7 రాష్ట్రాల్లో అబార్షన్ హక్కుల విజయం
వాషింగ్టన్: అబార్షన్ హక్కులు ఏడు రాష్ట్రాల్లో విజయం సాధించారు. అత్యంత నిర్బంధ గర్భస్రావం నిషేధాన్ని రద్దు చేయడానికి మిస్సోరి ఓటర్లు మార్గం సుగమం చేశారు. అరిజోనా, కొలరాడో, మేరీల్యాండ్, మోంటానాలో అబార్షన్ హక్కుల సవరణలు కూడా ఆమోదం పొందాయి. నెవాడా ఓటర్లు ఒక సవరణను ఆమోదించారు. అది అమల్లోకి రావాలంటే వారు దానిని 2026లో మళ్లీ ఆమోదించాల్సి ఉంటుంది. ఫ్లోరిడా, నెబ్రాస్కా, సౌత్ డకోటా రాష్ట్రాల ఓటర్లు మాత్రం రాజ్యాంగ సవరణపై విముఖత వ్యక్తం చేశారు. అబార్షన్ నిషేధాన్ని రద్దు చేసిన రో వర్సెస్ వేడ్ తీర్పును అమెరికా సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్న చాలా రాష్ట్రాల్లో నిషేధాలు అమల్లోకి రావడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రస్తుతం 13 రాష్ట్రాలు కొన్ని మినహాయింపులతో గర్భధారణ అన్ని దశలలో నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆరు వారాలు, మరికొన్ని నాలుగు వారాల తరువాత గర్భస్రావాన్ని నిషేధించాయి. అబార్షన్ రాష్ట్రాలకు వదిలేయాల్సిన అంశమని రిపబ్లికన్ అభ్యరి్థగా పదేపదే చెప్పిన ట్రంప్... ఇప్పుడు అధ్యక్షుడిగా కార్యనిర్వాహక చర్య ద్వారా అబార్షన్ హక్కులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిషేధాన్ని ఎత్తేసిన మిస్సోరీ.. ఏ దశలోనైనా గర్భస్రావానికి హక్కును కలి్పస్తూ, అబార్షన్‌పై నిషేధాన్ని ఎత్తివేసే మొదటి రాష్ట్రంగా మిస్సోరి నిలిచింది. గర్భస్రావం, జనన నియంత్రణ, గర్భధారణ చుట్టూ నిర్ణయాలు వ్యక్తిగతమైనవని, వాటిని రాజకీయాలు కాకుండా వ్యక్తులకే వదిలేయాలనే హక్కులకు ఓటేసి మిస్సోరియన్లు చరిత్రను సృష్టించారు. మూడు రాష్ట్రాల్లో ఆంక్షలుఫ్లోరిడా, నెబ్రాస్కా, సౌత్ డకోటా రాష్ట్రాలు అబార్షన్‌పై నిషేధాన్ని సమరి్ధంచాయి. అబార్షన్ వ్యతిరేకులు బ్యాలెట్ పద్ధతిలో విజయం సాధించారు. ఫలితంగా రిపబ్లికన్ గవర్నర్ రాన్ డిశాంటిస్‌కు రాజకీయ విజయం లభించింది. ఈ ఫలితం ఫ్లోరిడాలో, మొత్తం దేశానికి ఒక ముఖ్యమైన విజయమని జాతీయ గర్భస్రావ వ్యతిరేక గ్రూపు ఎస్బీఏ ప్రో–లైఫ్ అమెరికా అధ్యక్షుడు మార్జోరీ డాన్నెన్ఫెల్సెర్ ప్రకటించారు. కొన్ని మినహాయింపులు మినహా గర్భస్రావంపై నిషేధం ఉన్న మరో రాష్ట్రమైన సౌత్ డకోటా సైతం అబార్షన్ హక్కులకు వ్యతిరేకంగా ఓటేసింది. అబార్షన్ హక్కులను కల్పించే రాజ్యాంగ సవరణను నెబ్రాస్కా ఓటర్లు తిరస్కరించారు. ఆమోదం తెలిపిన ఏడు రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలు అబార్షన్ హక్కుల చట్ట సవరణకు ఆమోదం తెలిపాయి. గర్భం దాలి్చన మొదటి 15 వారాల తర్వాత అబార్షన్‌ను నిషేధించే ప్రస్తుత చట్టాన్ని సవరణకు అరిజోనా ఆమోదం తెలిపింది. గర్భస్రావ హక్కులను ఇప్పటికే అనుమతించిన మేరీలాండ్‌లో ఈ ఫలితాలు పెద్ద తేడాను చూపవు. మిస్సోరిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ గర్భస్రావం ఇప్పటికే చట్టబద్ధమైనది. కొలరాడోలో 55% ఓటర్లు అబార్షన్ హక్కులకు మద్దతును ప్రకటించారు. గర్భస్రావం కోసం రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ నిధులను ఉపయోగించడాన్ని నిషేధించిన గత సవరణను కూడా ఇది రద్దు చేయనుంది. స్టేట్ మెడికేడ్, ప్రభుత్వ ఉద్యోగుల భీమా పథకాలు గర్భస్రావాన్ని కవర్ చేసే అవకాశాన్ని కూడా ఇది కలి్పంచనుంది. న్యూయార్క్ సమాన హక్కుల చట్టం కూడా ఆమోదం పొందింది. ఇందులో ‘గర్భస్రావం’అనే పదం లేకపోయినా.. గర్భధారణ ఫలితాలు, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ, స్వయంప్రతిపత్తి ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. ఇది న్యూయార్క్ వాసులందరికీ గొప్ప విజయమని ఈక్వల్ రైట్స్ క్యాంపెయిన్ డైరెక్టర్ సాషా అహుజా ప్రకటించారు.