Service Awards
-
ప్రగతి పథంలో దక్షిణమధ్య రైల్వే
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే జోన్ ప్రగతి పథంలో పరుగులు తీస్తుందని జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంకితభావంతో, అత్యుత్తమ సేవలను అందజేయడమే ఈ ప్రగతికి కారణమని చెప్పారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించిన 68వ రైల్వే వారోత్సవాలలో జీఎం అరుణ్‌కుమార్ జైన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలందించిన 77 మంది అధికారులు, ఉద్యోగులకు విశిష్ట రైల్ సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ..ఈ ఏడాది 383.85 కి.మీ. కొత్త ట్రాక్‌లతో కొత్త ప్రాంతాలకు రైల్వే సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ‘మిషన్ ఎలక్ట్రిఫికేషన్’ సాధించే దిశగా రికార్డు స్థాయిలో 1,017 రూట్ కి.మీ.ని విద్యుదీకరించినట్లు తెలిపారు. ఈ ఆర్థిక ఏడాదిలో రూ. 21,635.49 కోట్ల అత్యధిక ఆదాయాన్ని ఆర్జించామన్నారు. అందులో 131.854 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.13,051.09 కోట్ల ఆదాయం లభించిందన్నారు. అదనపు జనరల్ మేనేజర్ ఆర్.ధనుంజయులు, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అరవింద్ మల్ఖేడే, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎ.శ్రీధర్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, డివిజనల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు. -
వలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేసిన సీఎం
-
పరిపాలన ఇలా కూడా చేయవచ్చని వాలంటీర్లు నిరూపించారు: సీఎం జగన్
-
గ్రామ, వార్డు వలంటీర్లకు సెల్యూట్: సీఎం జగన్
సాక్షి, కృష్ణా జిల్లా: సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాలను ఇంటి గడప వద్దే ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని వారికి సత్కారం, అవార్డుల ప్రదానోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి చేపట్టింది. కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం పోరంకిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను సీఎం వైఎస్ జగన్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ, వార్డు వలంటీర్లందరికీ అభినందనలు తెలిపారు. పరిపాలన అంతా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా జరుగుతోందని.. లంచం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నారని ప్రశంసించారు. ‘‘ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే చేరుస్తూ మన్ననలు పొందుతున్నారు. రూపాయి లంచం లేకుండా పెన్షన్ అందిస్తున్న మీరు గొప్ప సైనికులు. పేదల బాధలు తెలుసుకున్న మీరు గొప్ప మనస్సున్నవారు. ఒక వ్యవస్థలో వివక్ష లేకుండా వాలంటీర్లు పని చేస్తున్నారు. కుటుంబంలో ఒక వ్యక్తిలా నేడు వాలంటీర్ భావిస్తున్నారు. ఇలాంటి వ్యవస్థపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మీరు క్రమశిక్షణతో ఉండి.. ఇలాంటి విమర్శలు పట్టించుకోవద్దు. పండ్లు ఉన్న చెట్టుపైనే రాళ్లు వేస్తారు.. వారి పాపానికి వారే బాధ్యులు. ధర్మాన్ని నెరవేర్చాలని కోరుతున్నా. మానవ సేవే మాధవ సేవ.. అని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో కూడా మరింత సేవ అందించాలని కోరుతున్నానని’’ సీఎం జగన్ అన్నారు. సేవా దృక్పథం పనిచేస్తున్న వాలంటీర్లకు అవార్డులు అందజేస్తున్నాం. అత్యుత్తమ సేవలను వాలంటీర్లు అందిస్తున్నారు. సేవా మిత్ర అవార్డుకు రూ.10 వేలు, సేవా రత్న అవార్డుకు రూ.20 వేలు, సేవా వజ్ర అవార్డుకు రూ.30 వేలతో వాలంటీర్లకు పురస్కారాలు అందజేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ పురస్కారాలకు ప్రభుత్వం 240 కోట్లు ఖర్చు చేస్తోందని సీఎం పేర్కొన్నారు. ఈ పురస్కారాలను ప్రతి సంవత్సరం అందిస్తామని వెల్లడించారు. నేటి నుంచి ప్రతి జిల్లాలో రోజుకొక నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు కుళ్లుకుంటున్నారు: పేర్ని నాని జగనన్న సైన్యం సేవ చూసి చంద్రబాబు కుళ్లుకుంటున్నారని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. నేడు ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. మాట తప్పకుండా ప్రజలకు సీఎం జగన్ సేవ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ పాలన చూసి దేశం మొత్తం గర్వపడుతోందన్నారు. సీఎం జగన్ పథకాలను మిగతా రాష్ట్రాల సీఎంలు కాపీ కొడుతున్నారన్నారు. రాష్ట్రం మొత్తంలో వలంటీర్ పేరు చెప్పలేని ఇల్లు ఉండదని.. గ్రామ వార్డు వాలంటీర్లు అందరూ బాగా పని చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా పనిచేయాలని కోరుతున్నానని మంత్రి పిలుపునిచ్చారు. దేశం యావత్తూ ఏపీ వైపు: పార్థసారథి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ, ప్రజలకు మేలు చేసేందుకు సీఎం జగన్ నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్ వైపునకు సీఎం జగన్ నడిపిస్తున్నారన్నారు. దేశంలో ఎంతో మంది నేతలు వలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్నారని.. ప్రధాని మోదీ కూడా వాలంటీర్ల వ్యవస్థను ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి.. దేశం యావత్తూ ఏపీ వైపు చూస్తోందన్నారు. ‘‘ప్రజాసమస్యలకు గ్రామాలే వేదికలుగా మారాయి. దళారీ చేతుల్లో బందీలు కాకుండా సమస్యలు పరిష్కారమవుతున్నాయి. అవినీతి లేని పారదర్శక పాలన రాష్ట్రంలో సాగుతోంది. సీఎం జగన్ పాలనలో ప్రతి పేదవారికి ఒక భరోసా దొరికింది. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం సాకారమైందని’’ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. చదవండి: టీడీపీ– జనసేన లోపాయికారి ఒప్పందం! రాష్ట్రంలో రూ.3,300 కోట్లతో రోడ్ల నిర్మాణం -
ముగ్గురు రైస్ మిల్లర్లకు సేవా అవార్డులు
పెనుమంట్ర, న్యూస్‌లైన్ : భారత గణతంత్ర వేడుకల్లో పెనుమంట్ర మండలానికి చెందిన ఇద్దరి రైస్‌మిల్లర్లతోపాటు తణుకు మండలం వేల్పూరుకు చెందిన ఓ రైస్‌మిల్లర్‌కు జిల్లా సేవా అవార్డులు దక్కాయి. 2012-13 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వానికి లెవీ బియ్యం సేకరణలో ఆలమూరు వంశీతేజ మోడరన్ రైస్‌మిల్ అధినేత, రాష్ట్ర రైస్‌మిల్లర్స్ అసోషియేషన్ ఉపాధ్యక్షుడు నూకల వెంకటసత్యనారాయణ (చిట్టిబాబు) ప్రథమ అవార్డుకు ఎంపికయ్యారు. మల్లిపూడిలోని గుడిమెట్ల సుందరరామిరెడ్డి అండ్‌కో అధినేత గుడిమెట్ల రామకృష్ణారెడ్డి ద్వితీయ అవార్డుకు ఎంపికకాగా, తణుక మండలం వేల్పూరుకు చెందిన శ్రీరామలింగేశ్వరా రైస్‌మిల్ అధినేత బండారు గోవిందు తృతీయ అవార్డుకు ఎంపికయ్యారు. వీరితోపాటు పెనుమంట్ర మండల పరిషత్ పరిధిలో వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, వాటిని త్వరితగతిన పూర్తి చేయడంలో సఫలీకృతులైన ఎంపీడీవో ఎస్.వెంకటేశ్వర్రావు ఉత్తమ సేవా అవార్డు దక్కించుకున్నారు. వీరు ఏలూరులో ఆదివారం కలెక్టర్ సిద్ధార్థ జైన్ చేతులమీదుగా ఉత్తమసేవా అవార్డులు, ప్రశంసా పత్రాలను అందుకున్నారు. రైస్‌మిల్లర్లలో ద్వితీయ అవార్డుకు ఎంపికైన గుడిమెట్ల రామకృష్ణారెడ్డికి బదులుగా ఆయన సోదరుడు, మరో మేనేజింగ్ పార్టనర్ గుడిమెట్ల సుందరరామిరెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా వీరిని పలువురు అభినందించారు.