sevadal
-
గాడ్సే – సావర్కర్ల సంబంధం!
ముంబై: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేకు, ప్రముఖ హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌కు శారీరక సంబంధం ఉందని కాంగ్రెస్ అనుబంధ ‘సేవాదళ్’ పేర్కొనడంపై బీజేపీ, శివసేన మండిపడ్డాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సేవాదళ్ విడుదల చేసిన ఒక బుక్‌లెట్‌లో ఆ విపరీత వ్యాఖ్యలను పొందుపర్చారు. దీనిపై మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షం శివసేన స్పందిస్తూ.. సావర్కర్ గురించి కాంగ్రెస్ నేతల మెదళ్లలో చెత్త ఉందని వ్యాఖ్యానించింది. సావర్కర్ దేశభక్తిని, వీరత్వాన్ని ప్రశ్నించడం ద్వారా వారు తమను తాము కించపర్చుకుంటున్నారని సేన ఎంపీ సంజయ్‌రౌత్ పేర్కొన్నారు. సావర్కర్‌పై వికృతబుద్ధితో చేసిన అర్థపర్థం లేని వ్యాఖ్యలు అవని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వీర్ సావర్కర్: కిత్నే ‘వీర్’! పేరుతో సేవాదళ్ ఆ బుక్లెట్ విడుదల చేసింది. -
ప్రణాళికాబద్ధంగా సేవాదళ్ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సేవాదళ్‌ను బలంగా నిర్మించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నామని ఆలిండియా కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్జీ దేశాయ్ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని అహ్మదాబాద్‌కు వెళుతున్న సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన బుధవారం గాంధీభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్దన్‌రెడ్డి, సేవాదళ్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. సేవాదళ్‌ను క్రమశిక్షణగల సైన్యంగా నిర్మించబోతున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సేవాదళ్ విశేషంగా కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సేవాదళ్ పరిస్థితులను జనార్దన్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి హైదరాబాద్‌లో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర సేవాదళ్ నేతలు యుగంధర్‌రెడ్డి, కిరణ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల అభిమానాన్ని చురగొంటున్న పోలీసు సేవాదళ్
- కొనియాడిన జిల్లా ఎస్పీ – స్టేట్‌బ్యాంకు వద్ద ఖాతాదారులకు పెరుగన్నం పంపిణీ కర్నూలు: పోలీస్ సేవాదళ్ క్రమశిక్షణకు, నిబద్ధతతకు మారుపేరుగా నిలవ్వడమే కాక సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజల అభిమానాన్ని చురగొంటుందని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ కొనియాడారు. సద్గురు దత్త కృపాలయం ఆధ్వర్యంలో నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ పక్కనగల ఎస్బీఐ మెయిన్ బ్రాంచి వద్ద గంటల తరబడి క్యూలో నిలిచి ఉన్న ఖాతాదారులకు మంగళవారం మధ్యాహ్నం సద్గురుదత్త సిబ్బంది, పోలీసు సేవాదళ్, బ్యాంకు మేనేజర్లు కలిసి పెరగన్నం, వాటర్ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రూ.500, రూ.1000 నోట్లు రద్దుతో వాటిని మారు్చకునేందుకు ఖాతాదారులు క్యూ కడుతున్నారన్నారు. వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సద్గురుదత్త కృపాలయం పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడానికి ముందుకొచ్చిందన్నారు. ఆంధ్రాబ్యాంకు, ఎస్బీఐలోనే కాకుండా, నగరంలోని వివిధ బ్యాంకుల బ్రాంచీల్లో అవసరాన్ని బట్టి పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా బ్యాంకుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. ప్రజల్లో విశ్వాసం, ధైర్యం కలిగించే విధంగా పోలీస్ సేవాదళ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారని చెప్పారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ఎస్బీఐ అసిస్టెంటు జనరల్ మేనేజర్ మురళీధర్, సీఐలు డేగల ప్రభాకర్, నాగరాజరావు, సద్గురుదత్త కృపాలయ వైస్ ప్రసిడెంట్ శ్రీనివాసరావు, పోలీసు సేవాదళ్ సిబ్బంది ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.