ట్రంప్ ప్రెస్ మీట్: జోష్‌లో మార్కెట్లు
ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ నేపథ్యంలో ఆసియన్ షేర్లు రెండు నెలల గరిష్టంలోకి ఎగబాకడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లూ మస్త్ జోష్‌తో ఎంట్రీ ఇచ్చాయి. నిఫ్టీ 8300 మార్కును అధిగమించేసింది. సెన్సెక్స్ 150 పాయింట్లు ఎగబాకింది. ప్రస్తుతం సెన్సెక్స్ 170.05 పాయింట్ల లాభంలో 27,069 వద్ద, నిఫ్టీ 55.50 పాయింట్ల లాభంలో 8,344గా వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ట్రంప్ నేడు తొలి మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు.
ఈ సమావేశంలో పన్ను విధానాలు, ఆర్థిక వ్యయం, అంతర్జాతీయ వాణిజ్యం, కరెన్సీల గురించి ఆయన పలు సంకేతాలు ఇవ్వనున్నారని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు. ఈ మేరకు మార్కెట్లు సైతం జోష్‌గా కదలాడుతున్నాయి. టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకులు సెన్సెక్స్‌లో లాభాలు పండిస్తున్నాయి. అయితే డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసల నష్టంతో 68.23వద్ద ప్రారంభమైంది. అటు బంగారం కూడా 99 రూపాయల లాభంలో 28,150గా ట్రేడ్ అవుతోంది.