servical cancer
-
'పూనమ్ పాండే' డ్రామా.. 19 ఏళ్ల వయసులోనే ఆ స్టేట్మెంట్తో వైరల్
బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే సర్వైకల్(గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్) మరణించిందనే షాకింగ్ న్యూస్ వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలతో పాటు ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇండస్ట్రీలో మహా నటిగా గుర్తింపు పొందకపోయినప్పటకి ఒక శృంగార తారగా గుర్తింపు పొందింది. ఒక వ్యాధితో ఆమె మరణించినట్లు వార్త రాగానే చాలామందిలో ఆందోళన నెలకొంది. నేడు తాను బతికే ఉన్నానని, ఇదంతా ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే కావడంతో ప్రజల్లో అవగాహన కోసం చేసినట్లు తెలిపి సింపుల్‌గా క్షమించమని కోరింది. ఈ విషయంపై నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేఖత వస్తుంది. క్యాన్సర్ గురించి అందరికీ అవగాహన కల్పించాలనే క్రమంలో ఆమె తనను తాను చంపుకున్నట్లు కొందరు తెలుపుతున్నా ఎక్కువ మంది ఆమె ఆలోచనా తీరును తప్పుబడుతున్నారు. క్యాన్సర్ నివారణ గురించి ప్రచారంలోకి తీసుకురావాలంటే ఎన్నో దారులు ఉన్నాయి కానీ ఇలా ప్రజల ఉద్వేగాలతో ఆటలాడటం ఏంటని తప్పుబడుతున్నారు. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలనే క్రమంలో పూనమ్ పాండే చేసిన పని ఎంతమాత్రం కరెక్ట్ కాదని దుమ్మెత్తిపోస్తున్నారు. చాలా రోజుల నుంచి ఆమె పేరు వెలుగులో లేకుండా పోయింది. చేతిలో సినిమా ఛాన్సులు లేవు. దీంతో ఎలాగైనా తను వైరల్ కావాలని క్యాన్సర్ పేరుతో చనిపోయినట్లు నాటకం ఆడిందని విమర్శలు వస్తున్నాయి. పూనమ్ పబ్లిసిటీ స్టంట్ కోసం తన మరణ వార్తను ఎంతగానో ఎంజాయ్ చేస్తోందని విమర్శలు వచ్చాయి. పూనమ్ చేసిన ఆ ఒక్క ప్రకటన దేశంలోని అందరినీ నమ్మించగలిగింది. ఆమె మరణించిందని వినగానే కంగనా రనౌత్, సింగర్ చిన్మయి వంటి ఎందరో స్టార్స్ దిగ్భ్రాంతి చెందారు. ఆపై చాలామంది బాలీవుడ్ నటీనటులు సంతాపాన్ని కూడా తెలియచేశారు. (ఇదీ చదవండి: బతికే ఉన్నానని ట్విస్ట్ ఇచ్చిన పూనమ్ పాండే.. ఇదంతా ఎందుకు చేసిందంటే?) ఆమె కేవలం సెన్సేషన్ కోసమే ఇలాంటి నాటకం ఆడిందని దీనిని ఘోరమైన నేరంగా పరిగణించాల్సి వుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఎంతో సున్నితమైన అంశం. ఇలాంటి విషయంలో పరాచికలాడటం ఏంటని తప్పుబడుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్‌తో నిజంగానే బాధపడుతున్న ఎందరో మహిళలు పూనమ్ మరణవార్త తెలియగానే ఎంతగానో మదనపడి ఉంటారు. ఇంతటి సున్నితమైన అంశాన్ని తన పబ్లిసిటీ కోసం ఉపయోగించడం ఏంటి..? అంటూ ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని వాదన వినిపిస్తోంది. డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కామెంట్ సర్వైకల్ క్యాన్సర్ సమస్యపై నువ్వు (పూనమ్) చేసిన పని అందరికీ రీచ్ అయి ఉంటుంది. కానీ మీరు అవలంబించిన ఇలాంటి పద్ధతి కొంత విమర్శలకు దారితీయవచ్చు, కానీ మీ ఉద్దేశాన్ని లేదా ఇలాంటి బూటకంతో మీరు ఏమి సాధించారు అని ఎవరూ ప్రశ్నించలేరు .. సర్వైకల్ క్యాన్సర్‌పై చర్చ ఇప్పుడు దేశం అంతటా ట్రెండింగ్‌లో ఉంది. మీ మాదిరే మీ ఆత్మ చాలా అందంగా ఉంది. మీరు చాలా సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను.' అని వర్మ తన ఎక్స్ పేజీలో రాసుకొచ్చారు. పబ్లిసిటీ కోసం 19 ఏళ్ల వయసులోనే ఇలాంటి పనితో .. 2011లో పూనమ్ పాండే క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే తాను టీమ్ ఇండియా కోసం గ్రౌండ్లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించి వార్తల్లో నిలిచింది. అది నిజం కావడంతో ఆమె తన మాట నిలబెట్టుకోవాలని చేసిన ప్రయత్నాన్ని బీసీసీఐ అడ్డుకుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు. ఆ తర్వాత సంవత్సరం తనకు ఎంతో ఇష్టమైన IPL జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటో పోస్టు చేసి సంచలనం రేపింది. అలా ఎప్పుడూ ఆమె నెట్టింట తన పేరు ఉండాలని తాపాత్రయ పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబే నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు కూడా కావాలనే చేసినట్లు వార్తలు వచ్చాయి. 2017లో పూనమ్ పాండే 'పాండే యాప్' ప్రారంభించింది. కానీ అందులోని కంటెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ గూగుల్ ఒక గంటలోపే ప్లే స్టోర్ నుంచి యాప్‌ను తొలగించేసింది. పూనమ్ పాండే తన ప్రేమికుడి సామ్ బాంబేతో కొద్దిరోజుల పాటు డేటింగ్ చేసి వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్లారు. అయితే పెళ్లైన 13 రోజులకే.. సామ్‌బాంబే తనని శారీరకంగా హింసిస్తున్నారని పనాజీ పోలీసులను ఆమె ఆశ్రయించి వైరల్ అయింది. ఆమె ఫిర్యాదు మేరకు సామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. -
సర్వైకల్ కేన్సర్.. మహిళలకు ఓ శాపం!
కేన్సర్ అంటేనే హడలిపోతాం. ఎందుకంటే ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా వచ్చేస్తుంది. దాని స్టేజ్‌ని బట్టి సులభంగా ఆ వ్యాధి నుంచి బయటపడగలం లేదంటే ఇక అంతే సంగతులు. ఆ కేన్సర్లలో మహిళలకు వచ్చే గర్భాశయ కేన్సర్(సెర్వికల్) మరింత ప్రమాదకరమైంది. బాలీవుడ్ ప్రముఖ నటీ పూనమ్ పాండ్ మృతికి కారణమైంది కూడా ఈ కేన్సరే. దీనికి చికిత్సా విధానం కూడా కాస్త క్రిటికలే. లక్షణాలను ముందుగా గుర్తిస్తే మెరుగైన చికిత్స ద్వారా పరిస్థితిని అదుపు చేయవచ్చు కానీ.. ఒక దశ దాటిన తరువాత చికిత్సలతో లాభం తక్కువే. అందువల్లే ఏటా కొన్ని వేలమంది మహిళలు ఈ కేన్సర్ బారిన పడే చనిపోతున్నారు. అసలు ఎందుకు వస్తుంది? ముందుగా ఎలా గుర్తించాలి? సెర్వికల్ కేన్సర్ ఎందుకు వస్తుందంటే.. ఈ కేన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) కారణంగా వస్తుంది. తక్కువ వయస్సులో వివాహం చేయడం, విచ్చలవిడి లైంగిక సంబంధాలు, స్త్రీ, పురుషులిద్దరికీ బహుళ లైంగిక భాగస్వాములుగా ఉండటం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ కేన్సర్ రావడానికి కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ప్రధానంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సుగల స్త్రీలకు ఈ రకమైన కేన్సర్ సోకే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు ఇవీ.. మొదటి దశ సర్వైకల్ కేన్సర్ ఎటువంటి లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరితే... కలయిక తర్వాత, పీరియడ్స్ మధ్య, మెనోపాజ్ తర్వాత యోని రక్తస్రావం దుర్వాసనతో కూడిన నీటి, రక్తపు యోని ద్రవాలు కలయిక సమయంలో పెల్విక్ నొప్పి సర్వైకల్ కేన్సర్‌లో రకాలు: పొలుసుల కణ కేన్సర్.. ఈ సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయం బయటి భాగాన్ని కప్పి ఉంచే సన్నని, చదునైన కణాలలో పొలుసుల కణాలు ప్రారంభమవుతాయి. ఇది యోనిలోకి ప్రవేశిస్తుంది. చాలా గర్భాశయ కేన్సర్లు పొలుసుల కణ క్యాన్సర్. అడెనోకార్సినోమా. . ఈ గర్భాశయ క్యాన్సర్ కాలమ్ ఆకారపు గ్రంధి కణాలలో ప్రారంభమవుతుంది. కారణాలు.. గర్భాశయ ముఖద్వారంలోని ఆరోగ్యకరమైన కణాలు వాటి డీఎన్ఏలో మార్పులు (మ్యుటేషన్లు) జరిగినప్పుడు గర్భాశయ కేన్సర్ ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన కణాలు నిర్ణీత రేటుతో పెరుగుతాయి. కొద్ది సమయంలో చనిపోతాయి. కేన్సర్ కణాలు దీనికి భిన్నం. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతూనే ఉంటాయి. పేరుకుపోయిన అసాధారణ కణాలు ఒక కణితిని ఏర్పరుస్తాయి. కేన్సర్ కణాలు సమీపంలోని కణజాలాలపై దాడి చేస్తాయి. శరీరంలోని ఇతర చోట్ల వ్యాప్తి చెందడానికి కణితి నుంచి విడిపోతాయి. గర్భాశయ కేన్సర్‌కు కారణమేంటో స్పష్టంగా తెలియదు, కానీ హెచ్‌పీవీ పాత్ర పోషిస్తుంది. హెచ్‌పీవీ చాలా సాధారణం. ఈ వైరస్ ఉన్న ప్రతి ఒక్కరికి కేన్సర్ రాదు. లైఫ్‌స్టైల్, ఇతర కారకాల కారణంగా వచ్చే అవకాశం ఉంది. చికిత్స.. నయం కాని గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు ల్యాప్రోస్కోపి పరికరం ద్వారా ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స చేయవచ్చు. దీనివల్ల కోత, కుట్టు ఉండదు. త్వరగా ఎవరి పనులు వారు చేసుకోవచ్చు. హెరి్నయా వచ్చే అవకాశం కూడా ఉండదు. సాధారణంగా వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్‌గా మారుతుంది. దీనివల్ల వివాహం అయిన మహిళలు ప్రతి సంవత్సరం పాప్‌స్మియర్ టెస్ట్ చేయించుకుంటే, క్యాన్సర్‌ను ప్రాథమికంగా గుర్తించగలిగితే నయం చేసుకోవచ్చు. దీనికితోడు కౌమారదశ బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయడం వల్ల వారికి 70 నుంచి 80శాతం వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా చేస్తే నివారణ సాధ్యం.. 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ క్యాన్సర్ నిర్మూలన కోసం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికను అందించింది. దీనికింద 2030 నాటికి 90 శాతం కౌమార బాలికలకు 15 సంవత్సరాల వయస్సులోపు హెచ్‌పీవీ వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి. 70శాతం మహిళలు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సుగల కలిగిన వారికి కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి. గర్భాశయ పూర్వ క్యాన్సర్‌తో బాధపడుతున్న 90 శాతం మహిళలకు తగిన చికిత్స అందించాలి. (చదవండి: ముక్కు లేకుండానే జన్మ..ఇప్పుడెలా ఉన్నాడంటే?) -
2030 నాటికి మహిళా క్యాన్సర్ రోగులు రెట్టింపు
క్యాన్సర్ బాధితులు, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, మహిళా రోగులు ప్రపంచంలోని వర్ధమాన దేశాల్లో బ్రెస్ట్‌క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ల వల్ల ఏటా 8 లక్షల మంది మరణిస్తున్నారని, 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని టొరాంటో, కేప్‌టైన్ యూనివర్సిటీలు, లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మమోగ్రఫీ, కీమోథెరపీ సౌకర్యాలు లేకపోవడం వల్ల పేద దేశాల్లో బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ల వల్ల ఎక్కువమంది మహిళలు మరణిస్తున్నారని వారు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల్లో మూడింట రెండు వంతుల మంది మృత్యువాత పడుతుంటే, ప్రతి పదిమంది సర్వైకల్ రోగుల్లో తొమ్మిది మంది మృత్యువాత పడుతున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. గర్భిణి, ప్రసవం సమస్యల కారణంగా మరణిస్తున్న మహిళలకన్నా మూడురెట్లు ఎక్కువ మంది మహిళలు ఈ రెండు క్యాన్సర్ల వల్ల మరణిస్తున్నారని వారు తెలిపారు. ప్రపంచంలో ప్రతి వ్యక్తి కేవలం 1.72 డాలర్లను వెచ్చించడం వల్ల పెద్ద సంఖ్యలో మహిళల మృతులను అరికట్టవచ్చని వారు చెబుతున్నారు. ప్రపంచంలో 2030 నాటికి బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల సంఖ్య 32 లక్షల రూపాయలకు, సర్వైకల్ క్యాన్సర్ రోగుల సంఖ్య ఏడు లక్షలకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మరో నాలుగేళ్లలో బాలికలకు 'పాపిలోమా' (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్ చేయడం ద్వారా వారికి సర్వైకల్ క్యాన్సర్‌ను వారికి రాకుండా అరికట్టవచ్చని వారు తెలిపారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది బాలికలకు పాపిలోమా వ్యాక్సినేషన్ చేయించాలని వారు ప్రపంచ ఆరోగ్య సంస్థకు సిఫార్సు చేశారు.