహాలో ప్రధాని మోదీ వివరించిన తీరును తమ పార్టీ పత్రిక సామ్నాలో విమర్శించిన శివసేన, విదేశీ గడ్డపై భారత్ పటిష్టను మంటగలపొద్దని సూచించింది. -
యోగాతో ద్రవ్యోల్భణం,అవినీతి తగ్గుతుందా?
ముంబై: బీజేపీ మిత్రపక్షం శివసేన ప్రధాన మంత్రిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసింది. యోగా చేయడం వలన ద్రవ్యోల్భణం, అవినీతి తగ్గుతుందా అని మోదీని అధికారిక పత్రిక సామ్నాలో ప్రశ్నించింది. యోగా ద్వారా వ్యక్తిగత జీవితంలోని అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చునని దేశ సమస్యలు పరిష్కరించలేమని ప్రధానికి సూచించింది. ఈ విషయంలో స్పష్టత ఉంటే బాగుంటుందని తెలిపింది. ప్రపంచ దేశాలతో మోదీ యోగా చేయించారని ఇది అభినందించదగిన విషయమేనని, కానీ పాకిస్థాన్ కు శాశ్వత శవాసనం( యోగాలో విశ్రాంతి స్థితి) వేయించాలని అది ఆయుధాలతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. నల్లధనం వెనక్కి తీసుకువచ్చే విషయంలో మోదీ తీరును శివసేన విమర్శిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా సేన,బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. -
100మంది రాహుల్గాంధీలొచ్చినా..
ముంబై : ఎన్డీయే ప్రభుత్వాన్ని సూటు బూటు సర్కారు అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అవహేళన చేయడంపై శివసేన మండిపడింది. తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో రాహుల్‌తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించింది. 56 రోజుల సుదీర్ఘ సెలవు తర్వాత రంగంలోకి వచ్చిన రాహుల్ కార్యకర్తల్లో విశ్వాసాన్ని నింపేందుకు ఉత్సాహంగా ఉన్నారనీ అయితే మోదీ హవా ముందు ఈ ఉత్సాహం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేమంటూ ఎద్దేవా చేసింది. ప్రధానమంత్రి మోదీకి రాహుల్ ఏ మాత్రం సాటిరాడని పేర్కొంది. 100 మంది రాహుల్ గాంధీలొచ్చినా.... మోదీ హవా ముందు కొట్టుకుపోతారని వ్యాఖ్యానించింది. కోల్గేట్, స్పెక్ట్రమ్ కుంభకోణాలతో నగదు సూట్ కేసులను మార్చుకున్నచరిత్ర కాంగ్రెస్ పార్టీదంటూ చురకలు వేసింది. ప్రపంచ వ్యాప్తంగా మోదీ విశ్వాసాన్ని నింపారని సామ్నా పేర్కొంది. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న ప్రధాని పట్ల.. దేశంలోని వ్యాపారం రంగం నమ్మకంగానూ, గర్వంగాను ఉందని కొనియాడింది. కాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ విమర్శలపై స్పందించిన ప్రధాని మోదీ సూట్‌కేసుల సర్కారు కన్నా సూటు బూటు సర్కారు ఎంతో మేలని, కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిని ఎత్తిచూపుతూ ప్రధాని గట్టిగా చురక వేసిన సంగతి తెలిసిందే.