వరుస అత్యాచారాల ముఠా అరెస్ట్
వడోదర(గుజరాత్): వరుసగా అత్యాచారాలకు పాల్పడిన ఏడుగురు సభ్యల ముఠాలో ఆరుగురిని వడోదర రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతవారం షినోర్ తాలుకాలో 18 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో వీరిని పట్టుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితులు మరిన్ని విషయాలు బయటపెట్టారు. షినోర్, సమీప గ్రామాల్లో గత ఆరునెలల కాలంలో కనీసం 8 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టు వారు వెల్లడించారు. నిందితులందరూ రోజువారీ కూలీలని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ లో మరో నిందితుడిని అరెస్ట్ చేయాల్సివుందని చెప్పారు.