చవితికి ముస్తాబవుతున్న గణనాథులు
ఉండి : వచ్చే నెల 5వ తేదీన జరగనున్న వినాయ చవితికి కళాకారులు విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఉండి గణపవరం రోడ్డులో రాంబాబు అనే కళాకారుడి ఆధ్వర్యంలో వీటిని జీవం ఉట్టిపడేలా తయారు చేస్తున్నారు. సిరామిక్ క్లే, మట్టితోను పరిపూర్ణంగా సిద్ధం చేసిన విగ్రహాలకు యంత్రాల ద్వారా అందమైన పెయింట్లు స్ప్రే చేసి ముస్తాబు చేస్తున్నారు. నత్తా రామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్‌లో రాజకీయ నాయకుల విగ్రహాలు తయారు చేసే తాను వినాయక చవితి, దసరా సందర్భంగా విగ్రహాలు తయారు చేస్తున్నట్టు రాంబాబు చెప్పారు.