ఆళుక్కు పాది 50-50 చిత్రంలో సేతు | Sethu in Alukku padi 50-50 | Sakshi
Sakshi News home page

ఆళుక్కు పాది 50-50 చిత్రంలో సేతు

Published Fri, Apr 8 2016 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

ఆళుక్కు పాది 50-50 చిత్రంలో సేతు

ఆళుక్కు పాది 50-50 చిత్రంలో సేతు

యాక్టర్ అయిన డాక్టర్  సేతు. కన్నా లడ్డు తిన్న ఆశైయా చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేసిన ఈయన వాలిభరాజా చిత్రంతో సోలో హీరోగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంతో ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యారు. ప్రస్తుతం సేతు ఆళుక్కు పాది 50-50 అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా 144 చిత్రం ఫేమ్ శ్రుతిరామక్రిష్ణన్ నాయకిగా నటిస్తున్నారు.
 
 ఇతర ముఖ్య పాత్రల్లో బాలశరవణన్, మయిల్‌సామి, పట్టిమండ్రం రాజా, లోల్లుసభ స్వామినాథన్, మదన్‌బాబు, శ్రీరంజని, జాన్‌విజయ్, నాన్‌కడవుల్ రాజేంద్రన్, మునీష్‌ఖాన్ నటిస్తున్నారు. ఒక ప్రధాన పాత్రలో ప్రముఖ నటిని నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. అలెక్స్ కథను అందించిన ఈ చిత్రానికి క్రిష్ణసాయి అనే నవదర్శకుడు పరిచయం అవుతున్నారు.
 
 లిపి సినీక్రాఫ్ట్స్ పతాకంపై వీఎన్.రంజిత్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాజీవనం యాంత్రికంగా మారిపోతుందన్నారు. అలాంటి వారు సినిమా థియేటర్లకు వచ్చేది కాస్త సేద తీరడానికేనన్నారు.అలాంటి వారికి పూర్తి వినోదాన్నిచ్చే చిత్రంగా ఆళుక్కు 50-50 ఉంటుందన్నారు.
 
 చిత్ర షూటింగ్‌ను చెన్నై, కుంభకోణం పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పాటలను విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి ఆర్‌కే.ప్రతీప్ చాయాగ్రహణం,ధరణ్‌కుమార్ సంగీత్నాన్ని అందిస్తున్నారని దర్శకుడు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement