Sethu
-
తిరుపతిలో ట్రాఫిక్ మళ్లింపు.. ఇవి గమనించండి!
సాక్షి, తిరుపతి: నగరంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిపై శ్రీనివాస సేతు ప్రాజెక్టు పనుల నేపథ్యంలో వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ వైపునకు వచ్చే వాహనాలు, వెళ్లే వాహనాలను తాత్కాలికంగా మళ్లిస్తున్నామన్నారు. ఈ మార్పు శుక్రవారం నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. బెంగళూరు, చిత్తూరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రామానుజపల్లి చెక్‌పోస్ట్ వద్ద నుంచి శ్రీపద్మావతి మహిళా యునివర్సిటీ, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా బస్టాండుకు చేరుకోవచ్చు. చంద్రగిరి టౌన్, చెర్లోపల్లి, జూపార్క్, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవచ్చు . మదనపల్లి, పీలేరు, రాయచోటి, అనంతపురం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు చెర్లోపల్లి సర్కిల్, బాలాజి కాలనీ, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ చేరుకుంటాయి. చెర్లోపల్లి, జూపార్క్, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవచ్చు. లైట్ మోటార్ వాహనాలు: బస్టాండ్ నుంచి రేణిగుంటకు.. రామానుజం సర్కిల్, లక్ష్మీపురం సర్కిల్ వైపు వెళ్లాలంటే డీబీఆర్ హాస్పిటల్ మీదుగా హీరో హోండా షోరూమ్ వద్ద రైల్వే లెవెల్ క్రాసింగ్ దాటుకొని వెళ్లవచ్చు. ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు రైల్వే లెవెల్ క్రాసింగ్ ఉన్నట్లు గుర్తించగలరు. పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులు: రేణిగుంట మీదుగా నారాయణాద్రి హాస్పిటల్, తిరుచానూర్ ఫ్లై ఓవర్, ఆర్సీపురం జంక్షన్, ఎమ్మార్‌పల్లి పోలీసు స్టేషన్, అన్నమయ్య సర్కిల్, వెస్ట్ చర్చ్, బాలాజి కాలనీ, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ చేరుకుంటాయి. హైదరాబాద్, కర్నూల్, కడప వాహనాలు కరకంబాడి మీదుగా బస్టాండు చేసుకోవచ్చు. నెల్లూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, పుత్తూరు, చెన్నై నుంచి వచ్చే వాహనాలు రేణిగుంట రమణవిలాస్ సర్కిల్ మీదుగా కరకంబాడి, మంగళం లీలామహల్ మీదుగా వెళ్లచ్చు. లేకుంటే, గాజులమండ్యం జంక్షన్, ఆర్సీ పురం జంక్షన్, రామానుజపల్లి చెక్ పోస్ట్, మహిళా యునివర్సిటీ, బాలాజి కాలనీ, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా బస్టాండ్ చేరుకోవచ్చు. అత్యవసర వాహనాలు ట్రాఫిక్ మళ్లింపు కారణంగా అంబులెన్స్, మెడికల్, ప్రభుత్వ వాహనాలకు, రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరూ సహకరించాలి. అలాగే ఉద్యోగస్తులు, స్థానిక ప్రజలు, విద్యాసంస్థలు తమ విద్యార్థుల రవాణా సౌకర్యార్థం అనువైన మార్గాన్ని ఎంచుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తిరుపతి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. (క్లిక్: హృదయ విదారకం; నాన్నను చూడాలంటూనే.. మృత్యువొడికి) -
శ్రీనివాస సేతుపై స్మార్ట్ జర్నీ! వాహనాలకు అనుమతి
-
ఆధ్యాత్మిక గిరిలో శ్రీనివాస సేతు వెలుగులు!
-
ట్విటర్ ట్రెండింగ్.. విక్రమ్ సినిమాకు 21 ఏళ్లు
విభిన్నమైన కథాంశం కలిగిన చిత్రాలను ఎంచుకోవడంలో నటుడు చియాన్ విక్రమ్ ముందు వరుసలో ఉంటాడు. సూపర్‌స్టార్ కమల్ హాసన్ తర్వాత అంతటి విలక్షణ నటుడు ఎవరంటే తడుముకోకుండా చెప్పే పేరు విక్రమ్. తన నటనను చూస్తే ఎవ్వరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తమిళంతో పాటు తెలుగులో ఎంతో గుర్తింపుతెచ్చుకున్న విక్రమ్‌ను ముద్దుగా అభిమానులు చియాన్ అని పిలుస్తుంటారు. ప్రతీ సినిమాలోనూ ఓ డిఫెరెంట్ లుక్‌తో కనిపించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇక అపరిచితుడు సినిమాతో నటనలోని తన విశ్వరూపాన్ని చూపించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు విక్రమ్. అపరిచితుడు, జెమిని, సేతు, పితామగన్ లాంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులనే కాదు.. సినీ విమర్శకులను మెప్పించింది. చదవండి: హీరో విక్రమ్ ఇంటికి బాంబు బెదిరింపులు కాగా 1999లో వచ్చిన సేతు సినిమా విక్రమ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. నటుడిగా విక్రమ్‌కు ఈ సినిమా బిగ్ బ్రేక్‌ను అందించింది. ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డును అందుకోవడంతోపాటు మరిన్ని అవార్డులను సొంతం చేసుకుంది. తమిళంలో సేతు సూపర్ హిట్ విజయాన్ని సాధించడంతో తెలుగులో శేషుగా, కన్నడలో హుచ్చా, హిందీలో తేరే నామ్ పేరుతో రీమేక్ చేశారు. బాల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇళయారాజా సంగీతం అందించారు. ఈ సినిమా విడుదలై నేటికి 21 వసంతలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విక్రమ్ అభిమానులు #21YearsOfEpicSETHU అనే హ్యష్ ట్యాగ్‌ను ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. ☆Filmfare Awards South ●Best Film- Sethu ●Best Director- Bala ●Special Jury Award- Vikram ☆National Film Awards ●Best Feature Film in Tamil- Sethu ☆TN State Film Awards (1999) ●Best Director- Bala ●Spl Prize for Best Actor-Vikram#21YearsOfEpicSETHU pic.twitter.com/TbaYrENRA3 — Midhun Murali Lee (@lee_midhun) December 9, 2020 Here we go.🔥 HashTag to celebratet 21 Years Of SETHU Tag :#21YearsOfEpicSETHU pic.twitter.com/DRfVmdkjne — 👑 கரிகாலன் 👑 (@Chiyaan_muni2) December 9, 2020 -
ఆళుక్కు పాది 50-50 చిత్రంలో సేతు
యాక్టర్ అయిన డాక్టర్ సేతు. కన్నా లడ్డు తిన్న ఆశైయా చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేసిన ఈయన వాలిభరాజా చిత్రంతో సోలో హీరోగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంతో ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యారు. ప్రస్తుతం సేతు ఆళుక్కు పాది 50-50 అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా 144 చిత్రం ఫేమ్ శ్రుతిరామక్రిష్ణన్ నాయకిగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో బాలశరవణన్, మయిల్సామి, పట్టిమండ్రం రాజా, లోల్లుసభ స్వామినాథన్, మదన్‌బాబు, శ్రీరంజని, జాన్‌విజయ్, నాన్‌కడవుల్ రాజేంద్రన్, మునీష్ఖాన్ నటిస్తున్నారు. ఒక ప్రధాన పాత్రలో ప్రముఖ నటిని నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. అలెక్స్ కథను అందించిన ఈ చిత్రానికి క్రిష్ణసాయి అనే నవదర్శకుడు పరిచయం అవుతున్నారు. లిపి సినీక్రాఫ్ట్స్ పతాకంపై వీఎన్.రంజిత్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాజీవనం యాంత్రికంగా మారిపోతుందన్నారు. అలాంటి వారు సినిమా థియేటర్లకు వచ్చేది కాస్త సేద తీరడానికేనన్నారు.అలాంటి వారికి పూర్తి వినోదాన్నిచ్చే చిత్రంగా ఆళుక్కు 50-50 ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, కుంభకోణం పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పాటలను విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి ఆర్కే.ప్రతీప్ చాయాగ్రహణం,ధరణ్‌కుమార్ సంగీత్నాన్ని అందిస్తున్నారని దర్శకుడు తెలిపారు. -
అట్టహాసంగా ప్రారంభమైన స్వాతంత్య్ర వేడుకలు
మదనపల్లెక్రైం: మదనపల్లె బీటీ కళాశాల ఆవరణలో 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గురువారం రాత్రి అట్టహాసంగా ప్రారంభించారు. విజయభారతి పాఠశాల ప్రిన్సిపాల్ సేతు అధ్యక్షత వహిం చారు. ముఖ్య అతిథులుగా సబ్‌కలెక్టర్ నారాయణ్భరత్గుప్త, ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లె నరసింహారెడ్డి, బీజేపీ నాయకులు చిన్నావాసు దేవరెడ్డి, అధికారులను వేదికపైకి ఆహ్వానించారు. జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ఆరంభమయ్యాయి. ముందుగా విజయభారతి పాఠశాల విద్యార్థులతో భరత మాత నృత్యగీతాన్ని ప్రదర్శిం చారు. అనంతరం వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. నృత్యాలు చేశారు. ఈ వేడుకలకు 5వేల మందికిపైగా ప్రజలు హాజరయ్యూరు. రాత్రి 12గంటలకు వేడుకలు ముగిశాయి. మదనపల్లె డీవైఈవో శామ్యూ ల్, వన్‌టౌన్ సీఐ శివన్న, ఎంవీఐ కరుణసాగర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరామ్‌చినబాబు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు నరేంద్రబాబు, ఫైన్ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ జర్మన్‌రాజు, ఆర్ఎస్ఎస్ ఆనంద్, కుమార్, శంకర, పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు వీరజవాన్ భానుప్రకాష్‌కు నివాళులు అర్పించారు. ఆయన తల్లిని, సతీమణిని శాలువతో సత్కరించారు. -
'మనసు మాయ సేయకే'
ప్రిన్స్, రిచా పనయ్, దిశాపాండే, సేతు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మనసు మాయ సేయకే' రివేంజ్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాకు సురేష్ పి కుమార్ దర్శకుడ ఆగస్టు 14న 'మనసు మాయ సేయకే' ఆడియో విడుదలకానుంది.