అట్టహాసంగా ప్రారంభమైన స్వాతంత్య్ర వేడుకలు
మదనపల్లెక్రైం: మదనపల్లె బీటీ కళాశాల ఆవరణలో 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గురువారం రాత్రి అట్టహాసంగా ప్రారంభించారు. విజయభారతి పాఠశాల ప్రిన్సిపాల్ సేతు అధ్యక్షత వహిం చారు. ముఖ్య అతిథులుగా సబ్‌కలెక్టర్ నారాయణ్‌భరత్‌గుప్త, ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లె నరసింహారెడ్డి, బీజేపీ నాయకులు చిన్నావాసు దేవరెడ్డి, అధికారులను వేదికపైకి ఆహ్వానించారు. జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ఆరంభమయ్యాయి.
ముందుగా విజయభారతి పాఠశాల విద్యార్థులతో భరత మాత నృత్యగీతాన్ని ప్రదర్శిం చారు. అనంతరం వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. నృత్యాలు చేశారు. ఈ వేడుకలకు 5వేల మందికిపైగా ప్రజలు హాజరయ్యూరు. రాత్రి 12గంటలకు వేడుకలు ముగిశాయి. మదనపల్లె డీవైఈవో శామ్యూ ల్, వన్‌టౌన్ సీఐ శివన్న, ఎంవీఐ కరుణసాగర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరామ్‌చినబాబు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు నరేంద్రబాబు, ఫైన్‌ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ జర్మన్‌రాజు, ఆర్‌ఎస్‌ఎస్ ఆనంద్, కుమార్, శంకర, పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు వీరజవాన్ భానుప్రకాష్‌కు నివాళులు అర్పించారు. ఆయన తల్లిని, సతీమణిని శాలువతో సత్కరించారు.