'బీజేపీ నాయకుల చెల్లెళ్లు, కూతుళ్లను తిరిగి రప్పించండి'
ఫైజాబాద్(యూపీ): బీజేపీ నాయకుల "ఘర్ వాపసీ'' ప్రచార కార్యక్రమంపై సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు శివపాల్ సింగ్ యాదవ్ ఘాటుగా స్పందించారు. మతం మార్చుకొని పెళ్లాడిన తమ చెల్లెల్లు, కూతుళ్లను బీజేపీ నాయకులు తిరిగి హిందూ మతంలోకి రప్పిస్తేనే వారు చేపట్టిన కార్యక్రమానికి అర్ధం ఉంటుందన్నారు.
సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే తేజ్ నరైన్ తమ్ముని వివాహానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బీజేపీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన భారీ అభివృద్ధి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యిందని.. ఇప్పుడు ఆ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఘర్ వాపసీ కార్యక్రమం అని ఆయన ఎద్దేవా చేశారు.