
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సేవాదళ్‌ను బలంగా నిర్మించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నామని ఆలిండియా కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్‌జీ దేశాయ్ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని అహ్మదాబాద్‌కు వెళుతున్న సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన బుధవారం గాంధీభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్దన్‌రెడ్డి, సేవాదళ్ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
సేవాదళ్‌ను క్రమశిక్షణగల సైన్యంగా నిర్మించబోతున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సేవాదళ్ విశేషంగా కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సేవాదళ్ పరిస్థితులను జనార్దన్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి హైదరాబాద్‌లో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర సేవాదళ్ నేతలు యుగంధర్‌రెడ్డి, కిరణ్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment