ఐటీఐలకు బోర్డు ఏర్పాటు చేస్తాం: కేంద్రం
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తరహాలో పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)కు జాతీయ స్థాయిలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు తాము పంపిన ప్రతిపాదనలకు మానవవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ మీడియాకు వెల్లడించారు.
ఐటీఐల్లో ప్రాక్టికల్‌కు 70 శాతం, ఎంచుకున్న సబ్జెక్టుల్లో 30 శాతం మార్కులు ఉండేలా జాతీయస్థాయిలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడానికి చర్య లు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఏటా 23 లక్షల మంది విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు తరహాలో సర్టిఫికెట్లు జారీచేయడం వీలవుతుందన్నారు.