సెరికల్చర్ కోర్సు దరఖాస్తు గడువు పెంపు
హిందూపురం రూరల్ : కిరికెర పట్టుపరిశోధన కేంద్రం ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్టిఫికెట్ ఇన్ సెరికల్చర్ ఆరు నెలల కోర్సు ప్రవేశానికి ఈనెల 15 వరకు గడువు పొడిగించినట్లు పట్టుపరిశ్రమ కేంద్రం డైరెక్టర్ డా.గోయల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు కిరికెర పట్టుపరిశోధన కేంద్రంలో గోవిందరాజులు సెల్ : 9885219474, డా.శేషగిరి సెల్: 9441026695, డా.అజయ్ కుమార్ గోయల్ సెల్ : 95020003728లో సంప్రదించాలన్నారు.